UN report
-
ఒడిదుడుకుల్లో జనాభా పెరుగుదల!
జనాభా పెరగడంపై మీ అభిప్రాయం ఏంటని అడిగితే ఏం సమాధానమిస్తారు.. ప్రజలు పెరిగితే మంచితే కదా..శ్రామిక అవసరాలు తీరుతాయి.. అని కొందరు అంటారు. జనాభా ఎక్కువైతే మౌలిక అవసరాలకు ఎక్కువ ఖర్చు చేయాలి..ఉపాధి కరవవుతుంది..నిరుద్యోగం పెరుగుతుంది..ఆకలి అధికమవుతుంది.. అని ఇంకొందరు అభిప్రాయపడుతారు. ప్రాంతాలవారీగా స్థానిక అవసరాలు, అక్కడి ప్రజల అవగాహన, సదుపాయాలు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ నేపథ్యం..వంటి చాలా కారణాలు జనాభాను ప్రభావితం చేస్తాయి. ఈ జనాభా పెరుగుదలలోని తారతమ్యాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో అసమానతలను పెంచుతున్నాయి. 1950 నుంచి 2023 వరకు ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదల ఎలా ఉందో తెలియజేస్తూ ఐక్యరాజ్య సమితి నివేదిక విడుదల చేసింది.జనాభా పెరుగుదల కొన్ని ప్రాంతాలను వృద్ధి పథంలోకి తీసుకెళితే..మరికొన్ని ప్రాంతాలను నష్టాల్లోకి నెట్టేస్తోంది. యువత ఎక్కువగా ఉన్న భారత్‌లో శ్రామికశక్తికి ప్రస్తుతం ఢోకాలేదు. ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన ప్రాంతాల సరసన చేరిన జపాన్ వంటి దేశాల్లో యువతలేక అల్లాడిపోతున్నారు. పిల్లల్ని కనడానికి ప్రభుత్వం అక్కడి దంపతులకు ప్రత్యేక వెసులుబాటు అందిస్తోంది. అక్కడ జనాభా తగ్గిపోవడానికి ప్రధాన కారణం యువత వివాహాలకు సుముఖంగా లేకపోవడం, వివాహమైనా పిల్లలను కనడానికి ఆసక్తిచూపకపోవడమేనని తెలుస్తోంది. నిరుద్యోగం, అధిక జీవన వ్యయం, మహిళల పట్ల వివక్ష తదితర సమస్యలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. వివాహం చేసుకుని సంతానాన్ని కనే వారికి జపాన్ ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నా యువత నిర్ణయంలో పెద్ద మార్పు ఉండడంలేదని తెలుస్తోంది. జపాన్ 2070నాటికి 30శాతం మేర జనాభాను కోల్పోయే ప్రమాదం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి.ఆసియాలో..ఆసియాలో 1950లో ఏటా జనాభా పెరుగుదల దాదాపు 58 కోట్లుగా ఉండేదని నివేదిక చెబుతుంది. 73 ఏళ్ల తర్వాత 2023లో అది 65 కోట్లుగా ఉంది. 1990ల్లో గరిష్ఠంగా జనాభా పెరుగుదల సుమారు 90 కోట్లకు చేరింది. క్రమంగా తర్వాతికాలం నుంచి పడిపోయింది. 2012లో ఘణనీయంగా దిగజారింది. చారిత్రాత్మకంగా భారత్, చైనా, ఇండోనేషియా..వంటి దేశాల్లో 20వ శతాబ్దంలో పారిశుద్ధ్యం, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయ పురోగతి, ఉపాధి అవకాశాలు మెరుగుపడడంతో జనాభా పెరిగింది.ఆఫ్రికా.. ఆకలిరాజ్యంఓ వైపు జనాభాలేక ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంటే ఆఫ్రికాలో మాత్రం అందుకు భిన్నంగా జనాభా పెరుగుతోంది. ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన నివేదిక ప్రకారం..1950లో ఏటా సరాసరి 98 లక్షల జనాభా పెరుగుదల ఉండే ఆఫ్రికాలో 2023 నాటికి అది 4.6 కోట్లకు చేరింది. అయితే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సరైన ఉపాధి అవకాశాలులేక అక్కడి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పోషకాహారలోపంతో ఉన్నవారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఆకలి తాండవిస్తోంది.యూరప్‌లో..పారిస్, లండన్, బ్రిటన్..వంటి ప్రాంతాల్లోని ప్రజల్లో అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉంది. దాంతో ఏళ్లకాలం నుంచే ఎక్కువగా పిల్లల్ని కనకుండా జాగ్రత్త పడ్డారు. సరాసరి ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలను మాత్రమే కనేవారు. అది ప్రస్తుతం మరింత తగ్గిన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 1950లో ఏటా జనాభా పెరుగుదల 95 లక్షలుండే యూరప్‌లో 2023 నాటికి అది 63 లక్షలకు చేరింది.అగ్రరాజ్యం అమెరికాలో..క్రిస్టఫర్ కొలంబస్ 1490లో అమెరికాను కనుగొనే దానికంటే ముందు అక్కడ కేవలం రెండు తెగలకు చెందిన ప్రజలే ఉండేవారు. దాంతో జనాభా తక్కువగా ఉండేది. క్రమంగా విద్యా వ్యవస్థ విస్తరించింది. అమెరికాలో స్త్రీ, పురుష భేదాలు తక్కువగా ఉంటాయి. దాంతో దాదాపు అందరూ ఉద్యోగాలు చేసేవారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే అమెరికాలో నివసించడం ఖర్చుతో కూడుకున్న విషయం. కాబట్టి పిల్లల్ని తక్కువగానే కనేవారు. దంపతులిద్దరు ఉద్యోగాలు చేయడంతో డబ్బు ఆదా అయ్యేది. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించేవారు. సంస్థలు స్థాపించేవారు. అక్కడి జనాభాకు ఉపాధి దొరకండంతోపాటు మరింత మంది అవసరం ఏర్పడేది. దాంతో ఇతర దేశాల నుంచి అమెరికాకు వలసలు పెరిగాయి. కానీ అక్కడి ప్రజలు మాత్రం జనాభా పెరుగుదలపై అప్రమత్తంగానే ఉన్నారు. 1950లో జనాభా ఏటా పెరుగుదల 40 లక్షలుగా ఉండేది. ప్రస్తుతం అదే కొనసాగుతోంది.ఇదీ చదవండి: భారత్‌లో అత్యుత్తమ ర్యాంకు పొందిన సంస్థజనాభా ఎక్కువగా ప్రాంతాల్లో జననాల నియంత్రణ ఆవశ్యకత పట్ల విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రజలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో దాని పెరుగుదలకు అవసరమయ్యే చర్యలు చేపట్టాలని చెబుతున్నారు. జనాభా తారతమ్యాలు ఏర్పడకుండా ప్రపంచదేశాలు కొన్ని నియమాలు రూపొందించుకుని వాటిని పాటించాలని కోరుతున్నారు. -
సముద్ర జలాల్లో ‘జీన్స్’ కాలుష్యం.. కేవలం ఏడుసార్లు వాడి పడేస్తున్నారు
ఫ్యాషన్ ప్రపంచంలో ‘జీన్స్’కు ఉన్న క్రేజే వేరు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వీటిని ధరించడానికి ఎంతో ఇష్టపడతారు. అబ్బాయిలు, అమ్మాయిలు అయితే సరేసరి. పాశ్చాత్య దేశాల్లో వీటి హవా అంతాఇంతా కాదు. ఈ కారణంగానే ఏటా ప్రపంచవ్యాప్తంగా రెండు బిలియన్ల కంటే ఎక్కువ జతల జీన్స్ అమ్ముడవుతున్నాయి. ప్రతి సెకనుకు 73 యూనిట్ల విక్రయాలు జరుగుతున్నాయంటే మాటలు కాదు. మార్కెట్లో కొత్త పోకడలు, చౌక ధరల కారణంగా వీటి వినియోగం ఇంత ఎక్కువగా ఉంటోంది. అయితే, ప్రజల మనసులను దోచుకోవడంలోనే కాదు.. వాతావరణ కాలుష్యంలోనూ జీన్స్ పరిశ్రమ తీసిపోవడంలేదు. సాక్షి, అమరావతి: జీన్స్ పరిశ్రమ కారణంగా మహా సముద్రాలు సైతం కలుషితమవుతున్నాయి. దాదాపు అర మిలియన్ టన్నుల మైక్రోఫైబర్లు (మూడు మిలియన్ బ్యారెళ్ల చమురుకు సమానం) ఏటా సముద్రాల్లోకి చేరుతున్నాయి. ఫలితంగా సాగర జలాలు విషపూరితంగా మారుతున్నాయి. ఇటీవల కాలంలో దుస్తుల్లో ఎక్కువగా వాడుతున్న సింథటిక్ పాలిస్టర్, నైలాన్, యాక్రిలిక్ (పాలిమర్ రంగులు)లను నీటిలో కడగడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇవి నీటిలో కుళ్లి నాశనం అవడానికి 200 ఏళ్లు పడుతుంది. దీనివల్ల జీన్స్‌లోని ప్లాస్టిక్ మైక్రోఫైబర్లు సముద్ర జలాలను కప్పేసినట్లు గుర్తించారు. యూఎన్ నివేదికల ప్రకారం ఫ్యాషన్ పరిశ్రమ 20 శాతం కలుషిత నీరు, 10 శాతం కర్బన ఉద్గారాలను ఉత్పత్తి చేస్తోంది. ఇది విమానాలు, సముద్ర రవాణా ద్వారా వెలువడే ఉద్గారాల (గ్రీన్హౌస్ వాయువులు) కంటే ఎక్కువగా ఉంటోంది. దేశంలోని భారతియార్ విశ్వవిద్యాలయంలో టెక్స్టైల్స్, దుస్తుల డిజైన్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ అముత కరుప్పచామి విశ్లేషణ ప్రకారం.. పత్తిని అధికంగా ఉత్పత్తి చేసే చైనా, భారత్‌తో పాటు, అమెరికాలో కూడా రసాయనాలను విరివిగా వినియోగించడం కూడా నీటి కాలుష్యాన్ని పెంచుతోందని చెబుతున్నారు. ఒక జత జీన్స్ తయారీకి 7,500 లీటర్ల నీరు సాధారణంగా.. దుస్తులన్నింటికీ అద్దకం, ఇతర ప్రక్రియల కోసం భారీగా మంచినీటిని ఉపయోగిస్తారు. ప్రతి టన్ను వ్రస్తానికి రంగు వేయడానికి దాదాపు 200 టన్నుల మంచినీరు అవసరం. ఇందులో ఒక జత బ్లూజీన్స్ తయారీకి 7,500 లీటర్ల నీటిని వినియోగిస్తున్నారు. ఇది సగటు వ్యక్తికి ఏడేళ్లపాటు అవసరమయ్యే తాగునీటితో సమానం. అలాగే, యూఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ప్రకారం ఫ్యాషన్ పరిశ్రమ ఏటా 93 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని ఉపయోగిస్తుంది. ఈ నీటితో ఐదు లక్షల మంది జీవితకాల దాహార్తిని తీర్చవచ్చు. మరోవైపు.. దుస్తుల వినియోగంలోనూ మానవుల్లో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. కొద్దికాలానికే వాడిపడేస్తూ..: ప్రపంచవ్యాప్తంగా ఒక ఏడాదిలో 5,300 మిలియన్ టన్నుల నూలు తయారవుతోంది. దీంతో ఏటా 80 బిలియన్ల కొత్త దుస్తులు ఉత్పత్తి అవుతున్నాయి. అయితే యూఎన్ ఎని్వరాన్‌మెంట్ ప్రోగ్రామ్ భాగస్వామి అయిన ఎల్లెన్ మకార్తుర్ ఫౌండేషన్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకనుకు ఒక ట్రక్కులోడు వ్రస్తాలను చెత్తలో పడేస్తున్నారు లేదా కాల్చేస్తున్నారు. నిపుణుల అంచనా ప్రకారం గడిచిన దశాబ్దంలో దుస్తుల ఉత్పత్తి రెట్టింపు అయింది. కానీ, వీటిలో 70 శాతం దుస్తులను ప్రజలు కొద్దిరోజులకే వాడిపడేస్తున్నారు. సగటున పాశ్చాత్య దేశాల్లో ఏడుసార్లు మాత్రమే ధరించి పడేస్తున్నారు. అదే ఇక్కడ ఒక కుటుంబం ఏటా 30 కిలోల దుస్తులను పడేస్తోంది. కొలరాడో పరిశోధన విశ్వవిద్యాలయం ప్రకారం.. కేవలం 15 శాతం దుస్తులను మాత్రమే రీసైకిల్ లేదా విరాళంగా అందిస్తున్నారు. ఇది మరింతగా పెరిగితే ఫ్యాషన్ పరిశ్రమ కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. స్లో అండ్ సస్టైనబుల్ ఫ్యాషన్.. కోవిడ్–19 తర్వాత ప్రజల దృక్పథంలో మార్పువస్తోంది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాషన్ పరిశ్రమ స్లో అండ్ సస్టైనబుల్ ఫ్యాషన్ ట్రెండ్ వైపు మళ్లుతోంది. ఇటువంటి సస్టైనబుల్ బ్రాండ్లు డజన్ల కొద్దీ మార్కెట్లోకి వచ్చాయి. ఇవి బట్టల తయారీకి ఆర్గానిక్ మెటీరియల్స్‌ను ఉపయోగిస్తున్నాయి. అయితే, ఇవి ఖరీదైనవిగా ఉన్నాయి. ఇందులో దుస్తులకు ఆర్గానిక్ రంగులనే వాడుతున్నారు. ప్రజల్లోనూ రీసైక్లింగ్ క్రేజ్ క్రమంగా పెరుగుతోంది. దుస్తుల్ని వివిధ దశల్లో చాలాసార్లు ఉపయోగించేలా అవగాహన వస్తోంది. మన దేశంలో ఇలా.. ఇక వివిధ మార్కెట్ అధ్యయనాల ప్రకారం భారతీయ డెనిమ్ (జీన్స్) మార్కెట్ కొన్నేళ్లుగా వార్షిక వృద్ధి రేటు సగటున 8–9 శాతం వరకు కొనసాగిస్తోంది. ఇది 2028 నాటికి రూ.91,894 కోట్లకు చేరుకుంటుందని అంచనా. మరోవైపు.. పాశ్చాత్య దేశాల మాదిరిగా కాకుండా, భారత్‌లో ప్రతి వ్యక్తికి సగటు జీన్స్ వినియోగం చాలా తక్కువగా ఉంది. ఇక్కడ ప్రస్తుతం సగటున ఒక వ్యక్తికి 0.5 జీన్స్ మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి వ్యక్తికి ఒక జత జీన్స్ ఉండాలంటే సంవత్సరానికి మరో 700 మిలియన్ జతల జీన్స్ అవసరమని అంచనా. అలాగే, ఓ సర్వే ప్రకారం 2023లో 59 శాతం మంది భారతీయులు గత సంవత్సరం కంటే ఎక్కువ జీన్స్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. -
World Population: అత్యధిక జనాభా దేశంగా భారత్!
న్యూయార్క్: ప్రపంచంలోనే అత్యధిక జనాభా దేశంగా భారత దేశం ఆవిర్భవించబోతోంది. అదీ 2023లోనే!. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాదిలో చైనాను అధిగమించి.. ప్రపంచంలోనే మోస్ట్ పాపులేటెడ్ కంట్రీగా భారత్ నిలవబోతోందని ఐరాస తెలిపింది. అంతేకాదు.. ఈ నవంబర్ 15వ తేదీ నాటికి ప్రపంచ జనాభా.. ఎనిమిది బిలియన్లకు(800 వందల కోట్లకు) చేరుకోనుందని ప్రకటించింది. జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన UN వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2022లోనే ఈ వివరాలను పొందుపరిచారు. అయితే.. అంచనా వేసిన గడువు దగ్గర పడుతుండడంతో ఇప్పుడు ఆ వివరాలను బయటికి విడుదల చేశారు. ఇక 2050 నాటికి ప్రపంచ జనాభాలో సగానికి పైగా పెరుగుదల కేవలం ఎనిమిది దేశాల్లోనే ఉండొచ్చని అంచనా వేసింది ఈ సంస్థ. భారత్‌తో పాటు పాకిస్తాన్, పిలిప్పీన్స్, ఆఫ్రికా దేశాలైన ఈజిప్ట్, ఇథియోపియా, కాంగో, నైజీరియా, టాంజానియా.. ఈ లిస్ట్‌లో ఉన్నాయి. మరో విశేషం ఏంటంటే.. 1950 తర్వాత తొలిసారిగా 2020లో ప్రపంచ జనాభా పెరుగుదల ఒక శాతం కంటే తక్కువగా పడిపోయిందని ఈ ఏజెన్సీ పేర్కొంది. ప్రపంచ జనాభా 2030 నాటికి 8.5 బిలియన్లు, 2050 నాటికి 9.7 బిలియన్లు, 2080 నాటికి 10.4 బిలియన్లకు చేరుకోనుందని అంచనా వేసింది ఐరాస సంస్థ. ఇదీ చదవండి: ఫార్చూన్ పింక్.. విలువ రూ.231 కోట్లు -
‘మనం’ మారితేనే మనుగడ!
దేశంలోని నగరాలు, పట్టణాలు, నదులు, అడవులు, కొండలు... అన్నీ అసాధారణ ఒత్తిడికి గురవుతున్నాయి. వాతావరణ సంక్షోభాన్ని బహుళ కారణాలు జఠిలం చేస్తున్నాయి. అన్ని విధాన నిర్ణయాలలో అంతర్లీనంగా ఈ అంశం ఉండేలా చూడాలి. ఎన్నడూ ఈ సమస్యను పట్టించుకోని మన రాజకీయ వ్యవస్థలో కదలిక రావాలి. ఓటు బ్యాంకు రాజకీయాలకు అతీతంగా ఎదిగి భవిష్యత్తరాలనే కాకుండా ప్రస్తుత ప్రజానీకాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాలి. నార్వేతో సహా పలు ఐరోపా దేశాల్లో గ్రీన్ పార్టీ రాజకీయాలు మొదలయ్యాయి. నేడు కాకుంటే రేపు... మన దగ్గరా అవి అనివార్యం! ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు దిశ మార్చు కుంటున్న సంధి కాలమిది! పునరుత్పాదక ఇంధనాలు, నికర శూన్య ఉద్గారాలు, పచ్చ పెట్టుబడులు, వాతావరణ బడ్జెట్లు, హరిత ఆర్థిక వ్యవస్థలు .... వంటి ఆధునిక పదజాలం తెరపైకి వచ్చి ఆధిపత్యం చెలాయిస్తున్న సంక్లిష్ట సమయం. ప్రకృతిలో మానవ ప్రమేయపు అలజడి, భూగ్రహంపై మనిషి మనుగడ పెంచిన ఒత్తిడి అంతా ఇంతా కాదు! అది సృష్టిస్తున్న అనేక రూపాల కాలుష్యం ‘వాతావరణ మార్పు’గా ఉపద్రవమై ముంచుకు వచ్చింది. భూతాపోన్నతి పెరుగుతూ ఎండలు, వానలు, వరదలు, కార్చిచ్చులు... అన్నీ పరిమితులు దాటి విలయం సృష్టిస్తు న్నాయి. సరికొత్త వైరస్లు మానవాళి ఉనికినే ఊగిసలాటలోకి నెడుతు న్నాయి. ఇందుకు కోవిడ్–19 తార్కాణం! ధ్రువాల్లో మంచు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. లోతట్టు దీవులతో పాటు తీర నగరాలూ ప్రమాదంలో పడ్డాయి. అంచనాకు మించిన వేగంతో విధ్వంసం కమ్ముకొస్తోంది. ‘వెనక్కి తిరిగి సరిదిద్దుకునే వీలులేని అన ర్థాలు జరిగిపోతున్నాయ’ని ఐక్యరాజ్యసమితి (యూన్) తాజా నివేదిక హెచ్చరించింది. దక్షిణాసియా దేశాలకు ముప్పు ఎక్కువుంది. పర్యా వరణం ఇప్పుడు శాస్త్రవేత్తలు, కార్యకర్తలు.. అనే దశ దాటి అందరి నోళ్లలోనూ నిత్యం నానుతోంది. ప్రకృతి వైపరీత్యాలు పెరిగి, కొడు తున్న దెబ్బలు ‘తమ దాకా వస్తే గాని...’ జనాల్లో కదలిక రాలేదు! పాలనాపీఠాలు అధిష్టించిన రాజకీయ వ్యవస్థలే ప్రాధాన్యాంశంగా ఇంకా ఎజెండాపైకి తేవటం లేదు. ఇప్పుడిక అనివార్యం! అభివృద్ది చెందుతున్న ఓ పెద్ద దేశంగా భారత్ నేడు కీలక స్థానంలో ఉంది. ఆరేళ్ల కిందటి పారిస్ ఒప్పందాల నుంచి సాగుతున్న ప్రయాణంలో... ఇచ్చిన హామీల అమలు, ఫలాలు, వైఫల్యాలు, మున్ముందరి సవాళ్లు– అవకాశాలను ప్రపంచమంతా సమీక్షించుకునే ‘భాగస్వాముల సదస్సు’ (కాప్26) వైపు అడుగులు పడుతున్నాయి. గ్లాస్గో (నవంబరు1–12)లో జరిగే ఈ సదస్సునాటికి చాలా విషయాల్లో మనం విధాన నిర్ణయాలతో సన్నద్ధం కావాలి. పరిష్కారంలో భాగమైతేనే... వాతావరణ సంక్షోభంలో మన పరిస్థితి సంక్లిష్టమే! భారత భూభా గంలో 65 శాతం కరువు ప్రభావిత ప్రాంతం, 12 శాతం భూమి వరదలు, 8 శాతం భూభాగం తుఫాన్ల ప్రభావితం. దీనికి తోడు భూతాపోన్నతికి కరుగుతున్న మంచు పర్వతశ్రేణి, హిమాలయాలు ఉత్తర సరిహద్దులుగా ఉన్న దేశం. మేఘ విచ్ఛిత్తితో కుండపోత వర్షాలు, మెరుపు వరదలు, కొండచరియలు విరిగిపడే విధ్వంసాలు ఇప్పటికే పెచ్చుమీరాయి. ‘వాతావరణ మార్పుల’పై యూఎన్ ఏర్పాటు చేసిన అంతర్ ప్రభుత్వ వేదిక (ఐపీసీసీ) ఆరో నివేదిక ప్రకారం మిగతా సముద్రాల కన్నా హిందూమహాసముద్రం వేగంగా వేడెక్కడం మనకు అరిష్టం. వేడి గాలులే కాకుండా రుతుపవనాలను, వ్యవసాయ పరిస్థితుల్నీ ప్రతికూలంగా ప్రభావితం చేస్తోంది. సుదీర్ఘ తీరం ఉండటంతో సముద్రమట్టాల పెరుగుదల ప్రమాదమౌతోంది. మన సముద్ర తీరంలోని ఖిదిర్పూర్ (కోల్‌కత), పారాదీప్ (ఒడిశా), విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్), ట్యూటీకొరిన్, చెన్నై (తమిళనాడు), కొచ్చి (కేరళ), మంగళూరు (కర్ణాటక), మార్ముగోవా (గోవా), ముంబాయి (మహారాష్ట్ర), కండ్ల, ఓఖా, భావ్‌నగర్ (గుజరాత్) ఈ 12 నగరాలు/ పట్టణాలు జలమయమయ్యే ప్రమాద సంకేతాలున్నాయి. తాజా ఐపీసీసీ నివేదిక ఆధారంగా, ఈ శతాబ్ది అంతానికి ఇవి సుమారు మూడు అడుగుల మేర నీట మునిగే ప్రమాదముందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ విశ్లేషించింది. ‘వాతా వరణ మార్పు’ విశ్వవ్యాపితమైనా సమస్యలు, సంక్షోభాలు స్థానిక మైనవే! పరిష్కరాలను స్థానికంగా యోచించాలి. సమస్య తీవ్రత అధి కంగా ఉన్న దేశాల్లో ఉన్న మనం, బాధిత దేశమే అయినా.. సమస్యలో కన్నా పరిష్కారంలో భాగం కావాలి. పెద్దన్న పాత్ర పోషించాలి ప్రపంచంలో మనం రెండో అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఎదిగాం. చైనా తర్వాత మనదే స్థానం! వాతావరణ కాలుష్యానికి, తద్వారా భూతాపో న్నతికి కారణమవుతున్న కర్భన ఉద్గారాల విడుదలలో మనది మూడో స్థానం. విద్యుత్ వినియోగంలో చైనా, అమెరికా, ఐరోపా సంఘం (ఈయూ) తర్వాత భారత్‌ది నాలుగో స్థానం! శిలాజ ఇంధనాల వినియోగమే 80 శాతం కర్బన ఉద్గారాలకు కారణం. ఆయా దేశాల ఇంధన విధానాలు, నూతన వైఖరులే వాతావరణ సంక్లిష్టతను నిర్దేశి స్తున్నాయి. పారిశ్రామిక విప్లవం తర్వాత, రెండో ప్రపంచ యుద్ధానం తరం, మరీ ముఖ్యంగా ప్రపంచీకరణ తర్వాత జరిగిన వాతావరణ నష్టమే అపారం. అభివృద్ధి చెందిన దేశాలు, ఆ క్రమంలో విడుదల చేసిన–చేస్తున్న ఉద్గారాలు, వెదజల్లిన కాలుష్యాలు, ప్రకృతివనరుల దోపిడీకి లెక్కేలేదు. ఇది నొక్కి చెబుతూ పారిస్ ఒప్పంద సమయంలో భారత్ క్రియాశీల పాత్ర పోషించింది. మారిన మార్కెట్ పరిస్థితులు, ప్రపంచ రాజకీయార్థిక పరిణామాల నేపథ్యంలో, రానున్న కాలం లోనూ భారత్ పోషించాల్సింది కీలక భూమికే! మన వాణికి ఎక్కువ ఆదరణ! కర్బన ఉద్గారాల స్థాయిని బట్టి, అభివృద్ధి సమాజాల పాపమే అధికమైనప్పటికీ, అభివృద్ధి చెందిన దేశాలను ఆర్థికంగా, సాంకేతికంగా ఆదుకునేందుకు ఆయా దేశాలు ఉదారంగా ముందుకు రావడం లేదు. మన పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. మనం బాధితు లమైనా పరిష్కర్తలుగా ముందున్నాం. వాతావరణ సంక్షోభంలో... ‘కారణ’మైనదానికి నాలుగు రెట్లు ‘భారం’ మనం మోస్తున్నాం. విధానాలు మార్చుకోక తప్పదు! విద్యుదుత్పత్తి ఇంధన వనరుల వినియోగం తర్వాత కర్బన ఉద్గారా లకు, కాలుష్యానికి కారణమవుతున్న వాటిలో పౌర రవాణా, నిర్మాణ, ఉత్పత్తి, వస్తు రవాణా, సేవా తదితర రంగాలున్నాయి. విధాన నిర్ణయాలు చేసేటప్పుడు ‘వాతావరణ మార్పు’ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఉద్గారాలు, ఇతర కాలుష్యాల్ని నివారించేలా ప్రాధాన్య తలు మార్చాలి. ముఖ్యంగా శిలాజ ఇంధన వినియోగం తగ్గించాలి. పెట్రోలియం ఉత్పత్తుల వినియోగంతో కార్బన్డయాక్సైడ్ (సీవో2) విడుదలే కాక 80 శాతానికి మించి దిగుమతులే కనుక ఇదొక ఆర్థిక భారమే! ధరలు రమారమి తగ్గిన పరిస్థితుల్లో సౌర, పవన విద్యుత్తు వంటి పునరుత్పాదక ఇంధనాల వైపు మళ్లాలి. బొగ్గు వినియోగాన్నీ తగ్గించాలి. 2050 నాటికి కర్భన ఉద్గారాల నికర శూన్య స్థితి సాధిం చేందుకు మనం సంకల్పం తీసుకోవాలి. అవసరమైతే గ్లాస్గోలో ప్రకటించాలి. ఇప్పటికే 100 దేశాలు ప్రకటించాయి. ఇతర మెజారిటీ దేశాలు ఈ దిశలో నడిచేలా ఒత్తిడి పెంచాలి. శిలాజ ఇంధనాల వాడకం ఏటా 83 కోట్ల టన్నుల సీవో2 విడుదలకు కారణమవుతోంది. ఇది మారాలి! అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) సూచించినట్టు సింగపూర్‌తో సహా ఇప్పటికే 40 దేశాలు కార్బన్ పన్ను విధిస్తున్నాయి. పన్ను ఏకరీతిలో ఉండాల్సిన పనిలేదు. ప్రపంచ సగటు కింద టన్ను సీఓ2 ఉత్పత్తికి 5 నుంచి 10 డాలర్లు పన్ను ఖరారు చేసి, భారత్‌లో (25), చైనాలో (50), అమెరికాలో (70 డాలర్లు) ఇలా, విభిన్నంగానూ ప్రతిపాదించవచ్చు. డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా గ్రీన్ హైడ్రోజన్ వాడకాన్ని ప్రోత్సహించాలి. వాతావరణ మార్పును తట్టుకునే సామ ర్థ్యాల కోసం వెచ్చిస్తున్న (ఎన్‌ఏఎఫ్‌సీసీ) నిధులు పెంచాలి. తమ వాటా చెల్లించి, రాష్ట్రాలు గరిష్టంగా వినియోగించుకునేలా చూడాలి. దేశంలోని నగరాలు, పట్టణాలు, నదులు, అడవులు, కొండలు... అన్నీ అసాధారణ ఒత్తిడికి గురవుతున్నాయి. వాతావరణ సంక్షోభాన్ని బహుళ కారణాలు జటిలం చేస్తున్నాయి. అన్ని విధాన నిర్ణయాలలో అంతర్లీనంగా ఈ అంశం ఉండేలా చూడాలి. ఎన్నడూ ఈ సమస్యను పట్టించుకోని మన రాజకీయ వ్యవస్థలో కదలిక రావాలి. ఓటు బ్యాంకు రాజకీయాలకు అతీతంగా ఎదిగి భవిష్యత్తరాలనే కాకుండా ప్రస్తుత ప్రజానీకాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాలి. నార్వేతో సహా పలు ఐరోపా దేశాల్లో హరిత పక్ష (గ్రీన్ పార్టీ) రాజకీయాలు మొద లయ్యాయి. నేడు కాకుంటే రేపు... మన దగ్గరా అవి అనివార్యం! ఈమెయిల్:dileepreddy@sakshi.com -
భారత్‌కు కరువు, వడగాల్పుల ముప్పు
న్యూఢిల్లీ: హిందూ మహా సముద్రం వేగంగా వేడెక్కుతోందని వాతావరణ మార్పుపై విడుదల చేసిన ఐపీసీసీ నివేదిక హెచ్చరించింది. ఈ ప్రభావంతో భారత్‌లో వడగాలులు, వరదలు పెచ్చురిల్లుతాయని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ మహాసముద్రం వేడెక్కడంతో దేశం చుట్టూ ఉన్న సముద్ర మట్టాలు పెరుగుతాయని, దీనివల్ల లోతట్టు ప్రాంతాలు భారీ వరదలు, ముంపునకు గురవుతాయని, నేలలో తేమ తగ్గడంతో పలు చోట్ల కరువు సంభవిస్తుందని నివేదిక వెల్లడించింది. ఇండియా లాంటి జనసాంద్రత అధికంగా ఉన్న దేశంలో వడగాలులు పెరగడాన్ని ఏరోసాల్స్(గాలిలో ఉండే సూక్ష్మమైన ధూళి కణాలు) కొంతవరకు అడ్డుకుంటాయని, అయితే దీనివల్ల గాలిలో నాణ్యత లోపిస్తుందని తెలిపింది. రాబోయే రోజుల్లో దేశంలో వానలు, వరదలు పెరగడం, హిమనీ నదాలు కరిగిపోవడం, ఇదే సమయంలో సముద్ర మట్టాలు పెరగడం కలగలిపి భారీ ఇక్కట్లు కలగజేస్తాయని హెచ్చరించింది. ఈ పరిణామాలు అంత తొందరగా ఆగకపోవచ్చని నివేదిక రూపకర్తలో ఒకరైన ఫ్రెడరిక్ ఒట్టో చెప్పారు. దేశీయంగా సముద్ర మట్టాల పెరుగుదలకు 50 శాతం కారణం అధిక ఉష్ణోగ్రతలేనని మరో సైంటిస్టు స్వప్న చెప్పారు. 21 శతాబ్దమంతా భారత్ చుట్టూ సముద్ర మట్టాలు పెరగడాన్ని గమనించవచ్చని, అలాగే వందల సంవత్సరాలకు ఒకమారు వచ్చే సముద్ర బీభత్సాలు ఈ శతాబ్దం చివరకు సంభవించవచ్చని అంచనా వేశారు. వచ్చే 20– 30 ఏళ్లలో భారత్‌లో వర్షపాతం పెద్దగా మారకపోవచ్చని కానీ శతాబ్దాంతానికి తేడా వస్తుందని పేర్కొంది. భారత్, దక్షిణాసియాల్లో అసాధారణ రుతుపవన గమనాలుంటాయని ఐపీసీసీ తెలిపింది. దీనివల్ల స్వల్పకాలిక వర్షపాత దినాలు ఎక్కువైతాయని, దీర్ఘకాలిక వర్షదినాలు తగ్గుతాయని తెలిపింది. పట్టణీకరణ(అర్బనైజేషన్)తో పెరుగుతున్న ప్రమాదాలను వివరించింది. మానవ తప్పిదాలే ఈ పరిస్థితులకు కారణమని నివేదిక తెలిపింది. 1970 నుంచి మానవ చర్యల కారణంగా సముద్ర పర్యావరణంలో మార్పులు వస్తున్నాయని, 1990తో పోలిస్తే ఆర్కిటిక్ సముద్రం 40 శాతం కుంచించుకుపోయిందని తెలిపింది. గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను గణనీయంగా తగ్గించకపోతే ఊహించని ప్రమాదాలు తప్పవని, ఇప్పటినుంచే మేల్కొని తగిన చర్యలు చేపట్టాలని సూచించింది. -
మానవాళికి డేంజర్ బెల్స్.. పరిస్థితి విషమిస్తోంది
ప్రపంచ పర్యావరణం ప్రమాదపు అంచున ఉందని, ప్రపంచదేశాలు తగు చర్యలు తీసుకోకపోతే ప్రజలు పారిపోయేందుకు స్థలముండదని ఐరాస నివేదిక హెచ్చరించింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే వచ్చే దశాబ్దంలో ఉష్ణోగ్రతలు గతంలో అనుకున్న ప్రమాద స్థాయిలను మించి పోతాయని ఆందోళన వ్యక్తం చేసింది. పర్యావరణ పరిస్థితి చేయిదాటిపోతోందని, ‘కోడ్ రెడ్ ఫర్ హ్యుమానిటీ’ పేరిట ఐరాస విడుదల చేసిన నివేదిక రూపకర్త లిండా మెర్న్స్ చెప్పారు. ఈ ఉత్పాతం నుంచి తప్పుకునే అవకాశం లేదని హెచ్చరించారు. ఐరాసకు చెందిన ఐపీసీసీ(ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్) ఈ నివేదికను విడుదల చేస్తుంది. ప్రపంచ పర్యావరణంలో సంభవిస్తున్న ఈ శీతోష్ణస్థితి మార్పు మానవ తప్పిదాల వల్ల జరుగుతోందనేందుకు సందేహమే లేదని ఐపీసీసీ తెలిపింది. 21వ శతాబ్దంలో ఇంతవరకు ఐపీసీసీ ఇలాంటి సీరియస్ అంచనాలను వెలువరించలేదు. రాబోయే ప్రమాదం తప్పిపోవాలంటే పారిస్ ఒప్పందంలో పేర్కొన్న దానికన్నా రెండింతలు అధికంగా, వేగంగా కర్బన ఉద్గారాలను తగ్గించాల్సిఉంటుందన్నారు. 2015 ప్యారిస్ ఒప్పందం ప్రకారం భూఉపరితల ఉష్ణోగత్ర 19వ శతాబ్దపు స్థాయిలకన్నా 1.5 డిగ్రీల సెల్సియస్‌కు మించి పెరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రపంచ నేతలు అంగీకరించారు. ఇప్పటికే ప్రపంచ ఉష్ణోగత్రలు 19వ శతాబ్దపు గరిష్టస్థాయిల కన్నా 1.1 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉన్నాయి. అంటే ప్రపంచం ముప్పునకు చాలా దగ్గరగా ఉందని తెలుస్తోంది. ఐదు మార్గాలు ప్రపంచ కర్బన ఉద్గారాలను కట్టడి చేసే విధానాన్ని బట్టి ఐదు రకాల భవిష్యత్ అంచనాలను నివేదిక ప్రస్తావించింది. 1. ఊహించనంత వేగంగా, భారీగా దేశాలు కాలుష్య నివారణ చర్యలు చేపట్టడం. 2. తీవ్రమైన కాలుష్య నివారణ చర్యలుంటాయి కానీ భారీగా ఉండవు. 3. ఒక మోస్తరుగా ఉద్గారాల నియంత్రణ చేపట్టడం. 4. ప్రస్తుతమున్న స్వల్పకాలిక ప్రణాళికలను కొనసాగించడం. 5. కర్బన ఉద్గారాలు మరింతగా పెరగడం.. అనే ఐదు రకాల అంచనాలున్నాయని, ఇప్పటివరకు ప్రపంచం ఐదో మార్గంలో పయనిస్తూ వచ్చిందని, ఇటీవల కాలంలో మూడు, నాలుగు మార్గాలకు మధ్యస్థంగా ఉంటోందని నివేదిక వివరించింది. పైన చెప్పిన ఐదు మార్గాల్లో దేనిలోనైనా సరే 2030నాటికి ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్ టార్గెట్‌ను దాటటం ఖాయమని నివేదిక హెచ్చరించింది. 3,4 మార్గాలను అనుసరిస్తే ప్రపంచ ఉష్ణోగ్రత అంచనాలను దాటి 2 డిగ్రీల సెల్సియస్ మేర పెరుగుతుందని, ఐదవ మార్గం కొనసాగితే 2100 నాటికి ప్రపంచ ఉష్ణోగ్రత అంచనా కన్నా 3.3 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా పెరుగుతుందని తెలిపింది. కానీ దేశాల దృక్పథంలో వస్తున్న మార్పు వల్ల ఇంత ప్రమాదం జరగకపోవచ్చని నివేదిక అంచనా వేసింది. టిప్పింగ్ పాయింట్లుగా పిలిచే భారీ విధ్వంసాలైన మంచు చరియలు కరిగిపోవడం, సముద్ర ప్రవాహాల్లో అనూహ్య మందగమనం వంటివి జరిగేందుకు అవకాశాలు తక్కువే కానీ, అసలు జరగవని కొట్టిపారేయలేమని హెచ్చరించింది. అందరూ భయపడే అట్లాంటిక్ సముద్ర ప్రవాహాల మందగమనం ఈ శతాబ్దంలో ఉండకపోవచ్చని పేర్కొంది. అయితే ఏమాత్రం పరిస్థితిని అశ్రద్ధ చేయకుండా అందరూ కర్బన ఉద్గారాల కట్టడికి, ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని నివేదిక సూచించింది. దేశాల స్పందన: నవంబర్‌లో జరిగే అంతర్జాతీయ పర్యావరణ సదస్సులో ఈ నివేదిక చర్చకు రానుంది. ఉద్గారాల తగ్గింపు విషయంలో తక్షణ చర్యల అవసరాన్ని నివేదిక నొక్కి చెప్పిందని పలువురు ప్రపంచ నేతలు అభిప్రాయపడ్డారు. ఇది ఒక గట్టి హెచ్చరికగా అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ అభివరి్ణంచారు. మానవాళికి ఇది కోడ్ రెడ్ నివేదికని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ నేతలు ఇప్పటికైనా కనీసం ప్యారిస్ ఒప్పందాన్ని అమలు చేసే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా గుటెరెస్ విజ్ఞప్తి చేశారు. నేతలంతా ఈ విషయంలో తప్పక చర్యలు తీసుకోవాలని స్కాటాండ్లో జరగబోయే సదస్సుకు అధ్యక్షత వహించనున్న అలోక్ శర్మ విజ్ఞప్తి చేశారు. మానవ జనిత కార్బన్‌డైఆక్సైడ్‌ను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని వందకు పైగా దేశాలు ప్రతిజ్ఞ చేశాయి. వేడి పెరిగితే కీడే భూ ఉపరితల ఉష్ణోగ్రతల పెరుగుదలతో వేడి వాయువులు ప్రచండంగా వీయడం, కరువు ఏర్పడడం, అనూహ్య వరదలు సంభవిస్తాయని నివేదిక పేర్కొంది. ఇటీవల కాలంలో శీతోష్ణస్థితిలో వస్తున్న మార్పులు చాలా వేగంగా, తీవ్రంగా, వెయ్యేళ్లలో లేనట్లుగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ పలు నిదర్శనాలను కళ్లముందుంచింది. ► పరిస్థితి విషమిస్తోందనేందుకు సముద్ర మట్టాలు పెరగడం, ఆర్కిటిక్ సముద్రంలో మంచు కరుగుదల స్పీడందుకోవడం, తుఫా నులు తీవ్రంగా మారడం వంటివి సంకేతాలు. ► గతంలో 50 సంవత్సరాలకు ఒకమారు వచ్చే తీవ్ర వడగాలులు ఇప్పుడు పదేళ్లకు ఒకసారి ప్రత్యక్షమవడం శీతోష్ణస్థితిలో ప్రచండ మార్పునకు నిదర్శనం. ప్రపంచ ఉష్ణోగ్రత మరో డిగ్రీ పెరిగితే ఈ గాలులు ప్రతి ఏడేళ్లకు రెండుమార్లు ప్రత్యక్షమవుతాయి. ► ఉష్ణోగ్రతల పెరుగుదలతో కేవలం అనూహ్య శీతోష్ణ మార్పులు కనిపించడమేకాకుండా ఒకేమారు పలు ఉత్పాతాలు సంభవించే అవకాశాలుంటాయి. ఇప్పటికే ఇలాంటి సంఘటనలు పశ్చిమ యూఎస్‌లో జరుగుతున్నాయి(ఒకేమారు వడగాలులు, కరువు, కార్చిచ్చు ప్రత్యక్షం కావడం). ► గ్రీసు, టరీ్కల్లో తాజా కార్చిచ్చుకు సైతం ఈ ఉష్ణోగ్రతల మార్పు కారణమే. ► పరిస్థితి విషమించే కొద్దీ సముద్రాల్లో ఆక్సిజన్ శాతం తగ్గి అవి ఆమ్లయుతాలుగా మారతాయి, ఇదే జరిగితే కొన్ని వేలసంవత్సరాల పాటు అవి మామూలు స్థితికి చేరలేవు. ► కార్బన్‌డైఆక్సైడ్, మిథేన్ వాయు ఉద్గారాలే ఉష్ణోగ్రతల పెరుగుదలకు ప్రధాన కారణాలు. శిలాజ ఇంధనాల వాడకం, జీవుల్లో జరిగే జీవక్రియల ద్వారా ఈ రెండూ ఉత్పత్తి అవుతుంటాయి. సైంటిస్టులు ఈ పరిణామాలపై 30 ఏళ్లుగా హెచ్చరిస్తున్నా, ఎవరూ పట్టించుకోలేదని నివేదిక వాపోయింది. రాబోయే దశాబ్దాల్లో జరగనున్న ఉత్పాతాన్ని తట్టుకునేందుకు ఇప్పటినుంచే చర్యలు చేపట్టాలని ఐపీసీసీ తెలిసింది. ఇప్పుడున్న ఉష్ణోగ్రతలను తగ్గించలేకున్నా, ఇకపై మరింత పెరగకుండా జాగ్రత్త పడాలని సూచించింది. ఇందుకోసం గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలను అదుపు చేయాలని, ముఖ్యంగా కార్బన్‌డైఆక్సైడ్ ఉద్గారాన్ని తగ్గించడం ద్వారా ఉష్ణోగ్రతలు మరింత పెరగకుండా కట్టడి చేయవచ్చని తెలిపింది. -
2027 నాటికి మనమే టాప్
సాక్షి, న్యూఢిల్లీ : భారతదేశం జనాభా పరంగా త్వరలోనే చైనాను అధిగమించనుందట. ప్రస్తుతం టాప్‌లో ఉన్న చైనాను వెనక్కి నెట్టి ఇండియా ముందుకు దూసుకురానుంది. రెండవ స్థానంలో ఉన్న భారత్ 2027 నాటికి మొదటి స్థానంలో నిలవనుందని ఐక్యరాజ్య సమితి తాజా నివేదికలో అంచనా వేసింది. అంతేకాదు 2050 నాటికి 27 కోట్ల (273 మిలియన్ల)కు పైగా జనాభా పెరగడంతో ప్రస్తుత శతాబ్దం చివరి నాటికి అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలవనుందని యుఎన్ నివేదిక వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల జనాభా విభాగం 'ది వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్-2019’ పేరుతో ఈ నివేదికను ప్రచురించింది. రాబోయే 30 ఏళ్లలో ప్రపంచ జనాభా రెండు బిలియన్లు వృద్ది చెంది, ప్రస్తుతం 7.7 బిలియన్ల నుండి 9.7 బిలియన్ల స్థాయికి చేరుతుందని పేర్కొంది. ప్రపంచ జనాభా ప్రస్తుత శతాబ్దం చివరినాటికి దాదాపు 11 బిలియన్ల స్థాయికి చేరుకోగలదని తెలిపింది. ఈ పెరుగుదలలో సగం కంటే ఎక్కువ పెరుగుదల భారత్‌సహా తొమ్మిది దేశాలలో (నైజీరియా, పాకిస్తాన్, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇథియోపియా, టాంజానియా, ఇండోనేషియా, ఈజిప్ట్, అమెరికా) కేంద్రీకృతమై ఉంటుందని యూఎన్ సర్వే తేల్చింది. 2019 -2050 భారతదేశం దాదాపు 1.5 బిలియన్ల జనాభాతో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉంటుంది. చైనా 1.1 బిలియన్లతో, నైజీరియా 733 మిలియన్లతో, యుఎస్ 434 మిలియన్లతో, పాకిస్తాన్ 403 మిలియన్ల జనాభాతో తరువాతి స్థానాల్లో ఉండనున్నాయి. అంతేకాదు ఆయుర్దాయం పెరగడం, సంతాన సాఫల్య సామర్థ్యం తగ్గిపోవడంతో ప్రపంచ జనాభాలో వృద్ధుల సంఖ్య పెరుగుతోందని, జనాభాను తగ్గించుకునేందుకు వివిధ దేశాలు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఇందుకు కారణమని నివేదిక ధృవీకరించింది. 2050 నాటికి, ప్రపంచంలోని ఆరుగురిలో ఒకరు 65 ఏళ్లు (16శాతం ) పై బడి ఉంటారు. 2019లో 11 మందిలో ఒకరు (9శాతం). 80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల వారి సంఖ్య దాదాపు మూడు రెట్లు ఉంటుందని అంచనావేసింది. 2019 లో 143 మిలియన్ల నుంచి 2050 లో 426 మిలియన్లకు చేరుకుంటుందని తెలిపింది. ఇక అభివృద్ది చెందుతున్న దేశాల్లో శిశు మరణల రేటు తగ్గు ముఖం పట్టడంతో పాటు మనిషి జీవన ప్రమాణ రేటు కూడ పెరగనుంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలో సగటున ప్రతి మహిళ 2.1 శాతం పిల్లలకు జన్మనిచ్చే అవకాశాలు ఉన్నాయని నివేదించింది. అటు మనిషి సగటు ఆయువు ప్రమాణం 74 సంవత్సరాలు ఉండగా అది 2050 కల్లా 77 సంవత్సరాలకు పెరగనుంది తెలిపింది. మరోవైపు చైనాలో జనాభా 2019 -2050 మధ్య కాలంలో 31.4 మిలియన్లు లేదా 2.2 శాతం తగ్గుతుందని అంచనా వేసింది. కాగా 2017 ప్రపంచ జనాభా నివేదిక ప్రకారం భారతదేశ జనాభా 2024 నాటికి చైనా జనాభాను అధిగమిస్తుందని అంచనా వేసింది. -
‘ఉగ్ర’ సమిధలుగా చిన్నారులు: ఐరాస
ఐరాస: పాకిస్తాన్‌కు చెందిన జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ తదితర ఉగ్రవాద సంస్థలు జమ్మూ కశ్మీర్లో భద్రతా దళాలపైకి రాళ్లు రువ్వేందుకు, అల్లర్లు సృష్టించేందుకు చిన్నారులను ఆయుధాలుగా వాడుకుంటున్నాయని ఐక్యరాజ్యసమితి (ఐరాస) నివేదికలో వెల్లడించింది. చిన్నారులు, సాయుధ దాడులు అనే అంశంపై ఐరాస వార్షిక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. 2017 జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్రపంచవ్యాప్తంగా అల్లర్ల కారణంగా మరణించిన, గాయాలపాలైన చిన్నారుల సంఖ్య పదివేలకు పైగా ఉంది. అంతేకాకుండా ఉగ్ర సంస్థలు అల్లర్లు సృష్టించడానికి ఎనిమిది వేల మంది బాలలను నియమించుకున్నాయని నివేదిక స్పష్టం చేసింది. సిరియా, అఫ్గానిస్తాన్, యెమెన్, భారత్, ఫిలిప్పీన్స్, నైజీరియాలతో పాటు 20 దేశాలకు సంబంధించి ఈ నివేదికను తయారు చేశారు. భారత్‌లో ముఖ్యంగా జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులకు.. భద్రతా దళాలకు మధ్య జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో చిన్నారులు ఎక్కువగా బలైపోతున్నారని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లలో మావోయిస్టులు కూడా చిన్నారులనే ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు ప్రత్యేకంగా చిన్నారులను నియమించుకొని వారిచేత అల్లర్లు చేయిస్తున్నారని, అలాగే పిల్లలను ఇన్ఫార్మర్లు, గూఢచారులుగా ఉపయోగించుకుంటున్నారని వెల్లడించారు. పాకిస్తాన్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని నివేదిక వెల్లడించింది. -
అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో ఐరాస ఇచ్చిన నివేదికను తప్పుబట్టిన ఆయన.. అది భారతదేశ అంతర్గత విషయమని తేల్చారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఆయన చేసిన కామెంట్లు చర్చనీయాంశంగా మారాయి. ‘ఇది మన దేశ సార్వభౌమత్వానికి సంబంధించిన అంశం. ఇది ఇండియా సమస్య. నా చివరి శ్వాస వరకు ప్రధాని నరేంద్ర మోదీని నేను వ్యతిరేకిస్తా. కానీ, దేశం ప్రతిష్టకు సంబంధించిన అంశం జోలికొస్తే మాత్రం ప్రభుత్వానికి మేం మద్ధతుగా నిలుస్తాం’ అని ఒవైసీ వ్యాఖ్యానించారు. ఒకదేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు ఐరాస విభాగానికి లేదు. మానవ హక్కుల సంఘం అన్నది ఈ దేశంలో ఓ స్వతంత్ర్య విభాగం. ఈ విషయంలో మేం ప్రభుత్వం వెంటే ఉంటాం’ అని స్పష్టం చేశారు. శనివారం మక్కా మసీదులో నిర్వహించిన ఓ సభలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు. అయితే కశ్మీర్లో పరిస్థితికి మాత్రం పీడీపీ-బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం కారణమని ఆయన ఆక్షేపించారు. ‘ఐరాస మానవహక్కుల సంఘం ఇచ్చిన నివేదిక.. అక్కడి కూటమి ప్రభుత్వ ‘దౌత్య వైఫల్యాన్ని’ ప్రస్పుటిస్తోంది. జమ్ము కశ్మీర్లో ఉగ్రదాడులను నిలువరించటంలో బీజేపీ-పీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది’ అని అసదుద్దీన్ పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలకు సంబంధించి ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలపై అంతర్జాతీయ విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. కశ్మీర్‌కు సంబంధించి ఇలాంటి నివేదికను ఐక్యరాజ్యసమితి విడుదల చేయడం ఇదే తొలిసారి. అయితే ఈ నివేదికపై భారత్ ఘాటుగా స్పందించింది. ‘నివేదిక భారతదేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత లను ఉల్లంఘించేలా ఉంది. ఇది పూర్తిగా దురుద్దేశంతో కూడిన, మోసపూరితమైన, ఇతరుల ప్రేరణతో రూపొందించిన నివేదికలా ఉంది. జమ్మ కశ్మీర్ రాష్ట్రం మొత్తం భారత్‌లో అంతర్భాగం. పాక్.. చట్టవిరుద్ధంగా, దురాక్రమణ ద్వారా భారత్‌లో కొంత భాగాన్ని ఆక్రమించుకుంది’ అని భారత విదేశాంగ శాఖ మానవహక్కుల సంఘానికి ఓ లేఖ రాసింది. -
మహిళల ఉసురు తీస్తున్న 'కులం'
పురుషాధిపత్య సమాజంలో మహిళలు సామాజిక అణచివేతకు, లింగ వివక్షకు గురి అవుతున్నారనేది ఎవరూ కాదనలేని సత్యం. అయితే తాజాగా ఐక్యరాజ్య సమితి (ఐరాస) విడుదల చేసిన నివేదిక మరింత ఆందోళనకు గురిచేసింది. దళిత మహిళలపై జరుగుతున్న లైంగిక, శారీరక దాడులు, వివక్షకు తోడు వారిని కులం కూడా కాటేస్తోందని యూఎన్ అధ్యయనం వెల్లడించింది. వారు నివసించే మురికివాడల్లోని పారిశుధ్యలేమి, అనారోగ్య పరిస్థితులు, అందుబాటులో లేని వైద్య సదుపాయాలు దళిత మహిళల ఆయుర్దాయాన్ని మింగేస్తున్నాయని తెలిపింది. ఆధిపత్యకులాలలోని మహిళలతో పోలిస్తే దళిత మహిళ కనీసం 15ఏళ్లు (14.6)ముందుగానే కన్నుమూస్తోందని ఐరాస నివేదిక తేల్చింది. దళిత మహిళ సగటున 39.5 ఏళ్లకే చనిపోతోంటే.. ఇతర కులాల మహిళల్లో ఇది 54.1 గా ఉంది. అంతేకాదు సామాజిక హోదా, ఇతర అంశాలు సమానంగా ఉన్నప్పటికీ కూడా ఈ గ్యాప్ 11 సంవత్సరాలుగా ఉంది. ఐక్యరాజ్యసమితి 2015 లో '2030 నాటికి జెండర్ ఈక్వాలిటీ' సాధించాలనే ఎజెండాను ఆమోదించిన రెండు సంవత్సరాల అనంతరం ఈ నివేదికను వెల్లడించింది. పేదరిక నిర్మూలన, ఆహారం, నీరు, పారిశుధ్యం, ఆరోగ్యం, భూమి, నాణ్యమైన విద్య, లింగ సమానత్వం లాంటి 17 రకాల సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డీజీ) అమలులో సవాళ్లను ఈ అధ్యయనం పరిశీలించింది. దాదాపు 89 దేశాల్లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ దళిత్ స్టడీస్ పేరుతో నిర్వహించిన అధ్యయనం ఈ విషయాలను ప్రకటించింది. సమాజంలో వెనుకబడి ఉన్న మహిళలు, బాలికలు తరచూ లింగ అసమానతలతోపాటు ఇంకా పలురకాల కష్టాలు అనుభవిస్తున్నారు. నిరుపేద కుటుంబాలలో నివసించే స్త్రీలు తమ పని సమయములో 24శాతం వంట చెఱకు, నీరు, ఆహారం, గృహ అవసరాలకోసం వినియోగిస్తుండగా, ధనిక కుటుంబాలలోని మహిళలు దీంట్లో సగ భాగాన్ని అంటే 12శాతం సమయాన్ని అలాంటి పనులకు కేటాయిస్తున్నారట. భారతదేశంలో 20-24 ఏళ్ల వయస్సులో ధనిక వర్గాలనుంచి వచ్చిన యువతులతో పోలిస్తే గ్రామీణ పేద యువతుల్లో పాఠశాలకు వెడుతున్నవారి సంఖ్య 21.8 రెట్లు తక్కువగా ఉంది. అలాగే 18 ఏళ్ళలోపు పెళ్లిళ్లు గ్రామీణ ఐదు రెట్లు ఎక్కువ. కౌమార దశలోనే తల్లులుగా మారుతున్న వారి సంఖ్య 5.8రెట్లు ఎక్కువ. సాంఘిక సోపానక్రమంలో తక్కువ విద్య, తక్కువ హోదా ఉన్న మహిళ మరింత శ్రమదోపిడీకి గురవుతుందనీ, భూమిలేని, షెడ్యూల్డ్ కులాలు, తెగల నుంచి వచ్చి ఉంటే ఈ దోపిడీ ఇంకా తీవ్రంగా ఉంటుందని నివేదిక పేర్కొంది. 1990ల ప్రారంభం నుంచి దేశవ్యాప్తంగా మొత్తం అక్షరాస్యత రేటు, పాఠశాలలకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ, లింగ, సామాజిక అసమానతలు ఇప్పటికీ ఉన్నాయని నివేదించింది. ఇందుకు జనాభాలో 16.6శాతంగా ఉన్న షెడ్యూల్డ్ తెగలు 8.6శాతంగా ఉన్న షెడ్యూల్డ్ కులాల అక్షరాస్యత రేటు భారతీయ సగటు అక్షరాస్యత రేటు కంటే తక్కువగా ఉండటాన్ని నిదర్శనంగా పేర్కొంది. ఎస్.టి. మహిళల అక్షరాస్యత రేటు ఇప్పటికీ 50శాతం కంటే తక్కువగా, ఎస్సీ మహిళల్లో 57శాతం కంటే తక్కువగా ఉందని చెప్పింది. అందరికీ అభివృద్ధి అనే లక్ష్యాన్ని సాధించాలంటే మహిళల ముందస్తు పురోగతి ప్రాధాన్యతను యూఎన్ నివేదిక నొక్కి చెప్పింది. -
స్వచ్ఛ భారత్‌లో లోపాలు: ఐరాస ప్రతినిధి
ఢిల్లీ: ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పలు లోపాలు ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రతినిధి ఒకరు తన నివేదికలో పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ పథకంలో సమగ్ర మానవ హక్కుల విధానం లోపించిందనీ, మరుగుదొడ్ల నిర్మాణానికి ఇస్తున్న ప్రాధాన్యత సురక్షిత తాగునీరు సరఫరా చేయడానికి ఇవ్వడం లేదని విమర్శించారు. పరిశుభ్రత, రక్షిత తాగునీటికి సంబంధించిన మానవ హక్కుల పరిశీలన కోసం లియో హెల్లర్ అనే ఐరాస ప్రతినిధి 2 వారాల పాటు భారత్‌లో పర్యటించి నివేదిక ఇచ్చారు. బహిరంగ మలమూత్ర విసర్జన లేని (ఓడీఎఫ్) ప్రాంతాలంటే అక్కడ మరుగుదొడ్లు కట్టడం కాదన్నారు. ఓ ప్రాంతాన్ని ఓడీఎఫ్‌గా ప్రకటించేందుకు అనుసరిస్తున్న పద్ధతులు సక్రమంగా లేవన్నారు. -
మాంసం ఎక్కువగా లాగిస్తున్న దేశాలివే..
న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాలో ముక్క లేనిదే ముద్ద దిగడం లేదని ఐక్యరాజ్య సమితి వెల్లడించిన ఓ నివేదికలో తెలిసింది. ఒక అమెరికన్ ఏడాది కాలంలో సరాసరిన 126.6 కిలోల మాంసాన్ని హాంఫట్ చేస్తున్నాడు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో వెల్లడించిన 'ద స్టేట్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్' నివేదికలో కేవలం లగ్జెంబర్గ్, హాంకాంగ్ ప్రజలు మాత్రమే మాంసం వినియోగంలో అమెరికా కంటే ముందున్నారని తేలింది. ఇది లగ్జెంబర్గ్‌లో 142.5 కిలోలుగా ఉండగా.. హాంకాంగ్‌లో 134 కిలోలుగా ఉంది. బ్రిటన్ 83.9 కిలోల మాంసం వినియోగంతో 25వ స్థానంలో నిలిచింది. 175 దేశాలతో విడుదల చేసిన ఈ జాబితాలో ఇక అతితక్కువ మాంసం వినియోగిస్తున్న దేశంగా బంగ్లాదేశ్ నిలిచింది. ఇక్కడ ఏడాది కాలంలో తలసరి వినియోగం 3.1 కిలోలుగా ఉంది. బురుండీ, కాంగోలు 3.7, 4.6 కేజీలతో బంగ్లాదేశ్ తరువాత తక్కువ వినియోగిస్తున్న దేశాలుగా నిలిచాయి. భారత్ 5.1 కిలోల తలసరి వినియోగంతో ఈ జాబితాలో 169వ స్థానంలో నిలిచింది. -
అమ్మాయిలే ఎందుకు చనిపోతున్నారు!
న్యూయార్క్: భావి భారతదేశంలో పెద్ద సమస్య తలెత్తే అవకాశం ఉంది. అది.. అమ్మాయిల సంఖ్య నానాటికీ తగ్గిపోవడం. ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన ఓ నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. 'ది వరల్డ్ ఉమెన్ 2015' పేరిట ఐక్యరాజ్య సమితి ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులో తూర్పు ఆసియా, దక్షిణాసియా, పశ్చిమాసియాలో అబ్బాయిలు, అమ్మాయిల మధ్య నిష్పత్తిని వెల్లడించింది. ఈ మూడు ప్రాంతాల్లో తూర్పు ఆసియాలో 50.5 మిలియన్ ల మంది పురుషులు ఉన్నారు. ఇక్కడ అత్యధిక సంఖ్యలో పురుషులు ఉండటానికి చైనా కారణం. ఇక దక్షిణాసియాలో 49.5 మిలియన్ల మంది పురుషులు ఉండగా అంత ఎక్కువ సంఖ్యలో ఉండటానికి ఇండియానే కారణమట. ఇక పశ్చిమాసియా 12.1 మిలియన్ల మంది పురుషులు ఉండగా వారిలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలే కారణం అని నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా చూసినప్పటికీ చైనా, ఇండియాలోనే అత్యధికంగా పురుషులు స్తీల నిష్పత్తి మధ్య తీవ్ర వ్యత్యాసం ఉందని, ఇక భారత్‌లో పురుషులు అధిక సంఖ్యలో ఉండి స్త్రీలు తక్కువ సంఖ్యలో ఉండటానికి ప్రధాన కారణం ఐదేళ్లలోపు బాల బాలికల మరణాల్లో బాలికల మరణాలే ఎక్కువగా ఉండటం అని చెబుతున్నారు. గర్భస్రావం చేయించడాన్ని నిషేధిస్తూ భారత్ చట్టం తీసుకురావడం వల్ల ఈ నిష్పత్తి కొంచెం తక్కువగానే ఉందని, అయితే, ఐదేళ్ల లోపు మరణాలే బాలబాలికల నిష్పత్తి తగ్గడానికి మరోకారణం అవుతోందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఐదేళ్లు వచ్చేసరికి దాదాపు 93 మంది బాలురు చనిపోతుంటే బాలికలు మాత్రం 100 మంది చనిపోతున్నారట. ఇండియాలో మగపిల్లలు కలిగి ఉండటాన్ని ఒక సాంప్రదాయంగా భావిస్తారని, అబ్బాయిలపై తీసుకున్న శ్రద్ధ అమ్మాయిలపై తీసుకోరని, ఇదే బాలికల మరణాలు సంభవించడానికి మరో ప్రధాన కారణం అవుతోందని నివేదిక వెల్లడించింది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని వెంటనే వారి సంరక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది. -
యువ జనాభాలో భారత్ ఆగ్ర స్థానం
ఐక్యరాజ్యసమితి: ప్రపంచంలో అత్యధిక యువ జనాభా గల దేశంగా భారత్ ఆవిర్భవించింది. దేశంలో 10 నుంచి 24 ఏళ్లలోపు ఉన్నవారి సంఖ్య దాదాపు 34.6 కోట్లుగా ఉంది. ఐక్యరాజ్యసమితి అనుబంధ యునెటైడ్ నే షన్స్ పాపులేషన్ ఫండ్ మంగళవారం తాజాగా విడుదల చేసిన ప్రపంచ జనాభా నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా ఉన్న చైనాను భారత్ ఈ విషయంలో అధిగమించడం గమనార్హం. యువతకు నాణ్యమైన విద్యా, వైద్య సదుపాయాలు కల్పించడం ద్వారా అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థికాభివృద్ధిని సాధించవచ్చని యూఎన్ఎఫ్పీఏ పేర్కొంది. -
ఏటా 3,72,000 మంది జలసమాధి
ఐక్యరాజ్యసమితి: ప్రపంచంలో ఏటా నీళ్లలో మునిగి 3,72,000 మంది చనిపోతున్నట్లు ఐక్యరాజ్యసమితి తాజాగా వెల్లడించింది. ‘ప్రివెంటింగ్ ఎ కిల్లర్’ పేరుతో రూపొందించిన ఈ నివేదికను ఐరాస సోమవారం విడుదల చేసింది. గంటకు 40 మందికిపైగా జలసమాధి అవుతున్నారని పేర్కొంది. వాతావరణ మార్పువల్ల ఎక్కువగా సంభవిస్తున్న వరదలు, ఎక్కువమంది శరణార్థులు పడవల్లో ప్రయాణించడం, గ్రామీణాభివృద్ధి, శానిటేషన్ లేకపోవడం వల్ల జల ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఐరాస ఆ నివేదికలో తెలిపింది.