కనిపించని నాలుగోసింహాన్ని వదిలేస్తే పోలీస్ పవర్‌కి ప్రతీకగా మూడు సింహాలు కనిపిస్తుంటాయి. అయితే సమాజానికి కాపు కాసే పవర్ పోలీసు వ్యవస్థ ఒక్కటేకాదు. ఇంకొకటి కూడా ఉంది. అదే.. ‘చట్టం–న్యాయం’ అనే వ్యవస్థ. ఇప్పుడీ రెండు వ్యవస్థలకీ కలిపి ‘మాస్టర్ క్లాస్’ ఒకటి ఇవ్వాలని నటి తనుశ్రీ దత్తా ఓ సూచన చేస్తున్నారు! దేని మీద అంటే.. వేధింపుల మీద. మహిళలు.. పురుషుల నుంచి ఎదుర్కొనే వేధింపుల మీద. ‘‘బాధితురాలు కేసు పెడుతుంది. సాక్ష్యాధారాలు ఉంటాయి. అయినప్పటికీ వేధింపును ఈ రెండు వ్యవస్థలూ సీరియస్‌గా తీసుకోవు.
‘అదేం హింస కాదు కదా, అదేం దౌర్జన్యం కాదు కదా, అదేం లైంగిక దాడి కాదు కదా’ అంటాయి తప్ప, ఆ మూడింటితో సహ సంబంధం ఉన్న నేరంగా వేధింపును పరిగణించవు. దాంతో బాధితురాలికి న్యాయం జరగడం కష్టం అవుతుంది. అందుకే వేధింపును కూడా తీవ్రమైన నేరంగా పరిగణించాలి’’ అని తనుశ్రీ అంటున్నారు. రెండు వ్యవస్థల్నీ ఒకచోట కూర్చోబెట్టి ఎవరి తరఫునుంచి వారు కాకుండా, బాధితురాలి వైపునుంచి ‘వేధింపు’ను సాక్ష్యాధారాలతో కలిపి చూసి దాని తీవ్రతను నిర్ణయించేలా సమన్వయం కల్పించాలని తనుశ్రీ కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment