
సిఫార్సు చేయరూ
బాలీవుడ్‌కు అసిన్ అంటే ముఖం మొత్తిందా? ఐదేళ్ల క్రితం ఈ బ్యూటీ బాలీవుడ్ రంగప్రవేశం చేసింది. తొలి చిత్రం అమీర్‌ఖాన్ తో నటించే అవకాశం రావడం ఆ చిత్రం (గజని) అక్కడ బంపర్ హిట్ కావడంతో ఆసిన్ గాలిలో మేడలు కట్టేస్తూ భవిష్యత్తును ఊహించేసుకుంది. ఈమలయాళ కుట్టి ఊహించినట్లుగానే మరో స్టార్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో లండన్ డ్రీమ్స్, రెడీ చిత్రాల్లో నటించే అవకాశాలు వరించాయి. వీటిలో లండన్ డ్రీమ్స్ ఆశించిన విజయం సాధించకపోయినా ఆపై కూడా హౌస్‌ఫుల్-2, బోల్‌బచ్చన్ బోల్, కిల్లాడి 786 వంటి పలు చిత్రాలు అసిన్‌ను వరించాయి.
దీంతో భవిష్యత్ బ్రహ్మాండంగా ఉండబోతుందని కలలు కన్న అసిన్‌కు అనూహ్యంగా అవకాశాలు తగ్గిపోయాయి. 2012, 2013లో అసిన్ నటించిన చిత్రమేదీ విడుదల కాలేదంటే ఆమె పరిస్థితి ఏమిటన్నది అర్థం అవుతోంది. ఎట్టకేలకు ఇటీవల ఆల్ ఈజ్ వెల్ అనే ఒక చిత్రం అవకాశాన్ని రాబట్టుకోగలిగింది. ఈ చిత్రం మినహా వేరే అవకాశం లేకపోవడంతో మళ్లీ కోలీవుడ్‌పై దృష్టి సారించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆ మధ్య దక్షిణాది చిత్రాల అవకాశాలను తిరస్కరించడంతో ఇక్కడి నిర్మాతలు ఈ అమ్మడిని పట్టిం చుకోవడం లేదని సినీ వర్గాల టాక్. అయితే తనకు పరిచయమైన హీరోలకు వాట్స్‌యాప్‌లో మెసేజ్‌లు పంపుతూ సిఫార్సు చేయమని కోరుతోందట. మరి ఈ మలయాళ కుట్టి మొర ఏ నటుడు ఆలకిస్తారో వేచి చూడాల్సిందే.