పిల్లల కోసం ఎంతోకాలం ఆ దంపతులు ఎదురుచూశారు. ఆ బోసినవ్వులు తమ ఇంట్లో ఎప్పుడు వింటామా అని ఆశగా ఆ దేవుడిని వేడుకున్నారు. ఫలితంగా పెళ్లయిన ఐదేళ్లకు వారి కోరిక నెరవేరింది. అయితే ఆ అదృష్టం ఎంతోకాలం నిలవలేదు. ఓరోజు వైద్యులను సంప్రదించగా..రక్తపరీక్షల అనంతరం గుండె పగిలే నిజాన్ని వినాల్సి వచ్చింది. చిన్నారి మిథున్‌కి క్యాన్సర్ సోకిందని, వెంటనే వైద్యం అందించకపోతే చనిపోతాడని వైద్యులు నిర్థారించారు. ఆర్థికంగా స్థోమత లేని ఆ దంపతులు నిస్సహుయులుగా ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కెటో (ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్ ) చికిత్స కోసం డబ్బులు లేని ఎంతో మందికి సాయం అందిస్తోంది. ఆ చిన్నారి సమస్య గురించి ఆ తల్లి ఏం చెబుతుందో ఒక్కసారి తెలుసుకుందాం.
నేను శివానంద్‌ను పెళ్లి చేసుకున్నాక అందరి ఆడపిల్లలానే పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఆ బోసినవ్వులు మా ఇంట్లో ఎప్పుడు వస్తాయా అని ఆశగా ఎదురుచూశాను . కానీ దురదృష్టవశాత్తూ నేను అనుకున్నట్లు జరగలేదు. పిల్లల కోసం ఎన్నో దేవుళ్లకి ముడుపు కట్టాను, డాక్టర్లను సైతం సంప్రదించాను. ఈ ప్రయాణం అంత సులువుగా సాగలేదు. ఇక ఏ దేవుడు కరుణించాడో కానీ నా నిరీక్షణకు తెరపడింది. ఎంతకాలం నుంచో ఎదురుచూస్తున్న నా కల నెరవేరింది. నేను తల్లిని కాబోతున్నాను అని తెలిసి ఎంతో మురిసిపోయాను.
ఇక పుట్టబోయే బిడ్డ కోసం డబ్బు కూడా ఆదా చేయడం ప్రారంభించాను. పెళ్లయిన 5ఏళ్లకు తల్లి మాధుర్యం ఎలా ఉంటుందో అనుభవించాను. ఇక జీవితంలో అన్నీ వెలుగులే అనుకున్న సమయంలో ఊహించని ఉపద్రవం వచ్చింది. నా చిన్నారి మిథున్ పుట్టి ఓ ఏడాది గడిచాక అర్థమయ్యింది మా అనందాలకు అడ్డుపడిందని. బాబుకు శరీరం కింది భాగంలో వాపు ఉందని గమనించాను. అదే తగ్గిపోతుందులే అని కొన్ని రోజులు వేచిచూశాను. అయితే అది తగ్గకపోగా మరింత ఎక్కువైంది. నొప్పితో నా బిడ్డ అల్లాడిపోతుంటే ఎంతకైనా మంచిదని డాక్టర్‌ని సంప్రదించాం. అయితే నా బిడ్డకు క్యాన్సర్ సోకిందన్న నిజం తెలిసి గుండె పగిలిపోయింది. వెంటనే బాబుకు చికిత్స చేయాలని లేదంటే ప్రాణానికే ప్రమాదం అని వైద్యులు చెప్పారు.
ఈ ట్రీట్‌మెంట్ మొత్తానికి దాదాపు 7-8లక్షల రూపాయలు అవుతుందని డాక్టర్లు చెప్పారు. లాక్‌డాన్ కారణంగా నా భర్త శివానంద్ ఉద్యోగం పోయింది. ప్రస్తుతం నేనే ఇళ్లలో పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాను. మేం దాచుకున్న డబ్బులన్నీ మిధున్ ట్రీట్‌మెంట్ కోసం వాడేశాము. డబ్బుల కోసం మేం అన్ని విధాల ప్రయత్నించాము. కానీ ఎక్కడ మాకు డబ్బు దొరకలేదు. రియాన్స్‌కు మా పేదరికం కారణంగా ఏమైనా జరిగితే మమల్ని మేం ఎప్పటికీ క్షమించుకోలేము. మీరు దయతో ఇచ్చే మొత్తం మా బాబును కాపాడగలదు’. దయచేసి మా బిడ్డను కాపాడండి. నా మిథున్‌కు ప్రాణ భిక్ష పెట్టండి.
కెటో ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్ ద్వారా ఆర్థికంగా చితికిపోయిన ఎంతో మందికి సహాయం అందిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న హాస్పిటల్‌తో కొలాబరేట్ అయ్యి డబ్బులు లేని వారెందరికో సోషల్ మీడియా ద్వారా ఫండింగ్ చేసి చికిత్స అందజేస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా మీ చేతనైనంతా సాయం కెటో ద్వారా విరాళంగా అందించండి. (అడ్వర్టోరియల్)
Comments
Please login to add a commentAdd a comment