ఆమెకు లవ్‌ ప్రపోజల్‌ వచ్చింది! | Akash says I love you to Dhinchak Pooja | Sakshi
Sakshi News home page

దించక్‌ పూజకు 'ఐ లవ్యూ' చెప్పాడు!

Published Thu, Oct 26 2017 12:00 PM | Last Updated on Thu, Oct 26 2017 12:26 PM

Akash says I love you to Dhinchak Pooja

ఆసక్తిగా సాగుతున్న బిగ్‌బాస్‌-11 రియాలిటీ షోలో బుధవారం ఓ ప్రేమకథ దృశ్యం ఆవిష్కృతమైంది. అయితే, అది నిజమైన ప్రేమేనా? లేక గిమ్మిక్కా? అన్నది తెలియక ప్రేక్షకులు తికమకపడుతున్నారు. బిగ్‌బాస్‌లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా మారిన దించక్‌ పూజ- ఆకాశ్‌ అనిల్‌ దద్లానీ మధ్య ప్రేమ చిగిరిస్తున్నట్టు కనిపిస్తోంది.

బుధవారం టాస్క్‌ పూర్తిచేసిన అనంతరం పూజ విశ్రాంతి తీసుకుంటుండగా.. ఆకాశ్‌ సడెన్‌గా ఆమె వద్దకు వచ్చాడు. అప్పటికే ఆమె పట్ల అతి చనువుగా వ్యవహరిస్తూ ఇబ్బంది పెట్టిన ఆకాశ్‌.. ఏకంగా ఓ దిండును పూజ ఒడిలో పెట్టి..దానిపై తల ఉంచి విశ్రాంతి తీసుకున్నాడు. వారు మాట్లాడుకుంటుండగా.. లోపలికి వచ్చిన అర్షి ఖాన్‌ ఏం జరుగుతోందని అడిగింది. ఆకాశ్‌ ఆమెను ఇష్టపడుతున్నట్టు తనే నిర్ధారణకు వచ్చింది. దించక్ స్పందిస్తూ.. తాము స్నేహితులు మాత్రమేనని చెప్పింది. అర్షీ ఆ మాటను నమ్మలేదు. దీంతో దిగొచ్చిన ఆకాశ్‌ తాను పూజను ప్రేమిస్తున్నట్టు ఒప్పుకున్నాడు. 'ఐ లవ్యూ' అంటూ పూజకు చెప్పేశాడు. పూజ బుగ్గలు ఎర్రబడి.. సిగ్గుతో ముఖాన్ని దాచుకుంది. అయితే, ఇలాంటివి తన తండ్రి ఇష్టపడడని, తన ఇంట్లో సమస్య వస్తుందంటూ అతన్ని తన ఒడిలోంచి తోసేసింది. మరోవైపు కుల్జా సిమ్‌సిమ్‌ టాస్క్‌ సందర్భంగా హౌజ్‌ సభ్యులు ఒకరినొకరు బండ బూతులు తిట్టుకున్నారు. ఈ సందర్భంగా హినా ఖాన్‌పై శిల్పా షీండే, ఆకాశ్‌ దద్లానీ తిట్లవర్షం కురిపించడంతో.. ఆమె కన్నీరుమున్నీరుగా ఏడ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement