dove
-
డవ్ షాంపూ వాడే వాళ్ళకి షాక్... రీకాల్ చేసిన కంపెనీ
-
అలర్ట్: పాపులర్ డవ్, ఇతర షాంపూల్లో కేన్సర్ కారక కెమికల్స్,రీకాల్
సాక్షి,ముంబై: ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ యూనీ లీవర్ తన వినియోగదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. డవ్, ట్రెస్మే, నెక్సస్, సువేవ్, టిగీ లాంటి షాంపూల్లో కేన్సర్ కారక కెమికల్ ఉన్నట్టు గుర్తించిన కారణంగా వాటిని భారీ ఎత్తున రీకాల్ చేసింది. ఈ నేపథ్యంలో కలుషితమైన ఏరోసోల్ డ్రై షాంపూ ఉత్పత్తుల వినియోగాన్ని నిలిపి వేయాలని వినియోగదారులకు కంపెనీ సూచించింది. వీటిని వినియోగించడం ప్రమాదమంటూ హెచ్చరిక జారీ చేసింది. యూనిలీవర్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వెబ్సైట్లో రీకాల్ వివరాలను అక్టోబర్ 18న ప్రకటించింది. రీకాల్ చేసిన వాటిల్లో అక్టోబరు 2021కి ముందు తయారు చేసిన డ్రై షాంపూ ఏరోసోల్ ఉత్పత్తులున్నాయని యునిలీవర్ తన నివేదికలో తెలిపింది. తమ అంతర్గత పరిశోధనలో ఏరోసోల్స్ ప్రొపెల్లెంట్ కేన్సర్ కారకం బెంజీన్కు మూలమని కనుగొన్నట్లు తెలిపింది. వీటి వాడకంతో బెంజీన్ స్థాయిలు పెరిగే అవకాశం ఉన్నందున అమెరికాలో పంపిణీ చేసిన ఉత్పత్తులు అన్నింటినీ రీకాల్ చేశామనీ, ఆయా ఉత్పత్తులను షెల్ఫ్‌ల నుండి తీసివేయమని రిటైలర్లను కోరింది. కాగా బెంజీన్ అధిక స్థాయిలోశరీరంలో చేరితే లుకేమియా, ప్రాణాంతక రక్త రుగ్మతలు, బోన్ మారో క్యాన్సర్ వంటి క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే స్ప్రై ఆన్ డ్రై షాంపూలలో ప్రమాదకరమైన కలుషితాలను గుర్తించడం ఇదే మొదటి సారి కాదు. తాజా పరిణామంతో వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులలో ఏరోసోల్‌ల భద్రత మరోసారి ప్రశ్నార్థకమైంది. గత ఏడాదిన్నర కాలంలో, జాన్సన్ అండ్ జాన్సన్స్ న్యూట్రోజెనా, ఎడ్జ్‌వెల్ పర్సనల్ కేర్ కంపెనీకి చెందిన బనానా బోట్ లాంటి ఉత్పత్తులను మార్కెట్ నుంచి వెనక్కి తీసుకున్నాయి.అలాగే ప్రోక్టర్ అండ్ గాంబుల్ స్ప్రే-ఆన్ యాంటీ పెర్స్పిరెంట్‌లు సీక్రెట్ అండ్ ఓల్డ్ స్పైస్, యూనిలివర్స్ సువేవ్ లాంటి ఉత్పత్తులలో బెజీన్ కనుగొనడం, రీకాల్ చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. -
ఏపీలో డావ్ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఉన్న చైనాకు చెందిన డావ్ ఈవీటెక్.. భారత్‌లో ఆటోమొబైల్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నానికి దగ్గరలో దీనిని నెలకొల్పనుంది. 