ఆ కమెడియన్‌ మమ్మల్ని వేధించాడు! | Utsav Chakraborty Accused of Harassing Women | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 4 2018 8:20 PM | Last Updated on Fri, Oct 5 2018 3:37 PM

Utsav Chakraborty Accused of Harassing Women - Sakshi

యూట్యూబ్‌ ఫేమ్‌, స్టాండప్‌ కమెడియన్‌ ఉత్సవ్‌ చక్రవర్తికి కామెడీ గ్రూప్‌ ఆల్‌ ఇండియన్‌ బాక్‌చోద్‌ షాకిచ్చింది. ఇకపై అతడితో కలిసి పనిచేసేది లేదని తేల్చి చెప్పింది. ఉత్సవ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అతడిని తమ గ్రూప్‌ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా అతడితో షూట్‌ చేసిన కామెడీ వీడియోలను తొలగిస్తున్నట్లు పేర్కొంది.

అసలేం జరిగిందంటే.. కమెడియన్‌, రైటర్‌గా ఫేమస్‌ అయిన ఉత్సవ్‌ చక్రవర్తి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తాడంటూ ఓ యువతి ఆరోపణలు చేసింది. ఇందుకు రుజువుగా తనకు చేసిన మెసేజ్‌లను స్క్రీన్‌షాట్‌ తీసి ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో కంగుతిన్న ఉత్సవ్‌.. ఇంకెప్పుడూ అలా చేయనని, దయచేసి తన గురించి ఈవిధంగా ప్రచారం చేసి కెరీర్‌ నాశనం చేయొద్దంటూ ఆమెను వేడుకున్నాడని ఆమె తెలిపింది. కానీ ఆమె ట్వీట్‌కు స్పందనగా ఎంతో మంది యువతులు ఉత్సవ్‌ వల్ల తాము కూడా ఇలాంటి వేధింపులు ఎదుర్కొన్నామని, ఇప్పుడు కూడా అతడు అలాగే ప్రవర్తిస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తానొక్కదాన్నే బాధితురాలిని కాదని గ్రహించిన గత కొన్ని రోజులుగా ఉత్సవ్‌కు సంబంధించిన చాట్స్‌ అన్నీ బయటపెడుతూ వస్తున్నారు.

‘ఉత్సవ్‌ దిగజారుడు ప్రవర్తనను ప్రతీ ఒక్కరికి తెలియజేయాలనుకుంటున్నాను. అశ్లీల చిత్రాలు పంపించి నన్ను వేధించాడు. ఈ విషయం బయటపడటంతో తన కెరీర్‌ నాశనం చేయొద్దంటూ దొంగ ఏడుపులు ఏడ్చాడు. ఇతనొక్కడే కాదు ఇంకా చాలా మంది ఇలాంటి వ్యక్తులు సెలబ్రిటీల ముసుగులో అమ్మాయిలను వేధిస్తున్నారంటూ’  ఆమె ట్వీట్‌ చేశారు. కాగా తనపై వస్తున్న ఆరోపణలను ఉత్సవ్‌ ఖండించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement