ఐక్యరాజ్యసమితి: ప్రపంచంలో అత్యధిక యువ జనాభా గల దేశంగా భారత్ ఆవిర్భవించింది. దేశంలో 10 నుంచి 24 ఏళ్లలోపు ఉన్నవారి సంఖ్య దాదాపు 34.6 కోట్లుగా ఉంది. ఐక్యరాజ్యసమితి అనుబంధ యునెటైడ్ నే షన్స్ పాపులేషన్ ఫండ్ మంగళవారం తాజాగా విడుదల చేసిన ప్రపంచ జనాభా నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా ఉన్న చైనాను భారత్ ఈ విషయంలో అధిగమించడం గమనార్హం.
యువతకు నాణ్యమైన విద్యా, వైద్య సదుపాయాలు కల్పించడం ద్వారా అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థికాభివృద్ధిని సాధించవచ్చని యూఎన్‌ఎఫ్‌పీఏ పేర్కొంది.