సాక్షి, హైదరాబాద్: ఎం.పి.ప్రకాశ్ స్మారక ఏఐటీఏ టెన్నిస్ టోర్నమెంట్‌లో నగరానికి చెందిన చల్లా హర్షసాయి విజేతగా నిలిచింది. బెంగళూరులో శుక్రవారం జరిగిన అండర్-18 బాలికల ఫైనల్లో ఎనిమిదో సీడ్ హర్షసాయి 2-6, 6-2, 6-3 తేడాతో ఆరో సీడ్ మెహక్ జైన్(మహారాష్ట్ర)పై గెలుపొందింది.
ఆరంభంలో ఆధిపత్యం ప్రదర్శించి తొలి సెట్‌ను గెలుచుకున్న మెహక్‌పై తరువాతి రెండు సెట్లలోనూ హర్షసాయి పైచేయి సాధించింది. రెండో సెట్‌లో తొలిగేమ్‌ను కోల్పోయినా.. ఆ తరువాత వరుసగా నాలుగు గేమ్‌లను హర్షసాయి సొంతం చేసుకుంది. తిరిగి ఎనిమిదో గేమ్‌తోపాటు సెట్‌నూ గెలుచుకుంది. హోరాహోరీగా సాగిన నిర్ణాయక మూడో సెట్‌లోనూ హర్షసాయిదే పైచేయి అయింది.
విజేత హర్షసాయి
Published Sat, Jul 19 2014 12:29 AM | Last Updated on Sat, Sep 2 2017 10:29 AM
Advertisement
Advertisement