ఢిల్లీ: ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పలు లోపాలు ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రతినిధి ఒకరు తన నివేదికలో పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ పథకంలో సమగ్ర మానవ హక్కుల విధానం లోపించిందనీ, మరుగుదొడ్ల నిర్మాణానికి ఇస్తున్న ప్రాధాన్యత సురక్షిత తాగునీరు సరఫరా చేయడానికి ఇవ్వడం లేదని విమర్శించారు. పరిశుభ్రత, రక్షిత తాగునీటికి సంబంధించిన మానవ హక్కుల పరిశీలన కోసం లియో హెల్లర్ అనే ఐరాస ప్రతినిధి 2 వారాల పాటు భారత్‌లో పర్యటించి నివేదిక ఇచ్చారు. బహిరంగ మలమూత్ర విసర్జన లేని (ఓడీఎఫ్) ప్రాంతాలంటే అక్కడ మరుగుదొడ్లు కట్టడం కాదన్నారు. ఓ ప్రాంతాన్ని ఓడీఎఫ్‌గా ప్రకటించేందుకు అనుసరిస్తున్న పద్ధతులు సక్రమంగా లేవన్నారు.
Comments
Please login to add a commentAdd a comment