బిగ్‌బాస్-11లో అడుగుపెట్టిన మూడురోజులకే.. ఈ షోలో ఇమడలేని స్థితిలోకి దించక్ పూజ వచ్చినట్టు కనిపిస్తోంది. ఆమె ప్రస్తుతం హౌజ్‌లో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నది. ఆమె తలలో పేలు ఉన్నాయంటూ సభ్యులు సోమవారం రచ్చరచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఆమె తలలో పేలు అంశంపై తీవ్రంగా చర్చించిన హౌజ్‌లోని తోటి సభ్యులు ఏకంగా బిగ్‌బాస్‌ను అడిగి.. ఇందుకోసం మందులు తెప్పించారు.
మంగళవారం గార్డెన్‌లో క్యాంపు చేయాలంటూ టాస్క్ ఇచ్చారు. అయితే, పూజ ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమెను ఇంట్లోకి వెళ్లాల్సిందిగా వేరే టీమ్ సభ్యులు సూచించారు. అయితే, సొంత టీమ్ సభ్యులు మాత్రం ఆమెను అర్థం చేసుకోలేకపోయారు. తనకు బాగాలేదని హౌజ్‌లోకి వెళ్లిన పూజ.. అప్పటికే హౌజ్‌లో ఉన్న శిల్పా షిండేతో తన బాధను చెప్పుకొంది. తనకు ఆరోగ్యం బాగాలేదని నిజం చెప్తున్నా ఎవరూ తనను నమ్మడం లేదని, కావాలనే చేస్తున్నానని తనను అనుమానించేలా తోటి సభ్యులు ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ.. శిల్పా ముందు పూజ ఏడ్చేసింది.
బిగ్‌బాస్ హౌజ్‌లో ఇవన్నీ సహజమేనని, ఇవన్నీ పట్టించుకోకుండా ముందుకుసాగాలంటూ పూజను శిల్పా ఓదార్చే ప్రయత్నంచేసింది. ఇప్పటికే బిగ్‌బాస్ సభ్యుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అడుగుపెట్టిన దించక్ పూజ హౌజ్‌లో ఇమడలేకపోతున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. తనకు శిల్పా ధైర్యం చెప్పడం మెచ్చుకోదగిన విషయమని అంటున్నారు. కర్ణకటోరమైన గొంతుతో, క్యాచీ పదాలతో పాప్ సాంగ్స్ ఆలపించి.. యూట్యూబ్ సెన్సేషనల్‌గా దించక్ పూజ పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. యూట్యూబ్‌లో వచ్చిన పాపులారిటీ వల్లే ఆమెకు బిగ్‌బాస్‌లో చాన్స్ వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment