Deepthi Sunaina Shares First Post After Breakup With Shanmukh, Post Viral - Sakshi
Sakshi News home page

Deepthi Sunaina: తండ్రితో ఎమోషనల్‌ వీడియో షేర్‌ చేసిన దీప్తి సునయన..

Published Fri, Jan 7 2022 4:53 PM | Last Updated on Fri, Jan 7 2022 6:16 PM

Deepthi Sunaina Shares Emotional Video With Her Father After Breakup With Shannu - Sakshi

Deepthi Sunaina Shares Emotional Video With Her Father After Breakup With Shannu : దీప్తి సునయన-షణ్ముఖ్‌ల బ్రేకప్‌ స్టోరి ఇప్పటికీ నెట్టింట హాట్‌ టాపిక్‌గానే ఉంది. చూడచక్కనైన ఈ జంట విడిపోతారని ఎవరూ ఊహించలేదు. బిగ్‌బాస్‌ షోలో ఎన్ని ట్రోల్స్‌ వచ్చినా షణ్నూకు చివరిదాకా అండగా నిలబడ్డ దీప్తి.. అతని జీవితంలో మాత్రం చివరివరకు ఉండలేకపోయింది. బిగ్‌బాస్‌ షో అయిన వెంటనే షణ్నూకి బ్రేకప్‌ చెప్పేసి సైడయిపోయింది.

తమ దారులు వేరంటూ 5ఏళ్ల రిలేషన్‌ షిప్‌కు గుడ్‌బై చెప్పేసింది. అయితే  షణ్నూతో బ్రేకప్‌ తర్వాత ఆ బాధలోంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న దీప్తి సునయన ఈ మధ్యకాలంలో సోషల్‌ మీడియాలో సైతం తెగ యాక్టివ్‌గా కనిపిస్తుంది.

తాజాగా తన తండ్రితో కలిసి ఓ వీడియోను షేర్‌ చేస్తూ... 'ఆమె ఒంటరి కాదు. ఆమె వెనుక అత్యంత శక్తివంతమైన శక్తి ఉంది. అతడే తండ్రి ప్రేమ అంటూ  ఓ వీడియోను షేర్‌ చేసింది. ప్రస్తుతం అత్యంత కష్టవంతమైన పరిస్థితులు ఎదురైనా తన తండ్రి ప్రేమతో దాన్ని జయిస్తానంటూ పరోక్షంగా చెప్పుకొచ్చింది. చదవండి: సిరి ఫోటోలు డిలీట్‌ చేసిన ప్రియుడు.. బ్రేకప్‌కు సంకేతమా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement