న్యూఢిల్లీ: ప్రకటనల రంగ కంపెనీ క్రేయాన్స్ అడ్వర్టైజింగ్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు అనుగుణంగా ఎన్‌ఎస్‌ఈ ఎమర్జ్‌కు ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. వీటి ప్రకారం రూ. 10 ముఖ విలువగల 64.3 లక్షల ఈక్విటీ షేర్లను బుక్‌బిల్డింగ్ విధా నంలో జారీ చేయనుంది. తద్వారా సమీకరించి న నిధుల్లో రూ. 15.3 కోట్లను మౌలికసదుపాయాలు, విస్తరణకు అవసరమైన ఆధునిక సాంకేతికతకు వినియోగించనుంది.
అంతేకాకుండా మరో రూ. 14.5 కోట్లను వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వెచ్చించనుంది. క్రేయాన్స్ అడ్వర్టైజింగ్ ప్రధానంగా బ్రాండ్ వ్యూహాలు, క్రియేటివ్ సొల్యూషన్లు, ఈవెంట్లు, డిజిటల్, సంప్రదాయ మీడియా ప్లానింగ్ తదితర సర్వీ సులను అందిస్తోంది. ఇటీవలే టాటా సన్స్, జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ కాంట్రాక్టులు పొందింది. క్లయింట్ల జాబితాలో ఐవోసీ, టాటా క్రోమా, బ్యాంక్ ఆఫ్ బరోడా సైతం చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment