సినిమా ప్రకటించిన హర్షసాయి.. నిర్మాతగా బిగ్‌బాస్‌ బ్యూటీ | Harsha Sai And Mitraaw Sharma Movie Teaser To Release On 17th September | Sakshi
Sakshi News home page

Harsha Sai: సినిమా ప్రకటించిన హర్షసాయి.. నిర్మాతలుగా సీఎం బంధువుతో పాటు బిగ్‌బాస్‌ బ్యూటీ

Published Thu, Sep 14 2023 7:28 AM | Last Updated on Thu, Sep 14 2023 10:55 AM

Harsha Sai And Mitraaw Sharma Movie Teaser Released On 17th - Sakshi

'అడగనిదే అమ్మ అయినా అన్నం పెట్టదు అంటారు'.. కానీ ఇతడు మాత్రం ఎవరు కష్టాల్లో ఉన్నారో తెలుసుకుని వారికి తనవంతు సాయం చేస్తుంటాడు. గుడిసెల ముందు నోట్ల కట్టలు గుమ్మరించడం,  తల దాచుకోవడానికి నీడ లేని వారికి ఇల్లు, పిల్లాడికో సైకిల్‌, పేద పిల్లాడి స్కూల్‌ ఫీజులు చెల్లించేందుకు చెక్కులు, బార్బర్‌కు షాప్‌ కట్టించడం.. ఇలా ఎన్నో మంచిపనులు చేశాడు, చేస్తూనే ఉన్నాడు. దీంతో ఆయనకు మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్నారు. 

తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సైతం యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసి లక్షలు సంపాదిస్తున్నారు. యూట్యూబ్‌లో అందరూ డబ్బుల కోసం వీడియోలు చేస్తుంటే ఇతడు మాత్రం డబ్బులు పంచుతూ వీడియోలు చేస్తుండటం విశేషం.  అయితే తాజాగా హర్ష సాయి సినిమాకి సంబంధించిన టీజర్ లాంచ్ ఈ నెల 17వ తేదీన జరగబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమా టీజర్ అనౌన్స్మెంట్ కి సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

ఈ సినిమా విషయంలో పలు ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దగ్గరి బంధువైన కల్వకుంట్ల వంశీధర్ రావు ఈ సినిమాని సమర్పిస్తున్నారు. గతంలో బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి సందడి చేసి ప్రేక్షకుల మనుసుదోచిన  మిత్ర శర్మ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఆమె సొంత బ్యానర్‌ అయిన  శ్రీ పిక్చర్స్ మీద ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.  

హర్షసాయి మొదటి సినిమాతోనే పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల చేస్తున్నట్లు సమచారం. సెప్టెంబర్ 17న ఉదయం 10 గంటలకు ఈ టీజర్ లాంచ్ జరగబోతున్నట్లు మిత్ర శర్మ తన సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. ఈ కార్య్రమం హైదరాబాద్‌లోని  జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. 

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' ఆడుకున్నాడు.. వాళ్లని నిద్ర పోనీయకుండా చేశాడు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement