
సాక్షి, హైదరాబాద్: అరుదైన వ్యాధితో బాధపడుతున్న యువతి ప్రాణాలు కాపాడుకునేందుకు దాతల సహాయం కోసం ఎదురు చూస్తోంది. తన కుమార్తె ఆరోగ్యం మెరుగుపడేందుకు సాయం చేయాలని ఆమె తల్లిదండ్రులు కోరుతున్నారు. ఎ. శ్వేత అనే యువతి తీవ్ర రక్త స్రావంతో బాధ పడుతూ జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తన కూతురి వైద్యానికి ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చువవుతాయని, తమ వద్ద అంత డబ్బులేదని శ్వేత తండ్రి రమేశ్ తెలిపారు. దాతలు సహాయం చేస్తే తన కుమార్తె ఆరోగ్యం బాగవుతుందని ఆయన వేడుకుంటున్నారు. ఇంపాక్ట్‌గురు స్వచ్ఛంద సంస్ధ సహాయంతో దాతల నుంచి సాయం అర్ధిస్తున్నారు.
కాలేయానికి రక్తం సరఫరా చేసే నాళాల్లో పెద్ద సమస్య ఏర్పడిందని, వెంటనే శస్త్ర చికిత్స చేయాలని శ్వేతకు వైద్యం అందిస్తున్న డాక్టర్ శివచరణ్ తెలిపారు. ఆపరేషన్‌కు పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమవుతామయని.. తమ వైద్యులంతా కలిసి కొంత మొత్తం సేకరించామని వెల్లడించారు. ఆస్పత్రి వర్గాలు కూడా సహరిస్తున్నాయని చెప్పారు.
శ్వేత సంపూర్ణ ఆరోగ్య కోసం సహాయం చేయలనుకునే వారు ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment