
బిగ్‌బాస్‌లోకి దించక్ పూజ!
తెలుగులో బిగ్‌బాస్ రియాలిటీ షో అలరిస్తుండగా.. హిందీలో బిగ్‌బాస్ సీజన్ 11కు రంగం సిద్ధమవుతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మరోసారి ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించబోతున్నాడు. తెలుగులో బిగ్‌బాస్ షో హుందాగానే సాగుతోంది. కానీ, హిందీలో మాత్రం ఈ షో అనేక డర్టీ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. ఈసారి కూడా అదేవిధంగా కావాల్సినంత వినోదం అందించేలా బిగ్‌బాస్ సభ్యుల ఎంపిక జరుగుతున్నట్టు తెలుస్తోంది.
హిందీ బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ గురించి ప్రస్తుతం మీడియాలో పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. యంగ్ యాక్టర్స్‌కు ఈసారి పెద్దపీట వేశారు. అంతేకాదు, సోషల్ మీడియాలో దించక్ పూజను కూడా ఈసారి బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నదట. 'సెల్ఫీ మైనే లేలి ఆజ్' అంటూ ఫన్నీ పాటలతో దించక్ పూజ యూట్యూబ్‌లో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. ఇక, బుల్లితెరపై రాణిస్తున్న నియా శర్మ, నీతీ టేలర్, పరల్ వీ పూరి, సినీ నటుడు నికితిన్ ధీర్, భోజ్‌పూరి నటి రాణి చటర్జీ కూడా బిగ్‌బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టే అవకాశముంది. అదేవిధంగా టీవీ నటి ప్రత్యూష బెనర్జీ మృతి కేసులో నిందితుడిగా ఉన్న రాహుల్ రాజ్ సింగ్‌ను కూడా బిగ్‌బాస్ షో కోసం నిర్వాహకులు అడిగినట్టు తెలుస్తోంది.