మంచి పాత్రలకే మొగ్గు
వంద కోట్ల ప్రాజెక్టులతో బాలీవుడ్ నటి అసిన్ విసిగిపోయింది. ప్రాధాన్యం కలిగిన పాత్రలు చేసేం దుకే మొగ్గు చూపుతానంది. ఆరేళ్ల తన కెరీర్‌లో ఆమిర్‌ఖాన్, అజయ్ దేవ్‌గణ్, అక్షయ్‌కుమార్, సల్మాన్‌ఖాన్ తదితర ప్రముఖ నటులతో అసిన్ నటించింది. 2012లో విడుదలైన ఖిలాడీ-786లో చివరిసారిగా కనిపించింది. ‘బాలీవుడ్‌లో కొనసాగడం నాకు ఎంతో ఆనందం కలిగిస్తోంది. అందువల్ల అదృష్టవంతురాలినేనని అనుకుంటున్నా. కొద్దిసమయంలోనే గొప్ప గొప్ప నటుల సరసన నటించా. ఆ సినిమాలు కూడా బాగా ఆడాయి. బాగా వసూళ్లు కూడా చేశాయి. ఒక్కోసారి బాక్సాఫీసు రికార్డులను కూడా బద్దలుకొట్టాయి. అయితే ఇటువంటి సినిమాలతో విసిగిపోయా.
ఇకపై పాత్రకు విస్త్రత ప్రాధాన్యమున్న సినిమాల్లో మాత్రమే నటించాలని నిర్ణయించుకున్నా. కేవలం తెరపై కనిపించాలనే తపనతో మాత్రం సినిమాలు చేయను’ అని తెలిపింది. ప్రస్తుతం అభిషేక్ బచ్చన్‌తో కలిసి ‘ఆల్ ఈజ్ వెల్’ అనే సినిమాలో అసిన్ నటిస్తోంది. గతంలో విడుదలైన ఓఎంజీ-ఓ మై గాడ్ సినిమాకు దర్శకత్వం వహించిన ఉమేశ్ శుక్లాయే ఈ సినిమాకు కూడా దర్శకుడు. ‘ఉమేశ్ అంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన ఫ్యాన్‌ని. ఓఎంజీ-ఓ మై గాడ్ సినిమా చూసిన తర్వాత ఉమేశ్‌తో కలసి పనిచేయడం ఎంతో ఆనందం కలిగిస్తోంది’ అంది. కాగా చిన్న వయసులోనే అసిన్ మలయాళ చిత్రరంగంలోకి అడుగు పెట్టింది. తెలుగు, తమిళ సినిమాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.