ముంబయి: కండలవీరుడు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 11లోకి అనుకోని అతిథులు రానున్నారు. గతంలో షో నుంచి ఎలిమినేట్ అయిన ప్రియాంక్ శర్మతో పాటు యూట్యూబ్ స్టార్ డింఛక్ పూజ పూజ వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ‘బాపు దేదే థోడా క్యాష్’, ‘సెల్ఫీ మైనే లే లీ ఆజ్’, ‘స్వాగ్ వాలి టోపీ’ పాటలతో యూట్యూబ్‌లో మంచి ప్రేక్షకాదరణ పొందిన డింఛక్ పూజకు బిగ్‌బాస్ హౌజ్ నుంచి పిలుపు రావడంతో ఆమె వెంటనే దీనికి ఒప్పుకున్నట్లు సమాచారం. వీరిద్దరు శుక్రవారం హౌజ్‌లోకి రానున్నారు.
దీపావళి పండుగ సందర్భంగా ప్రసారమయ్యే శనివారం ఎపిసోడ్‌లో వీరు కనిపించనున్నట్లు తెలుస్తోంది. తన వింత చేష్టలు, విచిత్రమైన పాటలతో ఇప్పటికే లక్షల్లో ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న డింఛక్ పూజ ఇక బుల్లితెరపై సందడి చేయనున్నారు. ఆమెతో పాటు గతంలో ఈ షో నుంచి ఎలిమినేట్ అయిన ప్రియాంక్ శర్మ కూడా రీ ఎంట్రీ ఇస్తుండటంతో.. షో మరింత రసవత్తరంగా మారనుంది.
Comments
Please login to add a commentAdd a comment