నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడంటూ తనుశ్రీ దత్తా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా అసలు ఆ రోజు ఏం జరిగిందనే విషయాన్ని తనుశ్రీ వెల్లడించారు. 2008 ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా సెట్లో ఓ పాటను షూట్ చేస్తున్నారు. కొన్ని షాట్స్ తీసిన తర్వాత తనుశ్రీ అర్ధంతరంగా షాట్ మధ్యలో వెళ్లిపోయి, కేరవాన్‌లో కూర్చున్నారు. ఆ రోజు సాంగ్ షూటింగ్ సమయంలో నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తనుశ్రీ తెలిపారు. అనంతరం నానా పటేకర్‌కు, తనకు మధ్య గొడవ జరిగిందన్నారు. ఆ వివాదం వల్లే ఆ రోజు తాను షూటింగ్ మధ్య నుంచి వెళ్లి పోయానని తనుశ్రీ పేర్కొన్నారు.