వైరల్‌: కలిసి నటిస్తున్న మహేశ్‌, రణ్‌వీర్‌! | Mahesh Babu, Ranveer Singh Pic From Advertisement Went Viral | Sakshi
Sakshi News home page

వైరల్‌: కలిసి నటిస్తున్న మహేశ్‌, రణ్‌వీర్‌!

Published Sat, Dec 26 2020 3:15 PM | Last Updated on Sat, Dec 26 2020 3:39 PM

Mahesh Babu, Ranveer Singh Pic From Advertisement Went Viral - Sakshi

అభిమాన హీరో సినిమా అంటే ఫ్యాన్స్‌ చేసే హడావుడి అంతా ఇంతా కాదు. అలాంటిది ఇద్దరు హీరోలు ఒకే సినిమాలో నటిస్తే.. వారిని చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఈ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని దర్శకనిర్మాతలు కూడా మల్టీస్టార్టర్‌ సినిమాలకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ మధ్య ఒకే ఇండస్ట్రీలోని హీరోలతో సినిమాలు తీయడం కాకుండా వేర్వేరు ఇండస్ట్రీలోని హీరోలను ఒకచోటకు చేర్చి ప్యాన్‌ ఇండియా లెవల్లో సినిమా తీయడం ట్రెండింగ్‌గా మారింది. అందుకు బాహుబలి హీరో ప్రభాస్‌ నటిస్తున్న ఆదిపురుష్‌ చిత్రాన్ని ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇందులో తెలుగు హీరో ప్రభాస్‌ రాముడిగా, హిందీ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ రావణుడిగా నటిస్తున్నారు. (చదవండి: క్షమాపణలు చెప్పిన సైఫ్‌ అలీఖాన్‌)

ఈ విషయాన్ని కాస్త పక్కనపెడితే తాజాగా టాలీవుడ్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌వీర్‌ సింగ్‌ కలిసి ఉన్న ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారేమో అని ఓ క్షణం భ్రమపడ్డారు. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. వీళ్లు నిజంగానే కలిసి నటిస్తున్నారు.. కానీ సినిమా కోసం కాదు కమర్షియల్‌ యాడ్‌ కోసం! యాడ్‌ షూటింగ్‌లో ఇద్దరు హీరోలు పాల్గొంటున్న ఫొటో ఆన్‌లైన్‌లో లీకవగా అది అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇదిలా వుంటే రణ్‌వీర్‌ ప్రస్తుతం 'సర్కస్'‌ సినిమాలో నటిస్తున్నారు. రోహిత్‌ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. కపిల్‌ దేవ్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న '83'లోనూ మెప్పించనున్నారు. ఇక మిల్కీబాయ్‌ మహేశ్‌ సినిమాల విషయానికి వస్తే.. ఆయన పరశురామ్‌ దర్శకత్వంలో 'సర్కారువారి పాట' చిత్రంలో నటిస్తున్నారు. రాజమౌళితో ఓ సినిమా కమిట్‌ అయ్యారు. అలాగే వంశీ పైడిపల్లి దర్శకత్వలో పక్కా మాస్‌ క్యారెక్టర్‌తో ఓ సినిమా చేస్తారట. (చదవండి: మన ఆత్మలు ఒకటిగా ముడిపడి ఉన్నాయి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement