బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్-11 హిందీలో ఆసక్తిగా సాగుతోంది. ఆదివారం జరిగిన వీకెండ్ కా వార్ ఎపిసోడ్ అనంతరం సోమవారం బిగ్‌బాస్ షోలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. యూట్యూబ్ స్టార్ దించక్ పూజ వెంట్రుకల చుట్టూ సోమవారం షో సాగింది. ఆమె తలలో పేలు ఉన్నాయనే విషయాన్ని గుర్తించడంతో ఇది హౌజ్‌లో హాట్‌టాపిగ్గా మారింది. తోటి కంటెస్టెంట్ జ్యోతి మొదట ఈ విషయాన్ని కనిపెట్టింది. దీని గురించి సభ్యులు తీవ్రంగా వాదించారు.
కర్ణకటోరమైన గొంతుతో వింతవింత పాప్ సాంగ్స్ ఆలపించి.. యూట్యూబ్‌లో పాపులర్ అయిన దించక్ పూజ ఇటీవల బిగ్‌బాస్ హౌజ్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె నెత్తిలో పేలు ఉండటంతో ఆమెతో కలిసి హౌజ్‌లో ఉండటం కష్టమని పలువురు సభ్యులు అభిప్రాయపడ్డారు. దీని గురించి చర్చోపచర్చల అనంతరం దించక్ పూజ నెత్తిలో పేలు తొలగించేందుకు మెడిసిన్ ఇవ్వాలని హితెన్ బిగ్‌బాస్ కోరారు. చివరకు బిగ్‌బాస్ ఈ మేరకు ఔషధాలు సమకూర్చడంతో ఈ వ్యవహారం సద్దుమణిగినట్టు కనిపిస్తోంది. ఇక వచ్చేవారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. బందగీ, శిల్పా, అర్షి, వికాస్, మహెజబీన్, పునీష్ ఇందుకు నామినేట్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment