యూట్యూబ్ స్టార్ దించక్ పూజకు ఊహించని షాక్ తగిలింది. రియాలిటీ షో బిగ్‌బాస్ నుంచి ఆమెను పంపించివేస్తున్నట్టు హోస్ట్ సల్మాన్ ఖాన్ ఆదివారం ప్రకటించారు. హిందీలో ప్రసారం అవుతున్న బిగ్‌బాస్-11 సీజన్‌ను క్రమం తప్పకుండా చూస్తున్న వీక్షకులకు ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. తన క్యాచీ పాటలతో, వీడియో సాంగ్స్‌తో యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో విశేషమైన ఆదరణను సొంతం చేసుకున్న దించక్ పూజ కొన్నివారాల కిందటే బిగ్‌బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టింది.
గతవారం ఆమెతోపాటు హితేన్ తేజ్‌వానీ, ప్రియాంకశర్మ, సప్న చౌదరి, శిల్పా షిండే, హినా ఖాన్, బెనాఫ్‌షా సూన్‌వాలా, సబ్యసాచి సాత్‌పతీ, బందగీ కర్లా ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు. అయితే, ఎవరూ కూడా దించక్ పూజ అలియాస్ పూజా జైన్‌ను బిగ్‌బాస్ హౌజ్ నుంచి సాగనంపుతారని భావించలేదు. బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత మీడియాతో మాట్లాడిన దించక్ పూజ.. తనను తొలగించడంపై షాక్ వ్యక్తం చేసింది. 'ఇది నిజంగా నన్ను షాక్‌కు గురిచేసింది. నేను కానీ, ఇతరులు కానీ ఇలా అవుతుందని అనుకోలేదు. హౌజ్‌లో మరికొంతకాలం ఉండి ఉంటే బాగుండేది కానీ. బయట ఉండటం కూడా నాకు ఇష్టమే. ఇంకొన్నాళ్లు నేను బిగ్‌బాస్ హౌజ్‌లో ఉండి ఉంటే.. అందులోని వారితో వేగలేకపోయేదానినేమో' అని ఆమె పేర్కొంది. కర్ణకటోరమైన గొంతుతో, క్యాచీ పదాలతో పాప్ సాంగ్స్ ఆలపించి.. యూట్యూబ్ సెన్సేషనల్‌గా దించక్ పూజ పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. యూట్యూబ్‌లో వచ్చిన పాపులారిటీ వల్లే ఆమెకు బిగ్‌బాస్‌లో చాన్స్ వచ్చింది.
Published Mon, Nov 6 2017 2:02 PM | Last Updated on Mon, Nov 6 2017 2:05 PM
Advertisement
Advertisement