Ram Jagadeesh
-
'కోర్ట్' దర్శకుడికి కారు గిఫ్ట్ ఇచ్చిన నాని!
సాధారణంగా సినిమాలు హిట్ అయినప్పుడు, కోట్లాది రూపాయల వసూళ్లు వచ్చినప్పుడు ఆనందం కొద్దీ నిర్మాతలు.. దర్శకులు, హీరోలకు లగ్జరీ బహుమతులు ఇస్తుంటారు. ఒకవేళ ఇస్తే దాన్ని చాలామంది చెప్పుకొంటారు. కానీ నాని మాత్రం దీని గురించి ఏ మాత్రం బయటపెట్టలేదట.హీరోగా వరస సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతున్న నాని.. మరోవైపు నిర్మాతగానూ సక్సెస్ అందుకుంటున్నాడు. గత నెలలో థియేటర్లలో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన 'కోర్ట్' నిర్మించింది నానినే. అయితే ఈ సినిమా కోసం రూ.10 కోట్ల బడ్జెట్ పెడితే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: పహల్గామ్ ఉగ్రదాడి.. ప్రభాస్ సినిమాపై ఎఫెక్ట్!) అయితే ఈ సినిమా అద్భుతమైన హిట్ అయ్యేసరికి ఫుల్ హ్యాపీ అయిపోయిన నాని.. 'కోర్ట్' దర్శకుడికి కారు గిఫ్ట్ ఇచ్చాడట. ఈ విషయాన్ని సదరు డైరెక్టర్ రామ్ జగదీశ్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. నాని చేతుల మీదుగా కారు బహుమతిగా అందుకోవడం ఒక అచీవ్ మెంట్ అని రామ్ జగదీష్ చెప్పుకొచ్చాడు. గిఫ్ట్ ఇచ్చినట్లు బయటకు చెప్పుకోవడం నానికి ఇష్టం లేదని.. అందుకే ఎవరికీ చెప్పలేదని, లేదంటే గట్టిగా అరిచి తనకు కారు కొనిచ్చాడని చెప్పేవాడినని అన్నాడు.(ఇదీ చదవండి: ఐపీఎల్ క్రికెటర్ ని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్) -
ఓటీటీలో కోర్ట్ సినిమా.. అఫీషియల్ ప్రకటన
హీరో నాని(Nani) నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం 'కోర్ట్–స్టేట్ వర్సెస్ ఏ నోబడీ'(Court - State Vs. A Nobodycourt). ఓటీటీ విడుదలపై అధికారికంగా ప్రకటన వచ్చేసింది. మార్చి 14న హోలీ పండగ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో రోషన్, శ్రీదేవి ఇతర పాత్రలలో మెప్పించగా.. ఇందులో శివాజీ అద్భుతమైన నటనతో మెప్పించారు. సాయికుమార్, రోహిణి, హర్ష వర్ధన్ తదితరులు కీలకంగా నటించారు. రామ్ జగదీష్ దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నాని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను అందరూ తప్పకుండా చూడాలని విమర్శకులు సైతం కామెంట్ చేయడం విశేషం. సెన్సిటివ్ పోలీస్ కేసు విషయంలో మన చట్టాలు ఎలా ఉంటాయో ఈ చిత్రం చెబుతుందని వారు తెలిపారు.'కోర్టు' సినిమా 'ఏప్రిల్ 11'న విడుదల కానుందని 'నెట్‌ఫ్లిక్స్'(Netflix) అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే తమ ఓటీటీ కమింగ్‌సూన్ బ్లాక్‌లో ఈ సినిమాను చేర్చారు. అందులోనే స్ట్రీమింగ్ వివరాలను ప్రకటించారు. తెలుగతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీలో అందుబాటులో ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది. కేవలం రూ. 