నాని కాన్ఫిడెన్స్‌కి కారణం ఇదే : ‘కోర్ట్‌’ డైరెక్టర్‌ | Director Ram Jagadeesh Talk About Court Movie | Sakshi
Sakshi News home page

నాని కాన్ఫిడెన్స్‌కి కారణం ఇదే : ‘కోర్ట్‌’ డైరెక్టర్‌

Mar 12 2025 6:58 PM | Updated on Mar 12 2025 7:17 PM

Director Ram Jagadeesh Talk About Court Movie

‘కోర్ట్‌’ కథ నానికి చెప్పడానికి దాదాపు 8 నెలల వెయిట్‌ చేశాను. ఫైనల్‌గా ఓ రోజు ఆయన నుంచి పిలుపొచ్చింది. దాదాపు రెండున్నర గంటల కథని సింగిల్ సిటింగ్ లో విన్నారు. కథ మొత్తం విని నిల్చుని షేక్ హ్యాండ్ ఇచ్చి 'వెల్కమ్ టు వాల్ పోస్టర్ సినిమా' అన్నారు. అది నా జీవితంలో హై మూమెంట్’ అని అన్నారు డైరెక్టర్‌ రామ్‌ జగదీష్‌. ఆయన ఆయన దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్ చేస్తున్న మూవీ 'కోర్ట్' - స్టేట్ వర్సెస్ ఎ నోబడీ'. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. మార్చి 14న ఈ మూవీ రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ జగదీష్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

ఈ కథ ఫోక్సో యాక్ట్ నేపథ్యంలో ఉంటుంది. నిజజీవితంలో ఇలాంటి ఒక కేసుని నేను పరిశీలించాను. ఆ కేసు గురించి తెలుసుకున్నప్పుడు నిజంగా ఇలా కూడా ఉంటుందా అని సందేహంగా అనిపించింది. ఇలాంటి కేసులు ఇంకా చాలా ఉన్నాయని తెలిసింది. ఆ కేసులు అన్నిటి మీద కూడా రీసెర్చ్ చేశాను. ఏపీ తెలంగాణలో వందల కేసులు ఉన్నాయి. ఇవన్నీ స్క్రీన్ మీద అడ్రస్ చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. ఈ కథ కోసం చాలా కేసు ఫైల్స్ చదివాను. అన్ని కేస్ ఫైల్స్ లో ఉన్న మెటీరియల్ తో ఒక మంచి కథ చెప్పొచ్చు కదా అనిపించింది. అవన్నీ ఒక కథగా చేసి స్క్రీన్ పై చూపించడం జరిగింది.

⇢ ఇది పర్టికులర్ ఒక పర్సన్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ కి సంబంధించిన కథ కాదు. చాలా సంఘటనల స్ఫూర్తి ఉంది. ఇది కంప్లీట్ గా ఫిక్షనల్ కథ. చదివిన కేసుల ఎసెన్స్ తో ఒక ఫిక్షనల్ స్టోరీ చేయడం జరిగింది.

⇢ మనం గతంలో చాలా కోర్ట్ రూమ్ డ్రామాలు చూసాం. కానీ ఒక లవ్ స్టోరీ ని కోర్ట్ రూమ్ డ్రామాగా ఎప్పుడు చూడలేదని భావిస్తున్నాను. ఇందులో లవ్ స్టోరీ, కోర్ట్ రూమ్  డ్రామా చాలా ప్రత్యేకంగా ఉంటాయి.

⇢ ఫోక్సో చాలా ముఖ్యమైన ఆక్ట్. నిజానికి ఆ చట్టం గురించి బయట ప్రపంచానికి చాలా తక్కువ తెలుసు. దాని గురించి కొంచెం డీటెయిల్ గా చెప్తే బాగుంటుందని అనిపించింది. అది ఈ సినిమాలో చూస్తారు.

⇢ ఈ సినిమాలో అన్ని పాత్రలని ఆడిషన్స్ చేసి తీసుకున్నాం. చందు పాత్ర ప్లే చేయడానికి రోషన్ చాలా తపనపడ్డాడు. సెలెక్ట్ అయిన తర్వాత తను చేసిన ఫాలోఅప్ అద్భుతం. చాలా ఫ్యాషన్ చూపించాడు. చందు పాత్రని త్వరగానే క్లోజ్ చేసాం కానీ జాబిల్లి పాత్ర కోసం చాలా సెర్చ్ చేసాం. ఒక తెలుగు అమ్మాయి కావాలి, కొత్తగా ఉండాలి, సరైన ఏజ్ కావలి, నటన తెలిసి ఉండాలి ఇలాంటి కాంబినేషన్ ఉన్న అమ్మాయి కోసం చూస్తున్నప్పుడు ఒక దశలో దొరకదేమో అనుకున్నాం. అలాంటి సమయంలో నా ఫ్రెండ్ ఒక ఇన్స్టా ప్రొఫైల్ పంపించాడు. అందులో రీల్స్ చూస్తున్నప్పుడు ఒక రీల్ లో తను జాబిల్లిలా కనిపించింది. అడిషనల్ చేసాం. ఆ క్యారెక్టర్ కి  పర్ఫెక్ట్ యాప్ట్ అయ్యింది,  

⇢ ఈ సినిమా ఐడియా మొదటగా ప్రియదర్శికే చెప్పాను. ఆయనకి చెప్పిన తర్వాత ఈ సినిమాని నేనే చేస్తాను. ఇంకా ఎవరికీ చెప్పొద్దు అన్నారు. ఆయనకే చెప్పాను. ఆయనతోనే చేశాను. 
ప్రియదర్శితో నాకు చాలా క్లోజ్ అసోషియేషన్. చాలా ఫ్రెండ్లీ గా ఉంటాం. తనతో అన్నీ షేర్ చేసుకోగలను.

⇢ శివాజీ గారు మంగపతి క్యారెక్టర్ లో కనిపిస్తారు. ప్రతి ఫ్యామిలీలో అలాంటి ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఇలాంటి ఒక సంఘటన జరిగినప్పుడు ప్రతి ఒక్కరు మంగపతి అవుతారు. రియల్ లైఫ్ క్యారెక్టర్ లా ఉంటుంది.

⇢ నాని గారు సినిమా చూశారు. అందుకే ఈ చిత్రం కచ్చితంగా హిట్‌ అవుందని చెబుతున్నాడు. సినిమాపై ఆయనకి ఉన్న కాన్ఫిడెన్స్ అది. ఆయన కాన్ఫిడెన్స్ అంతా సినిమా ఇచ్చిందే. నాని గారు సినిమా చూసి 'ప్రౌడ్ అఫ్ యూ జగదీశ్' అన్నారు. అది నాకు వచ్చిన బెస్ట్ కాంప్లీమెంట్

⇢ ఇది కమర్షియల్ సినిమానే. సినిమా చూసి ఒకతను చుక్క రక్తం లేకుండా కమర్షియల్ సినిమా చూపించావ్ అన్నారు. ఆ మాట నాకు చాలా నచ్చింది.ఈ సినిమా మనందరి జీవితం. మనం తెలుసుకోవాల్సిన నిజం. స్క్రీన్ మీద మన జీవితమే  ఉంటుంది. మనల్ని మనం తెరపై చూసుకోవడానికి సినిమాకి రావాలని కోరుకుంటున్నాను. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement