faults
-
సిగ్నల్ రాంగ్ రూట్
భువనేశ్వర్: ఒడిశాలోని మూడు రైళ్లు ఢీకొని 275 మంది ప్రాణాలు బలైపోయిన తర్వాత మన దేశంలో రైల్వే సిగ్నల్ వ్యవస్థలో ఉన్న లోటుపాట్లు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. మూడు నెలల ముందే సిగ్నల్ వ్యవస్థలో తీవ్రమైన లోపాలు ఉన్నాయంటూ సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ చీఫ్ ఆపరేటింగ్ మేనేజర్ రాసిన లేఖ ఒకటి మీడియాకి చిక్కింది. సిగ్నల్ వ్యవస్థలో లోపాలు వెంటనే సవరించకపోతే భారీ ప్రమాదాలు చోటు చేసుకోవడం ఖాయమంటూ ఆ చీఫ్ మేనేజర్ రైల్వే శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళుతూ ఫిబ్రవరి 9న లేఖ రాశారు. ఫిబ్రవరి 8వ తేదీన బెంగుళూరు నుంచి న్యూఢిల్లీకి వెళ్లే సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ భారీ ప్రమాదానికి గురై ఉండాల్సిందని డ్రైవర్ అప్రమత్తతతో వ్యవహరించడం వల్ల ముప్పు తప్పిందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ ప్రయాణిస్తున్న సమయంలో మెయిన్ లైన్ ద్వారా వెళ్లవచ్చునని డ్రైవర్‌కి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అలా సిగ్నల్ వచ్చినప్పుడు పట్టాల దగ్గర ఉండే పాయింట్ మారాలి. రైలుని ఒక ట్రాక్ నుంచి మరో ట్రాక్‌కి మళ్లించడాన్ని పాయింట్ అంటారు. అయితే సిగ్నల్, పాయింట్ పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. దీనిని గమనించిన డ్రైవర్ సరైన సమయంలో రైలుని ఆపేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఇంటర్‌లాకింగ్ వ్యవస్థని సరిగా వినియోగించుకోలేకపోవడం వల్ల ముంచుకొచ్చిన ప్రమాదం ఇదని ఆయన ఆ లేఖలో వివరించారు. సిగ్నలింగ్ సాంకేతిక వ్యవస్థపై సమగ్రమైన విచారణ జరపడమే కాకుండా, స్టేషన్ మాస్టర్లు, ట్రాఫిక్ ఆఫీసర్లు, ట్రావెలింగ్ ఇన్స్పెక్టర్లపై దీనిపై అవగాహన పెంచే ప్రయత్నాలు చేయాలన్నారు. సిగ్నల్ వ్యవస్థని నిరంతరం పర్యవేక్షిస్తూ వెనువెంటనే లోపాలు సరిదిద్దుకోకపోతే ఘోరమైన ప్రమాదాలు చూస్తామని సౌత్ వెస్ట్రన్ రైల్వే చీఫ్ ఆపరేటింగ్ మేనేజర్ మూడు నెలల కిందటే హెచ్చరికలు జారీ చేశారు. -
టయోటా హైబ్రిడ్ కార్ల రీకాల్
టోక్యో: జపాన్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ టయోటా మరోసారి భారీగా హైబ్రిడ్ కార్లను రీకాల్ చేయనుంది. సాంకేతిక లోపాలకారణంగా సుమారు 24 లక్షల కార్లను వెనక్కి తీసుకుంటున్నట్టు శుక్రవారం ప్రకటించింది. సాంకేతిక సమస్యల కారణంగా కార్లలో మంటలంటుకునే అవకాశం ఉందంటూ గత నెలలో ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల టయోటా హైబ్రిడ్ కార్లను రీకాల్ చేస్తున్నట్టు ప్రకటించింది. -
స్వచ్ఛ భారత్‌లో లోపాలు: ఐరాస ప్రతినిధి
ఢిల్లీ: ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పలు లోపాలు ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రతినిధి ఒకరు తన నివేదికలో పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ పథకంలో సమగ్ర మానవ హక్కుల విధానం లోపించిందనీ, మరుగుదొడ్ల నిర్మాణానికి ఇస్తున్న ప్రాధాన్యత సురక్షిత తాగునీరు సరఫరా చేయడానికి ఇవ్వడం లేదని విమర్శించారు. పరిశుభ్రత, రక్షిత తాగునీటికి సంబంధించిన మానవ హక్కుల పరిశీలన కోసం లియో హెల్లర్ అనే ఐరాస ప్రతినిధి 2 వారాల పాటు భారత్‌లో పర్యటించి నివేదిక ఇచ్చారు. బహిరంగ మలమూత్ర విసర్జన లేని (ఓడీఎఫ్) ప్రాంతాలంటే అక్కడ మరుగుదొడ్లు కట్టడం కాదన్నారు. ఓ ప్రాంతాన్ని ఓడీఎఫ్‌గా ప్రకటించేందుకు అనుసరిస్తున్న పద్ధతులు సక్రమంగా లేవన్నారు. -
అమృత హస్తం.. లోపాలే సమస్తం
చింతలపూడి : ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత హస్తం పథకం గర్భిణులు, బాలింతల పాలిట శాపంగా పరిణవిుస్తోంది. వారిలో పోషకాహార లోపాలను నివారించేందుకు ఉద్దేశించిన ఈ పథకం లోపాలమయంగా మారింది. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న పాలు తరచూ పాడైపోతున్నాయి. పాల ప్యాకెట్లలో బ్యాక్టీరియా చేరి దుర్వాసన వెదజల్లుతున్నాయి. అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని గర్భిణులు, బాలింతలకు రోజూ అన్నం, పప్పు, ఆకు కూరలతోపాటు 200 మిల్లీలీటర్ల చొప్పున పాలు అందజేయాల్సి ఉంది. అన్నం, పప్పు, ఆకు కూరలు కొంచెం అటూఇటుగా ఉంటున్నా.. పాలు మాత్రం పాడైపోయినవి ఇస్తున్నారు. ప్యాకెట్లు రోడ్డు ‘పాలు’ గర్భిణులు, బాలింతలకు ఇవ్వాల్సిన వందలాది పాల ప్యాకెట్లు రోడ్డు పక్కన గుట్టలుగా దర్శనమిస్తున్న ఘటనలు చింతలపూడి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో తరచూ చోటుచేసుకుంటున్నాయి. చింతలపూడి నుంచి నాగిరెడ్డిగూడెం వెళ్లే రహదారి పక్కన ఖాళీ స్థలంలో కొద్దిరోజులుగా ఇవి దర్శనమిస్తుండటంపై ఆరా తీయగా అసలు విషయం వెలుగు చూసింది. పాల ప్యాకెట్లలో బ్యాక్టీరియా చేరడం వల్ల దుర్వాసన వెదజల్లుతున్నాయి. వీటిని గర్భిణులు, బాలింతలకు సరఫరా చేస్తే ప్రమాదం ముంచుకొస్తుందన్న భయంతో ఐసీడీఎస్ అధికారులే వీటిని ఖాళీ స్థలంలో పడవేయిస్తున్నట్టు వెల్లడైంది. ఇలాంటి ప్యాకెట్లను వెనక్కి పంపించి.. వాటిస్థానంలో తాజా పాల ప్యాకెట్లను పొందే అవకాశం ఉన్నా అధికారులు ఎందుకో ఆ పని చేయడం లేదు. దీని వెనుక కారణం ఏమిటనేది ఇంకా వెల్లడి కాలేదు. 90 రోజులు దాటితే అంతే.. ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ‘విజయ వజ్ర’ రకం పాలను టెట్రా ప్యాకెట్లలో నింపి అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. ఇవి ప్యాక్ చేసిన తేదీ నుంచి సుమారు 90 రోజుల వరకు నిల్వ ఉంటాయి. పాల ప్యాకెట్లు లీకవుతున్నా.. ఉబ్బినట్టు ఉన్నా వాటిని గర్భిణులు, బాలింతలకు సరఫరా చేయకూడదు. ప్యాకెట్లు లీకైనా.. ఉబ్బినా వాటిలోకి బ్యాక్టీరియా చేరుతుంది. చింతలపూడి ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌కు గత నెలలో సరఫరా చేసిన పాల ప్యాకెట్లలో అత్యధిక శాతం పాడైపోవడంతో ఖాళీస్థలంలో పారబోశారు. తాజాగా.. మరోసారి వందలాది ప్యాకెట్లను నేలపాలు చేశారు. వీటిని సేవిస్తే ప్రాణాంతకమే.. బ్యాక్టీరియా చేరిన పాలను తాగితే గర్భి ణులు, బాలింతలు తీవ్ర అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. పారబోసిన ప్యాకెట్ల గడువు తేదీ దాటిపోంది. వీటిని ఎవరైనా సేవిస్తే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. కనీసం ప్యాకెట్లను కత్తిరించి పాలను పారబోసినా ఈ ప్రమాదం నుంచి బయటపడవచ్చు. అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు ఇవేమీ పట్టించుకోకుండా పాడైన ప్యాకెట్లను జనసంచారం ఉండే ప్రాంతంలో గుట్టలుగా పోస్తున్నారు. పొరపాటున వాటిపి ఎవరైనా తీసుకుని ఉపయోగిస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. 67 లీటర్లే పాడయ్యాయట చింతలపూడి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరి« దిలో 277 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నా యి. వీటి పరిధిలో 2,044 మంది గర్భి ణులు, 1,999 మంది బాలింతలు నమోదయ్యారు. వారికి ఇచ్చే నిమిత్తం అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తు న్న పాలకు ప్రభుత్వం లీటర్‌కు రూ.40 చొప్పున చెల్లిస్తోంది. ఫిబ్రవరిలో చింతలపూడి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలకు 15,039 లీటర్ల పాలు సరఫరా చేశారు. వీటిలో కేవలం 67.50 లీటర్ల పాలు మాత్రమే పాడయ్యాయని అధికారులు చెప్తున్నారు. మరి గుట్టలుగా పోసిన వందలాది లీట ర్ల పాల ప్యాకెట్ల సంగతేమిటని అడిగితే నీళ్లు నములుతున్నారు. నాణ్యతపై అనుమానం అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న పాల ప్యాకెట్లను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించకపోవడంతో నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గర్భిణులు చూసుకోకుండా ఈ పాలను తాగితే వాంతులు, విరేచనాల పాలై ప్రాణాపాయ స్థితికి ప్రమాదం ఉంది. పాడైన ప్యాకెట్లు తీసుకోవద్దని చెప్పాం పాడైపోయిన పాల ప్యాకెట్లు తీసుకోవద్దని అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులకు సూచించాం. గత నెలలో 67 ప్యాకెట్లు పాడైపోయినట్టు గుర్తించాం. వాటిని వెనక్కి ఇచ్చి.. వాటి స్థానంలో కొత్త ప్యాకెట్లు తీసుకున్నాం. పాడైపోయిన ప్యాకెట్లను కత్తిరించి అందులోని పాలను బయట పారబోయాల్సిందిగా పాలు సరఫరా చేస్తున్న కంపెనీ ప్రతినిధికి సూచించాం. ఇటువంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. – కె.విజయలక్ష్మి, ప్రాజెక్ట్ అధికారి, ఐసీడీఎస్, చింతలపూడి -
22 మంది విద్యార్థుల హాల్టికెట్లలో తప్పిదాలు
తిరుపతి: చిత్తూరు జిల్లాలో బుధవారం ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల సందర్భంగా 22 మంది విద్యార్థుల హాల్ టికెట్లలో తప్పిదాలను గుర్తించారు. ద్వితీయ భాషగా తెలుగుకు బదులు హాల్టికెట్లలో కొందరికి ఇంగ్లిష్, కొందరికి సంస్కృతం ఉండడంతో పరీక్ష ప్రారంభమైన తర్వాత విద్యార్థులు ఆలస్యంగా మేల్కొని ఇన్విజిలేటర్ల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అధికారులు ఓఎంఆర్ పత్రాలను మార్చి ఇచ్చారు.ఇంటర్మీడియట్ తొలి సంవత్సరం పరీక్షలకు ‘ఒక్క నిమిషం’ బాగా ఎఫెక్ట్ చూపింది. వారి భవిష్యత్‌ను దెబ్బతీసింది.ఇంటర్ పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించకూడదన్న సర్కారు ఆదేశాలను అధికారులు తు.చ. తప్పకుండా పాటించారు. -
రుణమాఫీ లోగుట్టు బట్టబయలు
-
రుణమాఫీ లోగుట్టు బట్టబయలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు అమలు చేసిన రుణమాఫీ పథకంలోని లోగుట్టు బట్టబయలైంది. మంగళవారం చంద్రబాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో టీడీపీ నేతలే రుణమాఫీ అమలులోని లోపాలను ఎత్తిచూపారు. ఎకరం భూమి ఉండి 24 వేల రూపాయల అప్పు ఉన్న రైతుకు నాలుగు వేలు మాత్రమే ఎకౌంట్లో వేశారని టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. 50 వేల లోపు రుణం వారికి కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వర్తింపజేశారని సీఎంకు స్పష్టం చేశారు. ద్రాక్షారామం సొసైటీలో చాలామంది రైతులకు అన్యాయం జరిగిందని త్రిమూర్తులు చెప్పారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వల్ల ఎక్కువ నష్టం జరుగుతోందని ముఖ్యమంత్రికి తెలియజేశారు. రాష్ట్రంలో గరిష్టంగా ఒక్కో రైతు కుటుంబానికి 1.5 లక్షల వరకు మాఫీ చేస్తూ తొలివిడతలో 20 శాతం వారి అకౌంట్లో జమ చేస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక 50 వేల లోపు రుణం ఉన్నవారికి ఒకేసారి మాఫీ చేస్తున్నట్టు తెలిపారు. అయితే ఆన్లైన్ ఉంచిన రుణమాఫీ జాబితాలో అనేక లోపాలున్నాయని, చాలామంది రైతులకు అన్యాయం జరిగిందనే విమర్శలు వస్తున్నాయి. -
పావురం జూలు విదిలిస్తే!
సింహానికే కాదు.. మాకూ ఉంది జూలు అన్న రీతిలో చాటా ఠీవీగా పోజిచ్చిన ఈ పక్షి.. ఏదో వింత జాతికి చెందింది మాత్రం కాదండోయ్. ఇది మనందరికీ ఎంతో పరిచయం ఉన్న పావురం. కాకపోతే సాధారణ పావురానికి మెడ చుట్టూ జూలు ఉండదు.. దీనికి ఉంటుంది.. అంతే తేడా..! వీటిని జకోబిన్ పావురాలని అంటారు. ప్రస్తుతం ఐరోపాలో కనిపించే ఈ జకోబిన్స్ తాతముత్తాతలు మన భారత్‌కు చెందినవేనట. 16వ శతాబ్దంలో భారత్ నుంచి అక్కడకు వలస వెళ్లిన ఈ పావురాలు.. నాలుగు దశల్లో రకరకాల మార్పులు చెంది ప్రస్తుతం ఉన్న రూపును సంతరించుకున్నాయి.