10 కోట్ల లోపు బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 60 కోట్ల గ్రాస్‌కు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఆపై సుమారు రూ. 8 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాతో హీరో నానికి మంచిపేరు రావడమే కాకుండా భారీ లాభాన్ని కూడా తెచ్చిపెట్టింది.కథేంటంటే.. ఈ సినిమా కథంతా 2013లో సాగుతుంది. విశాఖపట్నంలో మంగపతి(శివాజీ)కి మంచి రాజకీయ పలుకుబడి ఉంటుంది. తన మామయ్య(శుభలేఖ సుధాకర్) ఇంట్లో కూడా తన పెత్తనమే సాగుతుంది. ఆడవాళ్లను తన హద్దుల్లో పెట్టుకోవాలనే మనస్తత్వం తనది. ఇంట్లో ఉన్న అమ్మాయిలు కాస్త ఫ్యాషన్ దుస్తులు ధరించినా సహించలేడు. అలాంటి వ్యక్తికి తన కోడలు జాబిలి(శ్రీదేవి) ప్రేమ కథ తెలుస్తుంది. ఇంటర్ చదువుతున్న జాబిలి.. ఇంటర్ ఫెయిల్ అయి పార్ట్ టైం జాబ్ చేస్తున్న వాచ్మెన్ కొడుకు చంద్రశేఖర్ అలియాస్ చందు(రోషన్)తో ప్రేమలో పడుతుంది.ఈ విషయం మంగపతికి తెలిసి.. తనకున్న పలుకుబడితో చందుపై పోక్సో కేసు పెట్టించి అరెస్ట్ చేయిస్తాడు. మరి ఈ కేసు నుంచి చందు ఎలా బయటపడ్డాడు? జూనియర్ లాయర్ సూర్యతేజ(ప్రియదర్శి) ఎలాంటి సహాయం చేశాడు? అసలు పోక్సో చట్టం ఏం చెబుతోంది? ఈ చట్టాన్ని కొంతమంది తమ స్వార్థం కోసం ఉపయోగించి అమాయకుల్ని ఎలా బలి చేస్తున్నారు? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘కోర్ట్’ సినిమా చూడాల్సిందే. -
Court Movie Review: నాని ‘కోర్ట్’ మూవీ రివ్యూ
టైటిల్:'కోర్ట్'- స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' నటీనటులు: ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, హర్ష్ రోషన్, శ్రీదేవి, శుభలేఖ సుధాకర్, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి తదితరులుసమర్పణ: నానినిర్మాణ సంస్థ: వాల్ పోస్టర్ సినిమానిర్మాత: ప్రశాంతి తిపిర్నేనికథ, దర్శకత్వం: రామ్ జగదీష్సంగీతం: విజయ్ బుల్గానిన్సినిమాటోగ్రఫీ: దినేష్ పురుషోత్తమన్ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్విడుదల తేది: మార్చి 14, 2025హీరో నాని ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు కొత్త చిత్రాలను నిర్మిస్తున్నాడు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ ద్వారా కొత్త కంటెంట్‌తో పాటు కొత్త నటీనటులను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు. తాజాగా ఆయన బ్యానర్లో తెరకెక్కిన చిత్రమే ‘కోర్ట్’. ‘‘కోర్ట్’ నచ్చకపోతే నా ‘హిట్ 3’సినిమా చూడకండి’ అంటూ నాని సవాల్ విసరడంతో ఈ చిన్న చిత్రంపై అందరిలో ఆసక్తి పెరిగింది. అంతేకాదు రిలీజ్‌కి రెండు రోజుల ముందే మీడియాకు స్పెషల్ షో వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ఈ సినిమా కథంతా 2013లో సాగుతుంది. విశాఖపట్నంలో మంగపతి(శివాజీ)కి మంచి రాజకీయ పలుకుబడి ఉంటుంది. తన మామయ్య(శుభలేఖ సుధాకర్) ఇంట్లో కూడా తన పెత్తనమే సాగుతుంది. ఆడవాళ్లను తన హద్దుల్లో పెట్టుకోవాలనే మనస్తత్వం తనది. ఇంట్లో ఉన్న అమ్మాయిలు కాస్త ఫ్యాషన్ దుస్తులు ధరించినా సహించలేడు. అలాంటి వ్యక్తికి తన కోడలు జాబిలి(శ్రీదేవి) ప్రేమ కథ తెలుస్తుంది. ఇంటర్ చదువుతున్న జాబిలి.. ఇంటర్ ఫెయిల్ అయి పార్ట్ టైం జాబ్ చేస్తున్న వాచ్మెన్ కొడుకు చంద్రశేఖర్ అలియాస్ చందు(రోషన్)తో ప్రేమలో పడుతుంది. ఈ విషయం మంగపతికి తెలిసి.. తనకున్న పలుకుబడితో చందుపై పోక్సో కేసు పెట్టించి అరెస్ట్ చేయిస్తాడు. మరి ఈ కేసు నుంచి చందు ఎలా బయటపడ్డాడు? జూనియర్ లాయర్ సూర్యతేజ(ప్రియదర్శి) ఎలాంటి సహాయం చేశాడు? అసలు పోక్సో చట్టం ఏం చెబుతోంది? ఈ చట్టాన్ని కొంతమంది తమ స్వార్థం కోసం ఉపయోగించి అమాయకుల్ని ఎలా బలి చేస్తున్నారు? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘కోర్ట్’ సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని రాజ్యాంగం చెబుతోంది. కానీ అదే చట్టాలను కొంతమంది తమ స్వార్థం కోసం ఉపయోగించి అమాయకులను జైలుపాలు చేసిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. ‘కోర్ట్’ సినిమా చూస్తున్నంతసేపు అలాంటి ఘటనలు గుర్తుకొస్తూనే ఉంటాయి. చిన్న పిల్లల రక్షణ కోసం భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పోక్సో చట్టాన్ని కొంతమంది ఎలా మిస్ యూజ్ చేస్తున్నారు? ఇలాంటి పవర్ఫుల్ చట్టాలలో ఉన్న లొసుగులను పోలీసులతో పాటు ‘లా’ వ్యవస్థ ఎలా వాడుకుంటుంది? పోక్సో చట్టం ఏం చెబుతోంది? అందులో ఉన్న ప్లస్, మైనస్ పాయింట్స్ ఏంటి? తదితర విషయాలను ఈ చిత్రం ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు రామ్ జగదీష్.దర్శకుడు ఎంచుకున్న టాపిక్ చాలా సెన్సిబుల్. ఎక్కడా అసభ్యతకు తావులేకుండా చాలా నీట్‌గా ఆ టాపిక్‌ని చర్చించాడు. ఈ విషయంలో దర్శకుడిని ప్రశంసించాల్సిందే. అయితే కథనం మాత్రం ఊహకందేలా సాగించాడు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతి సీన్ మన ఊహకందేలా సాగుతుంది. స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించాల్సింది. అలాగే లవ్ స్టోరీని కూడా రొటీన్‌గానే చూపించాడు. కుర్రాడిపై పోక్సో కేసు నమోదైన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. బెయిల్ కోసం ప్రయత్నించిన ప్రతిసారి చట్టంలోని లొసుగులు ఉపయోగించి లాయర్ దాము(హర్ష వర్ధన్) అడ్డుపడే విధానం ఆకట్టుకుంటుంది. క్రాస్ ఎగ్జామినేషన్‌లో అవన్నీ అబద్దాలని తేలిపోతాయని తెలిసినా.. తెరపై చూస్తుంటే ఆసక్తికరంగా అనిపిస్తాయి. సెకండాఫ్ మొత్తం కోర్టు వాదనల చుట్టే తిరుగుతుంది. కొన్ని చోట్ల ప్రియదర్శి వాదనలు ఆకట్టుకుంటాయి. చిన్నచిన్న ట్విస్టులు కూడా ఎంటర్టైన్ చేస్తాయి. ఎమోషనల్ సీన్లను బలంగా రాసుకున్నాడు. క్లైమాక్స్‌లో లా వ్యవస్థను ప్రశ్నిస్తూ ప్రియదర్శి చెప్పే సంభాషణలు ఆలోచింపజేస్తాయి. ఎవరెలా చేశారంటే.. ప్రియదర్శి నటన గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి పాత్ర అయినా సరే నేచురల్ యాక్టింగ్‌తో అదరగొట్టేస్తాడు. జూనియర్ లాయర్ సూర్యతేజ పాత్రలో ఒదిగిపోయాడు. కోర్టులో ఆయన వినిపించే వాదనలు ఆకట్టుకుంటాయి. పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన హర్ష రోషన్ ఈ సినిమాలో చందు పాత్ర పోషించి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. జాబిలిగా కొత్తమ్మాయి శ్రీదేవి చక్కగా నటించింది. ఇక ఈ సినిమాలో బాగా పండిన పాత్ర శివాజీది అని చెప్పాలి. తెరపై ఆయన పండించిన విలనిజం సినిమా స్థాయిని పెంచేసింది. సాయి కుమార్, రోహిణి, శుభలేఖ సుధాకర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. విజయ్ బుల్గానిన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలమైంది. పాటలు ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
నాని కాన్ఫిడెన్స్‌కి కారణం ఇదే : ‘కోర్ట్’ డైరెక్టర్
‘కోర్ట్’ కథ నానికి చెప్పడానికి దాదాపు 8 నెలల వెయిట్ చేశాను. ఫైనల్‌గా ఓ రోజు ఆయన నుంచి పిలుపొచ్చింది. దాదాపు రెండున్నర గంటల కథని సింగిల్ సిటింగ్ లో విన్నారు. కథ మొత్తం విని నిల్చుని షేక్ హ్యాండ్ ఇచ్చి 'వెల్కమ్ టు వాల్ పోస్టర్ సినిమా' అన్నారు. అది నా జీవితంలో హై మూమెంట్’ అని అన్నారు డైరెక్టర్ రామ్ జగదీష్. ఆయన ఆయన దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్ చేస్తున్న మూవీ 'కోర్ట్' - స్టేట్ వర్సెస్ ఎ నోబడీ'. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. మార్చి 14న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ జగదీష్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ ఈ కథ ఫోక్సో యాక్ట్ నేపథ్యంలో ఉంటుంది. నిజజీవితంలో ఇలాంటి ఒక కేసుని నేను పరిశీలించాను. ఆ కేసు గురించి తెలుసుకున్నప్పుడు నిజంగా ఇలా కూడా ఉంటుందా అని సందేహంగా అనిపించింది. ఇలాంటి కేసులు ఇంకా చాలా ఉన్నాయని తెలిసింది. ఆ కేసులు అన్నిటి మీద కూడా రీసెర్చ్ చేశాను. ఏపీ తెలంగాణలో వందల కేసులు ఉన్నాయి. ఇవన్నీ స్క్రీన్ మీద అడ్రస్ చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. ఈ కథ కోసం చాలా కేసు ఫైల్స్ చదివాను. అన్ని కేస్ ఫైల్స్ లో ఉన్న మెటీరియల్ తో ఒక మంచి కథ చెప్పొచ్చు కదా అనిపించింది. అవన్నీ ఒక కథగా చేసి స్క్రీన్ పై చూపించడం జరిగింది.⇢ ఇది పర్టికులర్ ఒక పర్సన్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ కి సంబంధించిన కథ కాదు. చాలా సంఘటనల స్ఫూర్తి ఉంది. ఇది కంప్లీట్ గా ఫిక్షనల్ కథ. చదివిన కేసుల ఎసెన్స్ తో ఒక ఫిక్షనల్ స్టోరీ చేయడం జరిగింది.⇢ మనం గతంలో చాలా కోర్ట్ రూమ్ డ్రామాలు చూసాం. కానీ ఒక లవ్ స్టోరీ ని కోర్ట్ రూమ్ డ్రామాగా ఎప్పుడు చూడలేదని భావిస్తున్నాను. ఇందులో లవ్ స్టోరీ, కోర్ట్ రూమ్ డ్రామా చాలా ప్రత్యేకంగా ఉంటాయి.⇢ ఫోక్సో చాలా ముఖ్యమైన ఆక్ట్. నిజానికి ఆ చట్టం గురించి బయట ప్రపంచానికి చాలా తక్కువ తెలుసు. దాని గురించి కొంచెం డీటెయిల్ గా చెప్తే బాగుంటుందని అనిపించింది. అది ఈ సినిమాలో చూస్తారు.⇢ ఈ సినిమాలో అన్ని పాత్రలని ఆడిషన్స్ చేసి తీసుకున్నాం. చందు పాత్ర ప్లే చేయడానికి రోషన్ చాలా తపనపడ్డాడు. సెలెక్ట్ అయిన తర్వాత తను చేసిన ఫాలోఅప్ అద్భుతం. చాలా ఫ్యాషన్ చూపించాడు. చందు పాత్రని త్వరగానే క్లోజ్ చేసాం కానీ జాబిల్లి పాత్ర కోసం చాలా సెర్చ్ చేసాం. ఒక తెలుగు అమ్మాయి కావాలి, కొత్తగా ఉండాలి, సరైన ఏజ్ కావలి, నటన తెలిసి ఉండాలి ఇలాంటి కాంబినేషన్ ఉన్న అమ్మాయి కోసం చూస్తున్నప్పుడు ఒక దశలో దొరకదేమో అనుకున్నాం. అలాంటి సమయంలో నా ఫ్రెండ్ ఒక ఇన్‌స్టా ప్రొఫైల్ పంపించాడు. అందులో రీల్స్ చూస్తున్నప్పుడు ఒక రీల్ లో తను జాబిల్లిలా కనిపించింది. అడిషనల్ చేసాం. ఆ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ యాప్ట్ అయ్యింది, ⇢ ఈ సినిమా ఐడియా మొదటగా ప్రియదర్శికే చెప్పాను. ఆయనకి చెప్పిన తర్వాత ఈ సినిమాని నేనే చేస్తాను. ఇంకా ఎవరికీ చెప్పొద్దు అన్నారు. ఆయనకే చెప్పాను. ఆయనతోనే చేశాను. ప్రియదర్శితో నాకు చాలా క్లోజ్ అసోషియేషన్. చాలా ఫ్రెండ్లీ గా ఉంటాం. తనతో అన్నీ షేర్ చేసుకోగలను.⇢ శివాజీ గారు మంగపతి క్యారెక్టర్ లో కనిపిస్తారు. ప్రతి ఫ్యామిలీలో అలాంటి ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఇలాంటి ఒక సంఘటన జరిగినప్పుడు ప్రతి ఒక్కరు మంగపతి అవుతారు. రియల్ లైఫ్ క్యారెక్టర్ లా ఉంటుంది.⇢ నాని గారు సినిమా చూశారు. అందుకే ఈ చిత్రం కచ్చితంగా హిట్ అవుందని చెబుతున్నాడు. సినిమాపై ఆయనకి ఉన్న కాన్ఫిడెన్స్ అది. ఆయన కాన్ఫిడెన్స్ అంతా సినిమా ఇచ్చిందే. నాని గారు సినిమా చూసి 'ప్రౌడ్ అఫ్ యూ జగదీశ్' అన్నారు. అది నాకు వచ్చిన బెస్ట్ కాంప్లీమెంట్⇢ ఇది కమర్షియల్ సినిమానే. సినిమా చూసి ఒకతను చుక్క రక్తం లేకుండా కమర్షియల్ సినిమా చూపించావ్ అన్నారు. ఆ మాట నాకు చాలా నచ్చింది.ఈ సినిమా మనందరి జీవితం. మనం తెలుసుకోవాల్సిన నిజం. స్క్రీన్ మీద మన జీవితమే ఉంటుంది. మనల్ని మనం తెరపై చూసుకోవడానికి సినిమాకి రావాలని కోరుకుంటున్నాను.