ఆ ఉంగరం ఆరు కోట్లు | asin, rahul sharma wedding ring costs 6 crore | Sakshi
Sakshi News home page

ఆ ఉంగరం ఆరు కోట్లు

Dec 31 2015 1:59 PM | Updated on Sep 3 2017 2:53 PM

ఆ ఉంగరం ఆరు కోట్లు

ఆ ఉంగరం ఆరు కోట్లు

సౌత్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తరువాత బాలీవుడ్లో సత్తా చాటిన అసిన్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. ఇటీవల నిశ్చితార్ధం చేసుకున్న అసిన్ కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా...

సౌత్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తరువాత బాలీవుడ్లో సత్తా చాటిన అసిన్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. ఇటీవల నిశ్చితార్ధం చేసుకున్న అసిన్ కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటోంది. అయితే వెండితెరకు దూరమైనా, ఏదో ఒక విధంగా వార్తల్లో కనిపిస్తూనే ఉంది. ముఖ్యంగా రాహుల్ శర్మతో ప్రేమ, తరువాత త్వరలోనే పెళ్లి అంటూ వార్తలు వినిపించటం, వెంటనే నిశ్చితార్థం ఇలా వరుసగా అసిన్ పేరు బాలీవుడ్లో మారు మోగింది.

తాజాగా మరోసారి అసిన్ పెళ్లి తెర మీదకు వచ్చింది. డిసెంబర్ 27న తన పుట్టిన రోజు సందర్భంగా సల్మాన్ ఇచ్చిన పార్టీకి తనకు కాబోయే భర్తతో కలిసి హాజరైంది అసిన్. ఈ ఫంక్షన్లో అసిన్ చేతికి ఉన్న నిశ్చితార్ధపు ఉంగరం అందరి దృష్టిని ఆకర్షించింది. బాలీవుడ్ టాప్ స్టార్స్ ను కూడా ఆకర్షించేంత గొప్పదనం ఆ ఉంగరంలో ఏముంది అనుకుంటున్నారా..? అది మూములు బంగారు ఉంగరం కాదు.. భారీ వజ్రం పొదిగిన ఉంగరం. దాని విలువ కూడా 6 కోట్ల పై మాటేనట. అందుకే ప్రస్తుతం అసిన్ ఉంగరం కూడా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement