
నానా పటేకర్‌కు మద్దతు తెలిపిన రాఖీ సావంత్
నానా పటేకర్ తనను లైంగికంగా వేధించడంటూ ఆరోపణలు చేసిన తనుశ్రీ దత్తాకి పలువురు బాలీవుడ్ ప్రముఖులు మద్దతు తెలుపుతుండగా.. వివాదాస్ప నటి రాఖీ సావంత్ మాత్రం తనదైన శైలిలో స్పందించారు. కేవలం ప్రచారం కోసమే తనుశ్రీ ఇలా చేస్తోందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంలో ఆమె నానా పటేకర్‌కు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు.
ఈ విషయం గురించి రాఖీ సావంత్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నానా పటేకర్ లాంటి గొప్ప నటుడ్ని తనుశ్రీ దత్తా తన వ్యాఖ్యలతో అవమానపరుస్తోంది. తనుశ్రీ ఇంగ్లీష్‌లో మాట్లడటం వల్లే మీడియా ఆమె మాటలకు ఇంత ప్రాముఖ్యతనిస్తుంది. నానా పటేకర్ చాలా మంచి వ్యక్తి’ అంటూ రాఖీ సావంత్ వ్యాఖ్యానించారు. తనుశ్రీ చేసిన ఆరోపణలు నిజమైతే తన ముందుకు వచ్చి మాట్లాడలంటూ రాఖీ సావంత్ సవాల్ విసిరారు.
2009లో వచ్చిన ‘హార్న్ ఒకే ప్లీజ్’ సినిమా చిత్రీకరణ సమయంలో నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తనుశ్రీ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ఓ ఐటమ్ సాంగ్‌లో తనుశ్రీ దత్తాకి బదులు రాఖీ సావంత్‌ను తీసుకున్నారు. దాంతో రాఖీ సావంత్ వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.