అదనపు కట్నం కోసం భార్యను వేధించిన భర్తకు ఎనిమిది నెలల జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధిస్తూ సైబరాబాద్ 14వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ మంగళవారం తీర్పుచెప్పారు.
హైదరాబాద్: అదనపు కట్నం కోసం భార్యను వేధించిన భర్తకు ఎనిమిది నెలల జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధిస్తూ సైబరాబాద్ 14వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ మంగళవారం తీర్పుచెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... సరూర్‌నగర్ ప్రాంతంలో నివాసముండే సురేఖ, నాగరాజు వివాహం 2006లో జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. అయితే, నాగరాజు అదనపు కట్నం తేవాలని భార్య సురేఖను వేధించసాగాడు.
ఈ క్రమంలో 2012 ఆగస్టులో భార్య సురేఖతో గొడవపడి ఆమెను పుట్టింటికి తరిమేశాడు. సురేఖ ఫిర్యాదు మేరకు సరూర్‌నగర్ మహిళా పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించి కోర్టులో అభియోగపత్రం నమోదు చేశారు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన సైబరాబాద్ 14 మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ పైవిధంగా తీర్పుచెప్పారు.