harrassing
-
టాటూలు వేస్తానని ఏడుగురు మహిళలతో ఒంటరిగా స్టూడియోలో..
తిరువనంతపురం: దేశంలో మహిళలు, యువతులపై రోజురోజుకు లైంగిక వేధింపులు పెరుగుతున్నాయి. ప్రతీరోజు ఏదో ఒక చోట వారు వేధింపులకు గురవుతూనే ఉన్నారు. మహిళలపై వేధింపులు తగ్గించేందుకు ప్రభుత్వం ఎన్ని చట్టాలను తీసుకువచ్చినా నేరాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. తాజాగా కేరళలో ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ కామాంధుడి ఏగుగురు యువతులను నమ్మించి అకృత్యానికి పాల్పడ్డాడు. వివరాల ప్రకారం.. కేరళలోని ఎటప్పళ్లిలో సుజీష్ అనే వ్యక్తి టాటూలు వేసే స్టూడియోను రన్ చేస్తున్నాడు. దీంతో ఓ యువతి(18) టాటూలు వేసుకునేందుకు అతడి స్టూడియోకి వెళ్లింది. టాటూ వేసే నెపంతో ఆ కామాంధుడు సదరు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధితురాలు సోషల్ మీడియాలో తెలుపుతూ ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె పోస్టు ఆధారంగా.. ఎర్నాకుళం పోలీసులు సుజీష్‌పై కేసు నమోదు చేశారు. ఈ విషయం కాస్తా బయటకు రావడంతో అతడి చేతిలో మోసపోయిన మరో ఆరుగురు మహిళలు పోలీసులను ఆశ్రయించారు. అంతకు ముందు వారిపై జరిగిన లైంగిక వేధింపులను బహిర్గతం చేశారు. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచనున్నట్టు వెల్లడించారు. -
అసభ్య సందేశాలు.. బాస్‌ను చితకబాదిన మహిళ
బీజింగ్: ఆడవాళ్లు ఇంటి పట్టునే ఉండాలి.. కుటుంబ సభ్యులను బాగా చూసుకోవాలి.. వారికి కావాల్సినవన్ని అమర్చి.. ఆమె జీవితాన్ని కుంటుంబానికే అంకితం చేయాలి. ఉద్యోగాలు చేయడం అంటే పెద్ద నేరం చేసినట్లే. స్త్రీ అంటే నేటికి సమాజంలో చాలా మందికి ఇదే భావం. ఇక ఈ బంధనాలు తెంచుకుని ఉద్యోగాలు చేసే మహిళలు ఎదుర్కొనే సమస్యలు కోకొల్లలు. పనిలో ఏ మాత్రం జాప్యం జరిగినా.. ఆఫీసుకు కాస్త లేటుగా వెళ్లినా.. కొందరు పురుష ఉద్యోగులు ఇంటి పట్టున ఉండక.. వీరికి ఇవన్ని ఎందుకు అంటూ ఎద్దేవా చేస్తారు. ఇక బాస్ "మగానుభావుడైతే" ఆ కష్టాలు ఇంకో రకం. ఆ పెత్తనంతో ఆడవారిని వేధింపులకు గురి చేస్తారు. తమ మాట వినకపోతే.. టార్చర్ పెడతారు. బాస్ అనే కారణం చెప్పి ఫోన్ చేసి.. అసభ్య సందేశాలు చేస్తూ మహిళా ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తారు. చాలా మంది ఆడవారు వీటన్నింటిని మౌనంగా భరిస్తారు. కానీ కొందరు మాత్రం ఎదురుతిరుగారు. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఈ వీడియో చూస్తే బాగా అర్థం అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగి అయిన ఓ యువతిని ఆమె బాస్ వేధింపులకు గురి చేస్తాడు. ఉన్నాతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. సహనం కోల్పోయిన సదరు ఉద్యోగిణి మాబ్ కర్ర తీసుకువచ్చి.. బాస్‌ను చితకబాదింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. చైనాలోని హీలాంగ్జియాంగ్ ప్రావిన్స్‌లోని సుయిహువా, బీలిన్ జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగ సంస్థలో ఈ సంఘటన జరిగిందని చైనా టైమ్స్ న్యూస్ మీడియా తెలిపింది. ఈ వీడియోలో ఓ మహిళ తన బాస్ తనను ఎలా హింసించాడో వివరిస్తూ అతడిపై మాబ్ కర్రతో దాడి చేస్తుంది. తనకు అసభ్య సందేశాలు పంపాడని.. వార్నింగ్ ఇచ్చినా ఆగలేదని.. దాంతో ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశానని అనడం వీడియోలో వినిపిస్తుంది. ఎన్ని చేసినా బాస్ ప్రవర్తనలో మార్పు రాలేదు. ఓపిక నశించిన సదరు యువతి మాబ్ కర్రతో బాస్‌పై దాడి చేస్తుంది. చితకబాదుతుంది. ఇక సదరు బాస్ తన మొహం కనిపించకుండా చేతులు అడ్డుపెట్టుకుని తనను వదిలి వేయాల్సిందిగా బతిమిలాడతాడు. తాను జోక్ చేద్దామని భావించి మెసేజ్ చేశానని తెలుపుతాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజనులు సదరు ఉద్యోగిణిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి మహిళ ఇంతే ధైర్యంగాఉండాలని కామెంట్ చేస్తున్నారు. చదవండి: హనీమూన్ కోసం రూ.18 లక్షలకు కొడుకును అమ్మిన తండ్రి -
వైరల్ వీడియో: బాస్‌ను చితకబాదిన మహిళ
-
ఏడు రోజుల బాలింతకు ప్రత్యక్ష నరకం
అనంతపురం : పచ్చి బాలింతకు అత్తింట్లో ప్రత్యక్ష నరకం చూపించారు. ఏడు రోజుల బాలింత అని చూడకుండా నోట్లో గుడ్డకుక్కి చితకబాదిన ఘటన అనంతపురం జిల్లా కేంద్రంలోని నాయక్‌నగర్‌లో చోటు చేసుకుంది. స్థానిక ప్రజలు పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి బాలింతను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ధర్మవరానికి చెందిన లక్ష్మిదేవి బాయికి ఆరేళ్ల క్రితం నగరంలోని నాయక్‌నగర్‌కు చెందిన జగన్మోహన్ నాయక్‌తో వివాహమైంది. ఇతను చెన్నై ఇండియన్ ఆయిల్ కంపెనీ క్వాలిటీ ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు. వీరికి నాలుగన్నరేళ్ల పాప ఉంది. ఈ నెల 18న నగరంలోని స్నేహలత ఆస్పత్రిలో లక్ష్మిదేవి బాయి మరో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ నెల 22న లక్ష్మిబాయి డిశ్చార్జ్ కాగా, నాయక్‌నగర్‌లోని అత్తింటికి వెళ్లింది. అప్పటి నుంచి బాలింతకు ప్రత్యక్ష నరకం మొదలైంది. మామ శంకర్‌నాయక్(ఏఎస్ఐ, పీటీసీ), అత్త శాంతిబాయి, భర్త జగన్మోహన్ నాయక్, మరిది పరమేష్‌నాయక్ విచక్షణారహితంగా చితకబాదారు. మరో కోడలు కట్నం కింద స్థలాలు తీసుకొచ్చిందని, నీవెమిచ్చావని నానా దుర్భాషలాడారు. రెండోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చావని కొట్టారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం లక్ష్మిదేవిబాయిపై తీవ్రంగా దాడి చేయడంతో ఆమె కేకలు వేసింది. చుట్టుపక్కల వారు, మీడియా విషయాన్ని టూటౌన్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా బాలింతను స్టేషన్‌కు తరలించి ఫిర్యాదు తీసుకొని ఆస్పత్రికి తరలించారు. అనంతరం అత్తా, మామ, భర్త, మరిదిపై పోలీసులు కట్నం, వేధింపులు తదితర కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మీదేవిబాయిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీదేవి పరామర్శించారు. భార్యను కడతేర్చిన భర్త శింగనమల: అనుమానంతో కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఓ కసాయి భర్త. శింగనమల మండలం ఈస్ట్ నరసాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.... ఈస్ట్ నరసాపురం గ్రామానికి చెందిన ఓబుళ నారాయణ, తన అక్క కుమార్తె తాడిపత్రికి చెందిన ఇందిరమ్మ (35)ను 22 సంవత్సరాలు క్రితం వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమారుడు, కూమారై ఉన్నారు. 12 సంవత్సరాలు కలిసి కాపురం చేశారు. అయితే భార్యపై అనుమానంతో రోజూ వాదులాడుకునేవారు. ఈ నేపథ్యంలో పదేళ్ల క్రితమే భర్తను వదిలేసి ఇందిరమ్మ తాడిపత్రికి వెళ్లిపోయింది. ఇందిరమ్మ తన కుమారుడితో కలిసి తాడిపత్రిలో నివసిస్తుండగా.. ఓబుళ నారాయణ కుమార్తెను పోషిస్తూ ఈస్ట్ నరసాపురంలోనే ఉండేవాడు. అయితే కుమార్తెకు వివాహం నిశ్చయం కావడంతో ఓబుళ నారాయణ ఈ నెల 22న భార్య ఇందిరమ్మను ఇంటికి తీసుకొచ్చాడు. మంగళవారం రాత్రి భార్యాభర్తలు గొడవపడ్డారు. ఇందులో భాగంగా ఆవేశంతో ఓబుళ నారాయణ సుత్తి తీసుకొని భార్య ఇందిరమ్మ తలపై మోదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం నిందితుడు శింగనమల పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. ఎస్ఐ మస్తాన్ సిబ్బందితో కలిసి ఈస్ట్ నరసాపురానికి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అప్పటికే ఇందిరమ్మ మృతి చెందినట్లు గుర్తించారు. ఇటుకలపల్లి సీఐ విజయభాస్కర్‌గౌడ్ కూడా ఘటనా స్థలానికి వచ్చి వివరాలను తెలుసుకున్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ఆ కమెడియన్ మమ్మల్ని వేధించాడు!
యూట్యూబ్ ఫేమ్, స్టాండప్ కమెడియన్ ఉత్సవ్ చక్రవర్తికి కామెడీ గ్రూప్ ఆల్ ఇండియన్ బాక్చోద్ షాకిచ్చింది. ఇకపై అతడితో కలిసి పనిచేసేది లేదని తేల్చి చెప్పింది. ఉత్సవ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అతడిని తమ గ్రూప్ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా అతడితో షూట్ చేసిన కామెడీ వీడియోలను తొలగిస్తున్నట్లు పేర్కొంది. అసలేం జరిగిందంటే.. కమెడియన్, రైటర్‌గా ఫేమస్ అయిన ఉత్సవ్ చక్రవర్తి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తాడంటూ ఓ యువతి ఆరోపణలు చేసింది. ఇందుకు రుజువుగా తనకు చేసిన మెసేజ్‌లను స్క్రీన్‌షాట్ తీసి ట్విటర్లో పోస్ట్ చేసింది. దీంతో కంగుతిన్న ఉత్సవ్.. ఇంకెప్పుడూ అలా చేయనని, దయచేసి తన గురించి ఈవిధంగా ప్రచారం చేసి కెరీర్ నాశనం చేయొద్దంటూ ఆమెను వేడుకున్నాడని ఆమె తెలిపింది. కానీ ఆమె ట్వీట్‌కు స్పందనగా ఎంతో మంది యువతులు ఉత్సవ్ వల్ల తాము కూడా ఇలాంటి వేధింపులు ఎదుర్కొన్నామని, ఇప్పుడు కూడా అతడు అలాగే ప్రవర్తిస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తానొక్కదాన్నే బాధితురాలిని కాదని గ్రహించిన గత కొన్ని రోజులుగా ఉత్సవ్‌కు సంబంధించిన చాట్స్ అన్నీ బయటపెడుతూ వస్తున్నారు. ‘ఉత్సవ్ దిగజారుడు ప్రవర్తనను ప్రతీ ఒక్కరికి తెలియజేయాలనుకుంటున్నాను. అశ్లీల చిత్రాలు పంపించి నన్ను వేధించాడు. ఈ విషయం బయటపడటంతో తన కెరీర్ నాశనం చేయొద్దంటూ దొంగ ఏడుపులు ఏడ్చాడు. ఇతనొక్కడే కాదు ఇంకా చాలా మంది ఇలాంటి వ్యక్తులు సెలబ్రిటీల ముసుగులో అమ్మాయిలను వేధిస్తున్నారంటూ’ ఆమె ట్వీట్ చేశారు. కాగా తనపై వస్తున్న ఆరోపణలను ఉత్సవ్ ఖండించాడు. -
లెక్కల టీచర్ వక్రబుద్ధి.. స్కూలుకు తాళాలు
ప్రకాశం: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే కర్తవ్యం మరిచి పక్కా దారి పట్టిన ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. స్కూల్ బాలికలకు మాయమాటలు చెప్పి లోబర్చుకుంటున్నాడు. దీనిపై ఆ గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాఠశాలకు తాళాలు వేసిన ఘటన ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం బొమ్మలాపురంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో లెక్కల మాస్టరు తన వక్రబుద్ధిని చూపిస్తున్నాడు. ఆరు నెలల క్రితం తొమ్మిదో తరగతి బాలికను మభ్యపెట్టి తనతో తీసుకెళ్లిపోయాడు. దీంతో అప్పట్లో అతనిపై కేసు నమోదైంది. తాజాగా మరో బాలికను దసరా సెలవుల్లో తనతో పాటు చీరాలకు తీసుకువెళ్లాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తంచేసిన గ్రామస్థులు సోమవారం అతడు పాఠశాలకు వస్తే నిలదీయాలని నిర్ణయించుకున్నారు. కానీ, అతడు రాలేదు. దీంతో పిల్లల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయులు, విద్యార్థులను బయటకు పంపి తరగతి గదులకు తాళాలు వేశారు. సదరు టీచర్ విషయమై చర్యలు తీసుకోవాలని హెచ్ఎం ఝాన్సీలక్ష్మీబాయిని కోరారు. -
భార్యను వేధించిన భర్తకు జైలుశిక్ష
హైదరాబాద్: అదనపు కట్నం కోసం భార్యను వేధించిన భర్తకు ఎనిమిది నెలల జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధిస్తూ సైబరాబాద్ 14వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ మంగళవారం తీర్పుచెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... సరూర్‌నగర్ ప్రాంతంలో నివాసముండే సురేఖ, నాగరాజు వివాహం 2006లో జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. అయితే, నాగరాజు అదనపు కట్నం తేవాలని భార్య సురేఖను వేధించసాగాడు. ఈ క్రమంలో 2012 ఆగస్టులో భార్య సురేఖతో గొడవపడి ఆమెను పుట్టింటికి తరిమేశాడు. సురేఖ ఫిర్యాదు మేరకు సరూర్‌నగర్ మహిళా పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించి కోర్టులో అభియోగపత్రం నమోదు చేశారు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన సైబరాబాద్ 14 మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ పైవిధంగా తీర్పుచెప్పారు.