Dhinchak Pooja
-
కరోనాను టార్గెట్ చేసిన డించక్ పూజా
-
ఓ కరోనా.. ఇది నీకు వినిపిస్తోందా?
యూట్యూబ్ సెన్సేషన్ డించక్ పూజా గుర్తుందా? అంత ఈజీగా మరిచిపోయే గొంతా? ఆమె తన గళం విప్పి దానికి పాదాలు కదిపి డ్యాన్స్ చేసిందంటే ప్రపంచమే గడగడలాడిపోతుంది. కర్ణకఠోరమైన గొంతుతో, భయంకరమైన డ్యాన్స్‌తో యూట్యూబ్‌లో పాపులర్ అయింది. తాజాగా ఆమె దృష్టి అందరి గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్న కరోనా వైరస్‌పై పడింది. ఇంకేముందీ.. దానిపై ఓ పాట కట్టి.. కొంతమందికి డాక్టర్ల గెటప్ వేయించి డ్యాన్స్ చేసింది(ప్రయత్నించిందంటే బాగుంటుందేమో). ఈ వీడియోలో ముందుగా వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించింది. చేతులు శుభ్రం చేసుకోవడం, ఎవరినీ తాకకపోవడం, సామాజిక ఎడం పాటించడం, అనారోగ్యంగా ఉన్నట్లయితే ఇంట్లోనే ఉండటం వంటి నాలుగు సూత్రాలు పాటించి దాని వ్యాప్తిని నివారించవచ్చని సూచించింది. (ఆమె డ్యాన్స్ చూస్తే నిజంగానే పిచ్చెక్కుతుంది) ‘చేయండి చేయండి.. మీ పని మీరు చేయండి.. ప్రార్థనలు చేయండి.. ఎవరికీ ఏమీ కాకుండా చూసుకోండి’ అంటూ క్యాచీ లైన్లతో పాట కట్టింది. ఎందుకైనా మంచిది.. సంగీత ప్రియులు కాస్త గుండె ధైర్యం తెచ్చుకుని ‘హోగా నా కరోనా’ సాంగ్‌ను పూర్తయ్యేవరకు చూడండి. యూట్యూబ్‌లో వైరల్‌గా మారిన ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘ఓ కరోనా.. ఒక్కసారి ఈ పాట వినవమ్మా.. విన్నావంటే నువ్వు చావడం ఖాయమమ్మా’ అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ‘నీ వీడియోలు చూసే మాకు ఏడుపొక్కటే తక్కువ’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. కాస్త వెరైటీ, మరికాస్త వినోదం కావాలనుకుంటే ఈ కరోనా పాటపై మీరూ ఓ లుక్కేయండి. ఆల్ ద బెస్ట్. (రాజమౌళి దర్శకత్వంలో రానా?) -
ఆమె డ్యాన్స్ చూస్తే.. నిజంగానే పిచ్చెక్కుతుంది!!
యూట్యూబ్ సెన్సేషన్ డించక్ పూజా మరో వీడియో సాంగ్‌ను నెటిజన్ల మీద వదిలారు. ఈసారి ‘పాగల్ హోకే నాచో ఔర్ నాచ్ కే పాగల్ హో జావో’ (పిచ్చివాళ్లలా డ్యాన్స్ చేయండి.. డ్యాన్స్ చేస్తూ పిచ్చోళ్లు అవ్వండి)అంటూ ఆమె లేటెస్ట్ ట్రాక్‌ను రిలీజ్ చేశారు. డించక్ పూజకు సోషల్ మీడియాలో అద్భుతమైన పాపులారిటీ ఉంది. దీంతో ఈ వీడియో పోస్టు చేసిన కొద్దిరోజుల్లోనే నాలుగు మిలియన్స్‌కుపైగా వ్యూస్ వచ్చాయి. డించక్ పూజా ఊహించినట్టే ఈ పాట సూపర్‌హిట్ అయింది. అయితే, ఈ పాటను చూసిన నెటిజన్లే ఆగమాగం అవుతున్నారు. తనదైన కర్ణకటోరమైన గొంతుతో క్యాచీ పదాలతో ఒక శ్రుతి, లయ లేకుండా ఈ పాటను పాడింది పూజ. పాటకు తగ్గుట్టుగా చిత్రవిచిత్రమైన స్టెప్పులు కూడా వేసింది. అంతే ఈ వీడియోసాంగ్‌ను చూసిన నెటిజన్లు.. దీనిని టెర్రరిస్ట్ చర్యగా రిపోర్ట్ చేయడానికి అవకాశమివ్వాలంటూ యూట్యూబ్‌ను కోరుతూ ట్విటర్లో కామెంట్లు పెడుతున్నారు. ‘నేను అంతర్ముఖుడిని. నాకు ఎవరూ కాల్స్ చేయడం నచ్చదు. అందుకే డించక్ పూజ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘నాచ్ కే పాగల్ హో జావో’ కాలర్ ట్యూన్‌గా పెట్టాను’ అని ఓ నెటిజన్ చమత్కరించారు. మరో కొత్త ఆయుధంతో డించక్ పూజ నెటిజన్లపై విరుచుకుపడ్డారని కామెంట్చేస్తున్నారు. మీరూ ఓసారి డించక్ పూజ లేటెస్ట్ సెన్సేషన్‌ను వీక్షించండి. Reportd this act of terrorism by dhinkchak Pooja #Dhinchakpooja pic.twitter.com/BZZSTPJFAb — kapil dahamiwal (@kkcool24399) July 28, 2019 As an introvert, I don't like to receive calls so I changed my caller tune to #Dhinchakpooja latest blockbuster "Nach ke pagal ho jaun" pic.twitter.com/UF7AUidViP — Achhaya Pathak (@frozen_parantha) July 29, 2019 Everyone To Dhinchak Pooja:-#Dhinchakpooja pic.twitter.com/nqtNB7MRli — Alok Tiwari (@AlokTiw46859375) July 28, 2019 #Dhinchakpooja Cameraman's reaction during the shooting of song pic.twitter.com/idojwt5uC1 — Yashwant Choudhary (@yash_or_no) July 28, 2019 So #Dhinchakpooja is back with her new weapon.😁😁 pic.twitter.com/XwWJDDjuib — Nirmohi (@nam_to_suna_h_n) July 28, 2019 -
దించక్ పూజకు 'బిగ్' షాక్!
యూట్యూబ్ స్టార్ దించక్ పూజకు ఊహించని షాక్ తగిలింది. రియాలిటీ షో బిగ్‌బాస్ నుంచి ఆమెను పంపించివేస్తున్నట్టు హోస్ట్ సల్మాన్ ఖాన్ ఆదివారం ప్రకటించారు. హిందీలో ప్రసారం అవుతున్న బిగ్‌బాస్-11 సీజన్‌ను క్రమం తప్పకుండా చూస్తున్న వీక్షకులకు ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. తన క్యాచీ పాటలతో, వీడియో సాంగ్స్‌తో యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో విశేషమైన ఆదరణను సొంతం చేసుకున్న దించక్ పూజ కొన్నివారాల కిందటే బిగ్‌బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టింది. గతవారం ఆమెతోపాటు హితేన్ తేజ్వానీ, ప్రియాంకశర్మ, సప్న చౌదరి, శిల్పా షిండే, హినా ఖాన్, బెనాఫ్షా సూన్వాలా, సబ్యసాచి సాత్పతీ, బందగీ కర్లా ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు. అయితే, ఎవరూ కూడా దించక్ పూజ అలియాస్ పూజా జైన్‌ను బిగ్‌బాస్ హౌజ్ నుంచి సాగనంపుతారని భావించలేదు. బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత మీడియాతో మాట్లాడిన దించక్ పూజ.. తనను తొలగించడంపై షాక్ వ్యక్తం చేసింది. 'ఇది నిజంగా నన్ను షాక్‌కు గురిచేసింది. నేను కానీ, ఇతరులు కానీ ఇలా అవుతుందని అనుకోలేదు. హౌజ్‌లో మరికొంతకాలం ఉండి ఉంటే బాగుండేది కానీ. బయట ఉండటం కూడా నాకు ఇష్టమే. ఇంకొన్నాళ్లు నేను బిగ్‌బాస్ హౌజ్‌లో ఉండి ఉంటే.. అందులోని వారితో వేగలేకపోయేదానినేమో' అని ఆమె పేర్కొంది. కర్ణకటోరమైన గొంతుతో, క్యాచీ పదాలతో పాప్ సాంగ్స్ ఆలపించి.. యూట్యూబ్ సెన్సేషనల్‌గా దించక్ పూజ పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. యూట్యూబ్‌లో వచ్చిన పాపులారిటీ వల్లే ఆమెకు బిగ్‌బాస్‌లో చాన్స్ వచ్చింది. -
ఆమెకు లవ్ ప్రపోజల్ వచ్చింది!
ఆసక్తిగా సాగుతున్న బిగ్‌బాస్-11 రియాలిటీ షోలో బుధవారం ఓ ప్రేమకథ దృశ్యం ఆవిష్కృతమైంది. అయితే, అది నిజమైన ప్రేమేనా? లేక గిమ్మిక్కా? అన్నది తెలియక ప్రేక్షకులు తికమకపడుతున్నారు. బిగ్‌బాస్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా మారిన దించక్ పూజ- ఆకాశ్ అనిల్ దద్లానీ మధ్య ప్రేమ చిగిరిస్తున్నట్టు కనిపిస్తోంది. బుధవారం టాస్క్ పూర్తిచేసిన అనంతరం పూజ విశ్రాంతి తీసుకుంటుండగా.. ఆకాశ్ సడెన్‌గా ఆమె వద్దకు వచ్చాడు. అప్పటికే ఆమె పట్ల అతి చనువుగా వ్యవహరిస్తూ ఇబ్బంది పెట్టిన ఆకాశ్.. ఏకంగా ఓ దిండును పూజ ఒడిలో పెట్టి..దానిపై తల ఉంచి విశ్రాంతి తీసుకున్నాడు. వారు మాట్లాడుకుంటుండగా.. లోపలికి వచ్చిన అర్షి ఖాన్ ఏం జరుగుతోందని అడిగింది. ఆకాశ్ ఆమెను ఇష్టపడుతున్నట్టు తనే నిర్ధారణకు వచ్చింది. దించక్ స్పందిస్తూ.. తాము స్నేహితులు మాత్రమేనని చెప్పింది. అర్షీ ఆ మాటను నమ్మలేదు. దీంతో దిగొచ్చిన ఆకాశ్ తాను పూజను ప్రేమిస్తున్నట్టు ఒప్పుకున్నాడు. 'ఐ లవ్యూ' అంటూ పూజకు చెప్పేశాడు. పూజ బుగ్గలు ఎర్రబడి.. సిగ్గుతో ముఖాన్ని దాచుకుంది. అయితే, ఇలాంటివి తన తండ్రి ఇష్టపడడని, తన ఇంట్లో సమస్య వస్తుందంటూ అతన్ని తన ఒడిలోంచి తోసేసింది. మరోవైపు కుల్జా సిమ్‌సిమ్ టాస్క్ సందర్భంగా హౌజ్ సభ్యులు ఒకరినొకరు బండ బూతులు తిట్టుకున్నారు. ఈ సందర్భంగా హినా ఖాన్‌పై శిల్పా షీండే, ఆకాశ్ దద్లానీ తిట్లవర్షం కురిపించడంతో.. ఆమె కన్నీరుమున్నీరుగా ఏడ్చింది. -
కన్నీరుమున్నీరుగా ఏడ్చింది..!
బిగ్‌బాస్-11లో అడుగుపెట్టిన మూడురోజులకే.. ఈ షోలో ఇమడలేని స్థితిలోకి దించక్ పూజ వచ్చినట్టు కనిపిస్తోంది. ఆమె ప్రస్తుతం హౌజ్‌లో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నది. ఆమె తలలో పేలు ఉన్నాయంటూ సభ్యులు సోమవారం రచ్చరచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఆమె తలలో పేలు అంశంపై తీవ్రంగా చర్చించిన హౌజ్‌లోని తోటి సభ్యులు ఏకంగా బిగ్‌బాస్‌ను అడిగి.. ఇందుకోసం మందులు తెప్పించారు. మంగళవారం గార్డెన్లో క్యాంపు చేయాలంటూ టాస్క్ ఇచ్చారు. అయితే, పూజ ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమెను ఇంట్లోకి వెళ్లాల్సిందిగా వేరే టీమ్ సభ్యులు సూచించారు. అయితే, సొంత టీమ్ సభ్యులు మాత్రం ఆమెను అర్థం చేసుకోలేకపోయారు. తనకు బాగాలేదని హౌజ్‌లోకి వెళ్లిన పూజ.. అప్పటికే హౌజ్‌లో ఉన్న శిల్పా షిండేతో తన బాధను చెప్పుకొంది. తనకు ఆరోగ్యం బాగాలేదని నిజం చెప్తున్నా ఎవరూ తనను నమ్మడం లేదని, కావాలనే చేస్తున్నానని తనను అనుమానించేలా తోటి సభ్యులు ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ.. శిల్పా ముందు పూజ ఏడ్చేసింది. బిగ్‌బాస్ హౌజ్‌లో ఇవన్నీ సహజమేనని, ఇవన్నీ పట్టించుకోకుండా ముందుకుసాగాలంటూ పూజను శిల్పా ఓదార్చే ప్రయత్నంచేసింది. ఇప్పటికే బిగ్‌బాస్ సభ్యుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అడుగుపెట్టిన దించక్ పూజ హౌజ్‌లో ఇమడలేకపోతున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. తనకు శిల్పా ధైర్యం చెప్పడం మెచ్చుకోదగిన విషయమని అంటున్నారు. కర్ణకటోరమైన గొంతుతో, క్యాచీ పదాలతో పాప్ సాంగ్స్ ఆలపించి.. యూట్యూబ్ సెన్సేషనల్‌గా దించక్ పూజ పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. యూట్యూబ్‌లో వచ్చిన పాపులారిటీ వల్లే ఆమెకు బిగ్‌బాస్‌లో చాన్స్ వచ్చింది. -
ఆమె నెత్తిలో పేలు ఉన్నాయి..!
బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్-11 హిందీలో ఆసక్తిగా సాగుతోంది. ఆదివారం జరిగిన వీకెండ్ కా వార్ ఎపిసోడ్ అనంతరం సోమవారం బిగ్‌బాస్ షోలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. యూట్యూబ్ స్టార్ దించక్ పూజ వెంట్రుకల చుట్టూ సోమవారం షో సాగింది. ఆమె తలలో పేలు ఉన్నాయనే విషయాన్ని గుర్తించడంతో ఇది హౌజ్‌లో హాట్టాపిగ్గా మారింది. తోటి కంటెస్టెంట్ జ్యోతి మొదట ఈ విషయాన్ని కనిపెట్టింది. దీని గురించి సభ్యులు తీవ్రంగా వాదించారు. కర్ణకటోరమైన గొంతుతో వింతవింత పాప్ సాంగ్స్ ఆలపించి.. యూట్యూబ్‌లో పాపులర్ అయిన దించక్ పూజ ఇటీవల బిగ్‌బాస్ హౌజ్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె నెత్తిలో పేలు ఉండటంతో ఆమెతో కలిసి హౌజ్‌లో ఉండటం కష్టమని పలువురు సభ్యులు అభిప్రాయపడ్డారు. దీని గురించి చర్చోపచర్చల అనంతరం దించక్ పూజ నెత్తిలో పేలు తొలగించేందుకు మెడిసిన్ ఇవ్వాలని హితెన్ బిగ్‌బాస్ కోరారు. చివరకు బిగ్‌బాస్ ఈ మేరకు ఔషధాలు సమకూర్చడంతో ఈ వ్యవహారం సద్దుమణిగినట్టు కనిపిస్తోంది. ఇక వచ్చేవారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. బందగీ, శిల్పా, అర్షి, వికాస్, మహెజబీన్, పునీష్ ఇందుకు నామినేట్ అయ్యారు. -
బిగ్‌బాస్ హౌజ్‌లోకి యూట్యూబ్ స్టార్
ముంబయి: కండలవీరుడు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 11లోకి అనుకోని అతిథులు రానున్నారు. గతంలో షో నుంచి ఎలిమినేట్ అయిన ప్రియాంక్ శర్మతో పాటు యూట్యూబ్ స్టార్ డింఛక్ పూజ పూజ వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ‘బాపు దేదే థోడా క్యాష్’, ‘సెల్ఫీ మైనే లే లీ ఆజ్’, ‘స్వాగ్ వాలి టోపీ’ పాటలతో యూట్యూబ్‌లో మంచి ప్రేక్షకాదరణ పొందిన డింఛక్ పూజకు బిగ్‌బాస్ హౌజ్ నుంచి పిలుపు రావడంతో ఆమె వెంటనే దీనికి ఒప్పుకున్నట్లు సమాచారం. వీరిద్దరు శుక్రవారం హౌజ్‌లోకి రానున్నారు. దీపావళి పండుగ సందర్భంగా ప్రసారమయ్యే శనివారం ఎపిసోడ్లో వీరు కనిపించనున్నట్లు తెలుస్తోంది. తన వింత చేష్టలు, విచిత్రమైన పాటలతో ఇప్పటికే లక్షల్లో ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న డింఛక్ పూజ ఇక బుల్లితెరపై సందడి చేయనున్నారు. ఆమెతో పాటు గతంలో ఈ షో నుంచి ఎలిమినేట్ అయిన ప్రియాంక్ శర్మ కూడా రీ ఎంట్రీ ఇస్తుండటంతో.. షో మరింత రసవత్తరంగా మారనుంది. -
డింఛక్ పూజ వైరల్ వీడియో
యూట్యూబ్‌లో పాపులరైన డింఛక్ పూజ మరో కొత్త వీడియోతో హల్చల్ చేస్తోంది. 'బాపూ దేదే తోడా క్యాష్' పేరుతో విడుదలైన ఆమె మ్యూజిక్ వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. బుధవారం (సెప్టెంబర్ 20న) అప్లోడ్ అయిన ఈ వీడియోను ఇప్పటివరకు 5 లక్షలమందికి పైగా వీక్షించారు. అయితే ఈ పాటను ఇంతకుముందే పూజ విడుదల చేసింది... కాకపోతే అది కేవలం ఆడియో మాత్రమే. ఇప్పుడు పాటకు తగ్గట్టుగా యాక్టింగ్ చేస్తూ వీడియోను రూపొందించి పూజ విడుదల చేసింది. గతంలో స్వాగ్ వాలీ టోపీ, దారు, సెల్ఫీ మైనే లేలీ ఆజ్, దిల్లోంక షూటర్ వంటి పాటలతో యూట్యూబ్ సెన్సేషన్‌గా డింఛక్ పూజ మారింది. కర్ణకఠోరంగా పాటలు పాడటంలో పేరు సంపాదించుకున్న పూజకి ఎంతమంది విమర్శకులు ఉన్నారో.. అంతకంటే ఎక్కువ మంది అభిమానులు కూడా ఉన్నారు. 'బిగ్‌బాస్ 11' హిందీ రియాలిటీ షోలోనూ డింఛక్ పూజ పాల్గొనబోతుందనే వార్తలు కూడా వచ్చాయి. -
డింఛక్ పూజ వైరల్ వీడియో
-
బిగ్‌బాస్‌లోకి దించక్ పూజ!
తెలుగులో బిగ్‌బాస్ రియాలిటీ షో అలరిస్తుండగా.. హిందీలో బిగ్‌బాస్ సీజన్ 11కు రంగం సిద్ధమవుతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మరోసారి ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించబోతున్నాడు. తెలుగులో బిగ్‌బాస్ షో హుందాగానే సాగుతోంది. కానీ, హిందీలో మాత్రం ఈ షో అనేక డర్టీ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. ఈసారి కూడా అదేవిధంగా కావాల్సినంత వినోదం అందించేలా బిగ్‌బాస్ సభ్యుల ఎంపిక జరుగుతున్నట్టు తెలుస్తోంది. హిందీ బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ గురించి ప్రస్తుతం మీడియాలో పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. యంగ్ యాక్టర్స్‌కు ఈసారి పెద్దపీట వేశారు. అంతేకాదు, సోషల్ మీడియాలో దించక్ పూజను కూడా ఈసారి బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నదట. 'సెల్ఫీ మైనే లేలి ఆజ్' అంటూ ఫన్నీ పాటలతో దించక్ పూజ యూట్యూబ్‌లో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. ఇక, బుల్లితెరపై రాణిస్తున్న నియా శర్మ, నీతీ టేలర్, పరల్ వీ పూరి, సినీ నటుడు నికితిన్ ధీర్, భోజ్‌పూరి నటి రాణి చటర్జీ కూడా బిగ్‌బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టే అవకాశముంది. అదేవిధంగా టీవీ నటి ప్రత్యూష బెనర్జీ మృతి కేసులో నిందితుడిగా ఉన్న రాహుల్ రాజ్ సింగ్‌ను కూడా బిగ్‌బాస్ షో కోసం నిర్వాహకులు అడిగినట్టు తెలుస్తోంది. -
దించక్ పూజకు ఝలక్!
పాటలో స్కూటర్ నడుపుతూ.. హెల్మెట్ పెట్టుకోనందుకు పోలీసుల యాక్షన్ న్యూఢిల్లీ: దించక్ పూజ.. సోషల్ మీడియాలో ‘మ్యూజిక్ సెన్సేషన్’గా చెప్పుకొనే ఈమెకు చాలామంది అభిమానులే ఉన్నారు. ‘సెల్ఫీ మైనే లేలీ ఆజ్’ అంటూ ఈ అమ్మాయి పెట్టిన వీడియో పాటను ఏకంగా కోటిన్నరమందికిపైగా చూశారు. ఇలా ఒకటి రెండు పాటలతో ఫేమస్ అయిన ఈ అమ్మాయి తాజాగా ‘దిలోంక షూటర్ హై మేరే స్కూటర్.. దిలోంక షూటర్’ అంటూ మరో వీడియోపాటను తన యూట్యూబ్ పేజీలో పోస్టు చేసింది. మూడు అంటే మూడు లైన్లు మాత్రమే ఉన్న ఈ పాటను.. అటు తిప్పి.. ఇటు తిప్పి మూడు నిమిషాలసేపు ఆమె పాడింది. ఆమె తాజా పాటపై పలువురు నెటిజన్లు విమర్శలు, సెటైర్లు గుప్పిస్తుండగా.. ఈ పాట ఆమెను చిక్కుల్లో పడేసే అవకాశం కనిపిస్తోంది. తన స్కూటర్.. ‘దిలోంక షూటర్’ ఆమె స్కూటర్ మీద తిరుగుతూ ఈ వీడియోలో కనిపించింది. అయితే, ఈ పాటలో ఆమె హెల్మెట్ పెట్టుకోకుండా స్కూటర్ నడుపడం, రోడ్డుమీద గట్టిగా అరుస్తూ పాట పాడటంపై ఓ నెటిజన్ ఢిల్లీ పోలీసులకు ట్విట్టర్లో ఫిర్యాదు చేశాడు. ఢిల్లీ పోలీసులు కూడా వెంటనే స్పందించి.. దించక్ పూజపై చర్య తీసుకుంటామని తెలిపారు. అయితే, హెల్మెట్ పెట్టుకోనందుకు, రోడ్డుమీద గట్టిగా పాటలు పాడినందుకు ఆమెపై పోలీసులు ఏ చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.