
సినీ పరిశ్రమలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులపై ఇటీవల కాలంలో కొందరు నటీమణులు బహిరంగంగా నోరు విప్పుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ బ్యూటీ తనుశ్రీ దత్తా (‘వీరభద్ర’ సినిమా ఫేమ్) కూడా తనకు ఎదురైన సమస్యల గురించి గళం విప్పారు. ‘హార్న్ ఓకే ప్లీజ్’ చిత్రీకరణ సమయంలో నటుడు నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడంటూ ఆమె ఆరోపించారు. అయితే ఈ విషయంపై స్పందించాల్సిందిగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌ను కోరిన ఓ జర్నలిస్టుకు విచిత్రమైన సమాధానం లభించింది.
అసలేం జరిగిందంటే..
ఆమిర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, కైత్రినా కైఫ్, ఫాతిమా సనా షైక్ ప్రధాన పాత్రల్లో నటించిన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమా ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో సినిమా యూనిట్ చిట్‌చాట్ నిర్వహించింది. ఇందులో భాగంగా తనుశ్రీ ఆరోపణలు, ఇండస్ట్రీలో నటీమణులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మీరేం చెబుతారంటూ అంకుర్ పాఠక్ అనే జర్నలిస్టు అమితాబ్‌ను ప్రశ్నించారు.
‘నేను తనుశ్రీని కాదు, నానా పటేకర్‌ను అంతకన్నా కాదు. కాబట్టి ఈ విషయంపై నేనెలా కామెంట్ చేయగలను’ అంటూ బిగ్ బీ సమాధానమిచ్చారు. అమితాబ్ నుంచి ఊహించని సమాధానం రావడంతో... ‘ తోటి కళాకారులకు సంఘీభావం తెలిపే విధానం ఇదే. ఈవిధంగా మాట్లాడి భారత సూపర్ స్టార్ మనల్ని సగర్వంగా తలెత్తుకునేలా చేశారంటూ’ అంకుర్ వ్యంగంగా ట్వీట్ చేశారు. కాగా ఎంతో హుందాగా వ్యవహరించాల్సిన బిగ్ బీ ఇలా బాధ్యతారహితంగా మాట్లాడటం సరికాదని.. కథువా ఘటన సమయంలోనూ ఆయన ఇలాగే మాట్లాడారని నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
At #ThugsOfHindostan presser, when asked about Tanushree Dutta, Amitabh Bachchan said, "Neither am I Tanushree, not am I Nana Patekar, so how can I comment on this?" Wayyy to show solidarity for your colleagues, Bollywood. This country's superstars make us so proud.
— Ankur Pathak (@aktalkies) September 27, 2018
Comments
Please login to add a commentAdd a comment