
డబ్బు ఉన్నవారా లేని వారా అన్న తేడా వచ్చే జబ్బులకు తెలియదు. వాటికి కేవలం ప్రాణం తీయడం, ఆర్ధికంగా కుంగదీయడం మాత్రమే తెలుసు. భారతదేశంలో ఎంతో మందికి మూడు పూటల తిండి దొరకడమే కష్టం. అలాంటి వారిపై వ్యాధులు కూడా దండయాత్ర చేస్తే వారికి రక్షణకవచంలా నిలిచేదెవరు? వారు సమాజంలో భాగం కారా? వారిని రక్షించుకోవలసిన అవసరం లేదా? 'కెటో' (ఇండియాస్ క్రౌడ్ ఫండింగ్ సైట్) ఇలా వైద్యం భారమైన ఎంతో మందికి బాసటగా నిలుస్తోంది. అసలు రోగం ఒక కుటుంబాన్ని ఎలా కుంగదీస్తుందో ఇప్పుడు ఒకరి యదార్థ గాధను తెలుసుకుందాం.
యువాని 8 యేళ్ల చిన్న పాప. టాక్సీ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న ఒక పేద తండ్రి గారాల పట్టి . ఎన్నో రోజులు ఎదురుచూడగా పుట్టిన మొదటి సంతానం. తను పుట్టడంతో ఆ ఇంట్లో నవ్వులు పూసాయి. 2007 లో ఎన్నో రోజుల తరువాత మాకు ఒక పాప పుట్టింది. తను పుట్టగానే పట్టరాని సంతోషంతో అందరం పులకరించిపోయాం. హాస్సటల్ నుంచి డిచార్జ్ అయ్యే రోజు ఎర్రటి డ్రస్ వేసి యువానిని అందంగా తయారు చేశాం. ఎందుకంటే తను మొదటిసారి తన ఇంటికి రాబోతుంది. ఇంతలో డాక్టర్ వచ్చి పాపను చెక్ చేశారు. ఏముందిలే మామూలు చెక్ అప్ అనుకున్నాం. కానీ పాపను పరీక్షించిన తరువాత డాక్టర్ హావభావాలు ఒక్కసారిగా మారిపోయాయి. తనని ఇంకా చెక్ చేయాలి అని చెప్పారు. టెస్ట్‌లన్ని చేసిన తరువాత పాపకు గుండెలో రంధ్రం ఉంది అన్న విషయం చెప్పారు. ఒక్కసారిగా మేం కుప్పకూలిపోయాం. అప్పుడు డాక్టర్ అంతగా కంగారు పడాల్సిన పనిలేదు. ఇది సాధారణంగా చాలా మందిలో ఉంటుంది. పాప పెరిగే కొద్ది రంధ్రం పూడ్చుకుంటుంది అని చెప్పారు. మేం కొంచెం ఊపిరి పీల్చుకొని పాపను ఇంటికి తీసుకువచ్చాం.
8 యేళ్ల వరకు అంత బాగానే ఉంది . కానీ ఒక రోజు యువాని శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది, ఛాతిలో నొప్పిగా ఉంది అని ఏడ్చుకుంటూ చెప్పింది. మాకు కంగారు వేసి వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాం. అక్కడ పరీక్షలు చేసిన డాక్టర్ తన గుండె రంధ్రం పూడలేదని చెప్పారు. ఇప్పుడు మందులు వాడిన ప్రయోజనం లేదని ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఉన్న ఆస్తులన్ని అమ్మి తనకు ఆపరేషన్ చేయించాం. రోజు టాక్సీ నడుపుకొని బతికే మాకు పూట గడవడమే కష్టం అలాంటిది ఆపరేషన్ తరవాత తన మందులు, టెస్ట్‌ల ఖర్చులు మాకు భారంగా మారాయి. మొత్తం అంతా ఖర్చు చేసేశాం.
ఇప్పుడు మళ్లీ తను తనకు ఛాతిలో నొప్పి వస్తుందని, శ్వాస కష్టంగా ఉందని అంటుంది. డాక్టర్‌కు చూపించాం. ఆపరేషన్ పనిచేయలేదని, ఇప్పుడు గుండె మార్పిడి చేస్తేనే తను బతుకుతుంది అంటున్నారు. దానికి 30 లక్షల ఖర్చు అవుతుంది. నేను ఆ విషయం విని తట్టుకోలేకపోయాను. నేను ఏడుస్తుంటే యువాని నా దగ్గరకు వచ్చి ‘అమ్మ నా వల్లే ఏడుస్తున్నావు కదూ నేను మీకు భారంగా తయారయ్యాను కదా’అని అడిగింది.ఆ మాటలు విన్న తరువాత నేను ఒక అమ్మగా ఫెయిల్ అయ్యాను అనిపించింది. నా కూతురు ప్రాణాలు మీరు చేసే డొనేషన్ మీదే ఆధారపడి ఉన్నాయి. నా కూతురును కాపాడండి. తనకు ప్రాణ భిక్ష పెట్టండి.
'కెటో' ఇలా వైద్యం భారమైన ఎంతో మందికి బాసటగా నిలుస్తోంది. మీరు ఇచ్చే చిన్న మొత్తాలు యువని లాంటి ఎంతో మంది ప్రాణాలను కాపాడగలవు. కొద్ది మొత్తంలో సాయం చేయండి. ఎంతో మందిని కాపాడండి. (అడ్వర్టోరియల్)
Ketto is a largest crowdfunding website that supports crowdfunding for cancer, heart and many other treatments.