Deepthi Sunaina Open About What Changed In Her Life After Breakup, Deets Inside - Sakshi
Sakshi News home page

Deepthi Sunaina-Shanmukh Jaswanth: షన్నుతో బ్రేకప్. ఓపెన్ అయిన దీప్తి సునయన..!

Published Mon, Feb 13 2023 7:54 PM | Last Updated on Mon, Feb 13 2023 8:57 PM

Deepthi Sunaina Open About After Breakup With Shanmukh Jaswanth - Sakshi

యూట్యూబ్‌ స్టార్స్‌ షణ్ముఖ్‌ జస్వంత్‌, దీప్తి సునయనల క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డ్యాన్స్‌ వీడియోలతో పాపులర్‌ అయిన ఈ ఇద్దరూ ఆ తర్వాత బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లుగా మరింత ఫేమ్ సంపాదించారు. కానీ ఊహించని రీతిలో షన్ను బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చాక ఈ బ్రేకప్‌ చెప్పేసుకోవడం అప్పట్లో హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. దీంతో మళ్లీ వీరిద్దరూ కలిస్తే బాగుండు అని ఫ్యాన్స్‌ తెగ కోరుకుంటున్నారు. దాదాపు 5 ఏళ్ల పాటు వీరి ప్రేమ బంధం కొనసాగింది. అయితే ఈ జంట విడిపోయి ఇప్పటికే ఏడాది దాటిపోయింది. తాజాగా ఈ బ్రేకప్ తర్వాత దీప్తి సునయన క్రేజీ కామెంట్స్ చేసింది. షన్నుతో రిలేషన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. 

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే దీప్తి బ్రేకప్‌ విషయంపై తాజాగా ఓపెన్ అయింది.  తన ఫాలోవర్స్‌ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానలిచ్చింది.  ఈ క్రమంలోనే ఓ అభిమాని ఆసక్తికర ప్రశ్న వేశారు.  అభిమానులతో నిర్వహించిన చిట్‌ చాట్‌లో షన్నుతో బ్రేకప్‌పై స్పందించింది . బ్రేకప్ తర్వాత నీలో వచ్చిన మార్పు ఏంటని నెటిజన్ ప్రశ్నించగా.. రోజు రోజుకు రోబోలా తయారవుతున్నా అంటూ సమాధానం చెప్పింది దీప్తి.

మరో నెటిజన్ ప్రశ్నిస్తూ.. ఒక వ్యక్తిని మీ జీవితంలో ఆహ్వానించాలంటే అతడిలో ఏం చూస్తారు? ఎంత సమయం తీసుకుంటారు? అని అడగ్గా.. ‘నన్ను నవ్విస్తే చాలు’ అంటూ సమాధానమిచ్చింది బిగ్ బాస్ బ్యూటీ. ఆ తర్వాత అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆన్సరిచ్చింది దీప్తి సునయన. 

బ్రేకప్‌కు ఏడాది పూర్తి

దీప్తి సునయన-షణ్ముక్ జశ్వంత్ విడిపోయి దాదాపు ఏడాది దాటిపోయింది. ఇద్దరికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ,సంగతి తెలిసిందే. 2022 ప్రారంభంలో షన్ను బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకొచ్చాక బ్రేకప్ చెప్పేసింది దీప్తి. ఇన్‌‍స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టి గుడ్ బై చెప్పేసేంది.  ఆ తర్వాత షణ్ముఖ్ కూడా తాము విడిపోయినట్లు క్లారిటీ ఇచ్చాడు. తాజాగా ఆమె మరోసారి అభిమానులు ఈ ప్రశ్న అడగడంతో ఈ జంట మళ్లీ కలుస్తారా అని కామెంట్స్ చేసున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement