
పావురం జూలు విదిలిస్తే!
సింహానికే కాదు.. మాకూ ఉంది జూలు అన్న రీతిలో చాటా ఠీవీగా పోజిచ్చిన ఈ పక్షి.. ఏదో వింత జాతికి చెందింది మాత్రం కాదండోయ్. ఇది మనందరికీ ఎంతో పరిచయం ఉన్న పావురం. కాకపోతే సాధారణ పావురానికి మెడ చుట్టూ జూలు ఉండదు.. దీనికి ఉంటుంది.. అంతే తేడా..! వీటిని జకోబిన్ పావురాలని అంటారు. ప్రస్తుతం ఐరోపాలో కనిపించే ఈ జకోబిన్స్ తాతముత్తాతలు మన భారత్‌కు చెందినవేనట. 16వ శతాబ్దంలో భారత్ నుంచి అక్కడకు వలస వెళ్లిన ఈ పావురాలు.. నాలుగు దశల్లో రకరకాల మార్పులు చెంది ప్రస్తుతం ఉన్న రూపును సంతరించుకున్నాయి.