200 ఎకరాల స్థలం కేటాయించాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నట్లు కంపెనీ డైరెక్టర్ బాలాజీ అచ్యుతుని సోమవారమిక్కడ మీడియాకు వెల్లడించారు. ఏటా 5 లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యంతో ప్లాంటును ఏర్పాటు చేస్తామన్నారు. ఇంక్యుబేషన్ సెంటర్‌తోపాటు బ్యాటరీ, చాసిస్, కంట్రోలర్స్, మోటార్ల తయారీ సైతం ఇక్కడ చేపడతామని చెప్పారు. నవంబర్‌లో ఈ కాంప్లెక్స్ నుంచి తొలి ఉత్పాదన రెడీ అయ్యే అవకాశముందన్నారు. మూడేళ్లలో రూ.700 కోట్లు ఖర్చు చేస్తామని, ప్రత్యక్షంగా 2,000 మందికి, పరోక్షంగా 3,000 మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. 40 దాకా అనుబంధ పరిశ్రమలు వస్తాయన్నారు. ఫిబ్రవరిలో తొలి వాహనం.. డావ్ ఈవీటెక్ భారత్‌లో తొలి వాహనాన్ని ఫిబ్రవరిలో విడుదల చేస్తోంది. వచ్చే ఏడాది ఆరు మోడళ్లను ప్రవేశపెడతామని డావ్ ఈవీటెక్ చైర్మన్ మైఖేల్ లియో వెల్లడించారు. అంతర్జాతీయంగా 25 ఏళ్లపాటు ఎలక్ట్రిక్ వాహన రంగంలో సాధించిన అనుభవంతో భారత్‌లో అడుగుపెడుతున్నట్టు చెప్పారు. గంటకు 25 కిలోమీటర్ల లోపు వేగంతో ప్రయాణించే లో స్పీడ్ మోడళ్లు 3... అలాగే 25 కిలోమీటర్లకంటే వేగంగా ప్రయాణించే హై స్పీడ్ మోడళ్లు 3 అందుబాటులోకి తెస్తారు. వీటిలో ఇంటర్నెట్తో అనుసంధానించిన వాహనాలు కూడా ఉంటాయని కంపెనీ సీవోవో లానా జోయో తెలిపారు. కాగా, వాహనాల ధర లోస్పీడ్ అయితే రూ.50–75 వేలు, హై స్పీడ్ మోడళ్లు రూ.75 వేల నుంచి రూ.1 లక్ష వరకు ఉంటుంది. ఒకసారి చార్జ్ చేస్తే మోడల్‌ను బట్టి 100–125 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. సొంత ప్లాంటు రెడీ అయ్యే వరకు హైదరాబాద్ సమీపంలోని తూప్రాన్ వద్ద ఉన్న అసెంబ్లింగ్ ప్లాంటులో టూ వీలర్లు రూపుదిద్దుకుంటాయి. -
నా ఇష్టంతోనే చేశాను..!
న్యూఢిల్లీ : ’డవ్‘ సోప్ తాజాగా విడుదల చేసిన అడ్వర్టయిజ్‌మెంట్‌పై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. కొందరైతే ఈ యాడ్ జాతి, వర్ణ వివక్షను పెంచేలా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. మరికొందరైతే.. దీనిపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ యాడ్‌లో నటించి బ్రిటీష్ - నైజీరియన్ మొడల్ లోలా ఒగ్నోమీ స్పందించారు. నేను ఇష్టపడే ఆ అడ్వర్టయిజ్మెంట్లో నటించాను.. నేను బాధితురాలిని కాను.. నేను మానసికంగా చాలా బలంగాను.. అందంగానూ ఉంటాను అని ఆమె ప్రకటించారు. ఈ యాడ్ అనేది కేవలం సంస్థ సృజనాత్మకదృష్టికి ప్రతీక మాత్రమే అని చెప్పారు. దీనిపై ఎవరూ రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. యాడ్‌లో ఏముంది? అంతర్జాతీయంగా జాతి వివక్షకు దారితీసేలా అడ్వర్టయిజ్మెంట్ ఉందంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇంతకూ యాడ్‌లో ఏముందన్న ఆసక్తి సర్వత్రా పెరిగింది. ఈ యాడ్ ఆరంభంలో ఒక నల్లటి అమ్మాయి.. డవ్ సోప్ వాడకముందు.. ఇలా ఉంది... వాడుతున్నాక.. ఇలా అంటూ.. నల్లటి అమ్మాయి టీ షీర్ట్ తీయగానే తెల్లగా మారుతుంది. నెటిజన్ల ఆగ్రహం డవ్ తాజాగా రూపొందించిన అడ్వర్టయిజ్మెంట్ పూర్తిగా జాతి, వర్ణ వివక్షను పెంచేలా ఉందని నెటిజన్లు మండిపడుతున్నారు. డవ్ సంస్థపై తమ ఆగ్రహాన్ని ట్విటర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటిస్తున్నారు. ఇటువంటి అడ్వర్టయిజ్మెంట్లను నిషేధించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. Let's be clear, Dove knew exactly what they were doing with their racist ad. Soap companies used to do this racist theme all the time pic.twitter.com/EzvAiExNcP — Tariq Nasheed (@tariqnasheed) October 8, 2017 Dove Ran a Disturbingly Racist Ad—and It Isn’t the First Time https://t.co/UUm6BDIpt0 *walks into bathroom and throws out bar of dove soap* — Anna Paquin (@AnnaPaquin) October 9, 2017 -
డవ్ యాడ్‌పై దుమారం
-
డవ్ యాడ్‌పై దుమారం
షాంపులు, సబ్బుల ఉత్పత్తుల్లో మంచి బ్రాండు ఉన్న డవ్ వివాదంలో చిక్కుకుంది. తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేసిన ఓ యాడ్ మూలాన తీవ్ర విమర్శలు పాలవుతోంది. ఒక నల్లజాతీయురాలు తన షర్ట్ తీసేస్తే తెల్ల మహిళగా రివీల్ అవుతుందంటూ ఓ బాడీ వాష్ యాడ్‌ను తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేసింది. ఈ ప్రకటన తీవ్ర జాత్యహంకారాన్ని చూపుతుందని సోషల్ మీడియా యూజర్లు మండిపడుతున్నారు. దీంతో మూడు సెకన్లతో కూడిన ఓ వీడియో క్లిప్‌ను డవ్ విడుదల చేసింది. ఈ క్లిప్‌లో నిజమైన అందంపై డవ్ వైవిధ్యాన్ని చూపించడం లేదని, దీనిపై తాము తీవ్రంగా చింతిస్తున్నామని, క్షమాపణ చెబుతున్నట్టు కంపెనీ చెప్పింది. నల్ల జాతీయురాలు, తెల్ల జాతీయురాలుగా మారే విధంగా చూపించే ఈ సబ్బు ప్రకటన జాత్యహంకారాన్ని కలిగి ఉందని సోషల్ మీడియా యూజర్లంటున్నారు. అంటే నల్ల రంగు శరీరం చెత్త అని, తెల్ల రంగు శరీరం శుభ్రమైనదని ఈ యాడ్ ప్రతిపాదిస్తుందని విమర్శిస్తున్నారు. శుభ్రమైన శరీరమంటే, తెల్ల రంగు శరీరం కాదని, అలా అని నల్ల రంగు శరీరాలన్నీ చెత్త కాదని అట్లాంటకు చెందిన ఓ ప్రొఫెసర్ ట్వీట్ చేశారు. డవ్ ఉత్పత్తులను చాలా కాలంగా వాడుతున్నానని, కానీ ప్రస్తుతం వీటిని విడిచిపెడుతున్నట్టు పేర్కొన్నారు. ఇదే తొలిసారి కాదని, డవ్ చాలాసార్లు ఇలాంటి జాత్యంహకారం ప్రకటనలను ప్రచురించింది. -
కాంగ్రెస్ సంబరానికి పావురాలు ఆహుతి
-
పావురం జూలు విదిలిస్తే!
సింహానికే కాదు.. మాకూ ఉంది జూలు అన్న రీతిలో చాటా ఠీవీగా పోజిచ్చిన ఈ పక్షి.. ఏదో వింత జాతికి చెందింది మాత్రం కాదండోయ్. ఇది మనందరికీ ఎంతో పరిచయం ఉన్న పావురం. కాకపోతే సాధారణ పావురానికి మెడ చుట్టూ జూలు ఉండదు.. దీనికి ఉంటుంది.. అంతే తేడా..! వీటిని జకోబిన్ పావురాలని అంటారు. ప్రస్తుతం ఐరోపాలో కనిపించే ఈ జకోబిన్స్ తాతముత్తాతలు మన భారత్‌కు చెందినవేనట. 16వ శతాబ్దంలో భారత్ నుంచి అక్కడకు వలస వెళ్లిన ఈ పావురాలు.. నాలుగు దశల్లో రకరకాల మార్పులు చెంది ప్రస్తుతం ఉన్న రూపును సంతరించుకున్నాయి.