
డింఛక్ పూజ వైరల్ వీడియో
యూట్యూబ్‌లో పాపులరైన డింఛక్ పూజ మరో కొత్త వీడియోతో హల్‌చల్ చేస్తోంది. 'బాపూ దేదే తోడా క్యాష్' పేరుతో విడుదలైన ఆమె మ్యూజిక్ వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. బుధవారం (సెప్టెంబర్ 20న) అప్‌లోడ్ అయిన ఈ వీడియోను ఇప్పటివరకు 5 లక్షలమందికి పైగా వీక్షించారు.
అయితే ఈ పాటను ఇంతకుముందే పూజ విడుదల చేసింది... కాకపోతే అది కేవలం ఆడియో మాత్రమే. ఇప్పుడు పాటకు తగ్గట్టుగా యాక్టింగ్ చేస్తూ వీడియోను రూపొందించి పూజ విడుదల చేసింది. గతంలో స్వాగ్ వాలీ టోపీ, దారు, సెల్ఫీ మైనే లేలీ ఆజ్, దిల్లోంక షూటర్ వంటి పాటలతో యూట్యూబ్ సెన్సేషన్‌గా డింఛక్ పూజ మారింది. కర్ణకఠోరంగా పాటలు పాడటంలో పేరు సంపాదించుకున్న పూజకి ఎంతమంది విమర్శకులు ఉన్నారో.. అంతకంటే ఎక్కువ మంది అభిమానులు కూడా ఉన్నారు. 'బిగ్‌బాస్ 11' హిందీ రియాలిటీ షోలోనూ డింఛక్ పూజ పాల్గొనబోతుందనే వార్తలు కూడా వచ్చాయి.