పక్కన పెట్టేశారా?
పేరున్నప్పుడే అవకాశాలైనా, గౌరవమైనా కాస్త మార్కెట్ తగ్గితే హలో అని కూడా పలకరించే నాథుడుండడు. అది ఎవరైనా సరే.
పేరున్నప్పుడే అవకాశాలైనా, గౌరవమైనా కాస్త మార్కెట్ తగ్గితే హలో అని కూడా పలకరించే నాథుడుండడు. అది ఎవరైనా సరే. దటీజ్ సినిమా పరిశ్రమ. నటి అసిన్ పరిస్థితి దాదాపు ఇంతేనంటున్నాయి సినీ వర్గాలు. ఈ కేరళ కుట్టి టాలీవుడ్, కోలీవుడ్‌లలో ఒకప్పుడు క్రేజీ హీరోయిన్‌గా వెలిగారు. గజని చిత్రం బాలీవుడ్‌కు పరిచయం చేసింది ఆ చిత్రం హిందీలోనూ రికార్డులు బద్దలు కొట్టడంతో ఆసిన్‌కు బాగానే క్రేజ్ పెరిగింది. అయితే అది రెండుమూడు చిత్రాలకే పరిమితం కావడం విశేషం. అమీర్‌ఖాన్, సల్మాన్‌ఖాన్ లాంటి స్టార్ హీరోల సరసన డ్యూయెట్లు పాడిన ఈ ముద్దుగుమ్మకు ఆ తరువాత అవకాశాలు ముఖం చాటేశాయి. మధ్యలో కోలీవుడ్ అవకాశాలు ఇచ్చినా అసిన్ బెట్టు చేశారు. ప్రస్తుతం హిందీలో ఆల్ ఈజ్ వెల్ అనే చిత్రం మాత్రమే ఈ బ్యూటీ చేతిలో వుంది.
ఇంతకుముందు దక్షిణాది భామలను హీరోయిన్లుగా ఎంపిక చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిన బాలీవుడ్ దర్శక, హీరోలు ఇటీవల బాలీవుడ్ భామలపైనే మోజు పడుతున్నారు. దీపిక పడుకునే, కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా వంటి వారు బాగా పాపులర్ కావడమే ఇందుకు కారణం. ఇది బాలీవుడ్‌ను నమ్మి వెళ్లిన దక్షిణాది హీరోయిన్లకు నిరాశను మిగిల్చింది. ఆ మేరకు బాలీవుడ్‌పై కన్నేసిన కాజల్ అగర్వాల్, తమన్నా వంటి దక్షిణాది ముద్దుగుమ్మలు తాజాగా గోడకు కొట్టిన బంతిలా తిరుగుముఖం పట్టడం చూస్తే బాలీవుడ్‌లో వారికి ఎదురైన పరిస్థితి అర్థం అవుతుంది. అసిన్ పరిస్థితి అలాగే తయారైంది. ఈ అమ్మడిని బాలీవుడ్ పక్కన పెట్టేసింది. అయితే దక్షిణాదిలోనూ అవకాశాలు రాకపోవడంతో ముంబయిలోనే ఉంటూ యాడ్స్‌పై దృష్టి సారిస్తున్నారు.