
ఆసిన్‌కి గత ఏడాది అక్టోబర్ 24న కూతురు పుట్టింది. భర్త రాహుల్ శర్మతో కలిసి ఆ తీపి కబురుని ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫ్యాన్స్‌తో పంచుకున్నారు ఆసిన్. అయితే కూతురు ఫొటో మాత్రం చూపించలేదు. ఆసిన్ పుట్టిన రోజు అక్టోబర్ 26. ఆ రోజుకి సరిగ్గా రెండు రోజుల ముందు ఆసిన్ తల్లి అయ్యారు. అందుకే, ‘నా జీవితంలోనే ఇది నా బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్’ అని కూతురు గురించి చెప్పుకున్నారు ఆసిన్. మూణ్ణెలలు గడిచాయి. ఆసిన్ కూతురు ఎలా ఉంటుందో చూడాలన్న కుతూహలం ఫ్యాన్స్‌లో ఉండిపోయింది కానీ, వారి ఆశ నెరవేరలేదు.
చివరికి నిన్న.. తల్లి ఇన్‌స్టాగ్రామ్‌లో కూతురు ప్రత్యక్షం అయింది. అయితే పూర్తిగా కాదు. అలాగని అసంపూర్తిగానూ కాదు. ఆర్టిస్టిక్‌గా. బొటనవేలికి వజ్రాల ఉంగరం తొడిగిన పాపాయి బుజ్జి పాదం ఒక్కటే ఆసిన్ పోస్ట్ చేశారు. ‘ఇప్పుడు మేం ముగ్గురం. అంతకు మించి ఏమీ అడక్కండి’ అని ఆ పోస్టుకి కామెంట్ పెట్టారు ఈ మాతృమూర్తి. ఆసిన్ కేరళ అమ్మాయి. ప్రస్తుతం ముంబైలోని తన సొంత ఇంట్లో ఉంటున్నారు. సినిమాలు దాదాపుగా మానేశారు. ఏడు భాషలను అనర్గళంగా మాట్లాడగలిగే ఆసిన్ ఇప్పుడు పాపాయే లోకంగా, ఆ పసిదానికి అర్థమయ్యే భాషను ప్రాక్టీస్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment