గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని.. కోనేటి ఆదిమూలం బాధితురాలు పక్క రాష్ట్రంలో మీడియా ముందుకు రావడమే అందుకు నిదర్శనమని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ అన్నారు. ఒక ఆడపడుచును దారుణంగా వేధించిన ఆదిమూలంపై టీడీపీ ప్రభుత్వం కేసులు కూడా పెట్టాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారాయన.
ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంతో చర్యలతో సభ్యసమాజం సిగ్గుతో తలదించుకుంది. ఈ రాష్ట్రంలో ప్రెస్ మీట్ పెడితే న్యాయం జరగదని బాధిత మహిళ భావించింది. చివరకు.. పొరుగు రాష్ట్రానికి వెళ్లి మీడియా ముందుకు వచ్చింది. రాష్ట్రంలో శాంతిభద్రతలకు రక్షణ లేదు. మహిళలకు రక్షణ లేదు.
ఇదీ చదవండి: అలా ఆదిమూలం వేధింపులు రికార్డ్ చేశా: బాధితురాలు
.. అర్ధరాత్రి కూడా కాల్స్ చేస్తూ ఎమ్మెల్యే వేధించాడు. అలాంటి ఎమ్మెల్యేని సస్పెండ్ చేసి వేతులు దులుపుకుంటారా?. అలాంటి వ్యక్తిపై లైంగిక దాడి కేసు ఎందుకు పెట్టలేదు?. హత్య చేయబోయాడని బాధితురాలు చెప్తుంటే హత్యాయత్నం కేసు ఎందుకు నమోదు చేయలేదు?. సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి ఏం చేస్తున్నారు?. మీకు బాధ్యత లేదా?. ఆదిమూలంపై వెంటనే కేసులు నమోదు చేయాలి అని డిమాండ్ చేశారాయన.
అలాగే కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు కాలేజీలో లేడీస్ హాస్టల్‌లో రహస్య కెమెరాలు పెట్టిన ఘటన.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు ఆ కేసు ఏమైంది?. ఆ కేసు పురోగతిని ఎందుకు బయటకు రానివ్వడం లేదు శివశంకర్ నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment