
అసిన్ పెళ్లికి చిక్కులున్నాయా?
చెన్నై : ప్రముఖ హీరోయిన్ అసిన్ వివాహం నిర్ణయించిన తేదీ (నవంబర్ 26)న జరగదా? ఇలాంటి పలు సందేహాలకు ఆస్కారం కలిగేలా అసిన్ వ్యాఖ్యలు దొర్లుతుండడం గమనార్హం. ఈ కేరళా కుట్టి మరోసారి వార్తల్లోకెక్కింది. ఒకప్పుడు తమిళం, తెలుగు భాషల్లో ప్రముఖ హీరోయిన్‌గా ఏలిన నటి అసిన్. గజని చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి అక్కడ ప్రాచుర్యం పొందారు. అలా ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయకుమార్ ద్వారా పరిచయమయిన మైక్రోమాక్స్ సంస్థ అధినేత రాహుల్‌శర్మను మోహితుడ్ని చేసుకుని ఆయనతో ఏడడుగులు నడవడానికి రెడీ అయ్యింది.
ఈ విషయాన్ని చాలా కాలం రహస్యంగా ఉంచిన అసిన్ ఇటీవలే బహిర్గతం చేశారు. అంతేకాదు పనిలోపనిగా నవంబర్ 26న పెళ్లి అంటూ ముహూర్తం తేదీని కూడా వెల్లడించేశారు .అలాంటిది ఇప్పుడు పిల్లి మొగ్గలేస్తోంది. కారణం ఆమె పెళ్లికి చట్టపరమైన చిక్కులు ఏర్పడే అవకావం ఉందని భావించడమే నని సమాచారం. అసిన్ పెళ్లికి సిద్ధమవ్వడంతో సినీ అవకాశాలను వదిలేశారు. అయితే ఆమె అప్పటి వరకూ అంగీకరించిన వాణిజ్య ప్రకటనల ఒప్పందాలు ఈ ఏడాది చివరి వరకూ ఉన్నాయి.
దీంతో ఆయా సంస్థల యాజమాన్యం అసిన్ పెళ్లి వార్త విని అసంతృప్తిని వెల్లడించాయి. ఈనేపథ్యంలోనే పెళ్లికి చిక్కులు ఏర్పడే అవకాశం ఉందని భావించి ప్లేట్ పిరాయించిందని టాక్. అసిన్ తాజాగా ఒక పత్రికకు ఇచ్చిన భేటీలో తన పెళ్లి ప్రచారం ఒక జోక్ అని ఆ ప్రచారంలో నిజం లేదని పేర్కొనడం చూసిన వారు ఔరా అసిన్ అనుకోకుండా ఉండలేక పోతున్నారు. ఏమైనా అసిన్ నటి కదా ఇలా కూడా తన చాతుర్యాన్ని చూపిస్తున్నారన్న మాట.