ఎవర్రా మీరంతా? ఇలా తగులుకున్నారు.. హర్షసాయి కాళ్లపై పడ్డ ఫ్యాన్‌! | Youtuber Harsha Sai Movie Teaser Event, Fan Interrupt The Scene | Sakshi
Sakshi News home page

Harsha Sai: ఎవర్రా మీరంతా? ఇలా తగులుకున్నారు.. ఆడేసుకుంటున్న నెటిజన్స్!

Published Mon, Sep 18 2023 10:13 AM | Last Updated on Mon, Sep 18 2023 11:20 AM

Youtuber Harsha Sai Movie Teaser Event Fan Interrupt The Scene - Sakshi

యూట్యూబర్‌గా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్‌గా హర్ష సాయి అందరికీ సుపరిచితమే. కష్టాల్లో ఉన్న చాలామందికి సాయం చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు.  అయితే ఇప్పటివరకు సామాజిక సేవ కోసం టైం వెచ్చించిన మనోడు.. సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీకి సిద్ధమయ్యాడు. తానే హీరోగా, స్వీయ దర్శకత్వంలో మెగా సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిస్తుండటం మరో విశేషం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ రిలీజ్‌ కాగా.. ఫ్యాన్స్ నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. టీజర్ రిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లో గ్రాండ్‌ ఈవెంట్‌ కూడా నిర్వహించారు.  అయితే ఈ చిత్రాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దగ్గరి బంధువైన కల్వకుంట్ల వంశీధర్ రావు సమర్పిస్తున్నారు. బిగ్‌బాస్‌ బ్యూటీ  మిత్ర శర్మ తన సొంత బ్యానర్‌ శ్రీ పిక్చర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

(ఇది చదవండి: హర్ష సాయి హీరోగా మెగా సినిమా.. టీజర్‌ వచ్చేసింది)

అయితే టీజర్ రిలీజ్ సందర్భంగా వేదికపై ఓ సంఘటన చోటు చేసుకుంది. మామూలుగా అయితే ఇలాంటి సన్నివేశాలు స్టార్ హీరోల ఈవెంట్స్‌లో చూస్తుంటాం. కానీ మొదటిసారి సినిమా చేస్తున్న హర్ష సాయి టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌లో జరగడంతో నెటిజన్స్ షాకయ్యారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకోవాలనుందా? అయితే చూద్దా పదండి.

గతంలో స్టార్ హీరోల మూవీస్ ట్రైలర్‌ లాంఛ్ ఈవెంట్, ప్రీ రిలీజ్‌ ఈవెంట్స్‌లో అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. అభిమాన హీరోతో ఒక్క సెల్ఫీ ఫోటో అయినా దిగాలని ఉత్సాహంగా ఉంటారు. అదే అదునుగా ఈవెంట్‌ జరుగుతున్న సమయంలో వేదికపైకి దూసుకురావడం చూస్తుంటాం. ఇటీవలే విశ్వక్‌సేన్‌ మూవీ ఫంక్షన్‌కు హాజరైన జూనియర్‌ ఎన్టీఆర్‌ను ఓ అభిమాని ఒక్కసారిగా వేదికపైకి దూసుకెళ్లాడు. తన ఫేవరేట్ హీరోతో సెల్ఫీ అంత  సాహసం చేశాడు. అయినా జూనియర్‌ ఉన్న క్రేజ్‌ అలాంటిది మరీ. ఆయన అభిమానులు ఆ మాత్రం రచ్చ ఉండాల్సిందే.

కానీ.. ఎవరూ ఊహించని విధంగా హర్షసాయి సినిమా తీస్తున్నట్లు ప్రకటించాడు. అంతేకాకుండా టీజర్‌ను కూడా రిలీజ్ చేస్తూ హైదరాబాద్‌లో ఈవెంట్‌ నిర్వహించాడు. అయితే విశ్వక్‌ సేన్‌ ఈవెంట్‌లో జరిగిన సీన్‌ ఇక్కడ రిపీట్ అవ్వడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఓ అభిమాని ఏకంగా హర్ష సాయి కాళ్లపై పడడంతో నెట్టింట చర్చ మొదలైంది. అక్కడున్న సిబ్బంది అతనికి పక్కకు తీసుకెళ్లారు.

( ఇది చదవండి: అలా అయితేనే ఇండస్ట్రీలో కొనసాగుతాం: హీరోయిన్ కామెంట్స్ వైరల్!)

అంతా బాగానే ఉంది.. కానీ హర్షసాయి ఈవెంట్‌లో ఈ సంఘటన జరగడంతో నెటిజన్స్ తెగ ట్రోల్స్ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా వీన్ని తగులుకున్నారేంటి బ్రో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే హర్షసాయికి మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. ఓ నెటిజన్ రాస్తూ ఇంతకీ ఎవర్రా మీరంతా? అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. అరే ఏంటయ్యా మీ అభిమానం? ఫన్నీ మీమ్స్ నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. టీజర్‌కే ఇంతా హడావుడి చేస్తే.. సినిమా రిలీజ్‌ అయితే ఏ రేంజ్‌లో ట్రోల్స్ వస్తాయో వేచి చూడాల్సిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement