రెండు సంప్రదాయాల్లో అసిన్ పెళ్లి | Asin to wed as per Hindu and Christian rituals | Sakshi
Sakshi News home page

రెండు సంప్రదాయాల్లో అసిన్ పెళ్లి

Published Wed, Jan 13 2016 2:38 AM | Last Updated on Sun, Sep 3 2017 3:33 PM

రెండు సంప్రదాయాల్లో  అసిన్ పెళ్లి

రెండు సంప్రదాయాల్లో అసిన్ పెళ్లి

రెండు సంప్రదాయాల్లో పెళ్లి చేసుకునేందుకు నటి అసిన్ సిద్ధమవుతున్నారు. ఇంతకు ముందు దక్షిణాదిని ఏలి ఆ తరువాత బాలీవుడ్‌లో మకామ్ పెట్టిన నటి అసిన్ అన్న విషయం తెలిసిందే. ఈ మలయాళీ కుట్టి ముంబైకి చెందిన మైక్రోమాక్స్ సంస్థ అధినేత రాహుల్‌శర్మను ప్రేమ ముగ్గులోకి దించి ఆయన్నే పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే.
 
 ఈ ప్రేమ జంట పెళ్లి తేదీ నిర్ణయమైంది. రాహుల్,అసిన్‌ల వివాహ తంతు రెండు రోజులు, రెండు మత సంప్రదాయ పద్ధతుల్లో జరగనుండడం విశేషం. హిందు, క్రిస్టియన్ సంప్రదాయాల్లో వారు వివాహం చేసుకోనున్నారు. అసిన్,రాహుల్ పెళ్లి వేడుక ఈ నెల 19న ఢిల్లీలో మెహిందితో శ్రీకారం చుట్టుకోనుంది. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటు వంద మంది అతిథులు మాత్రమే పాల్గొననున్నారట.
 
  20వ తేదీన హిందు, క్రిస్టియన్ మత సంప్రదాయాల ప్రకారం వివాహ వేడుకను నిర్వహించనున్నారు.ఇక 23వ తేదీన ముంబైలో అసిన్, రాహుల్ శర్మల వివాహ రిసెప్షన్‌ను జరుగ నుంది. ఈ వేడుకకు 250 మంది సినీ ప్రముఖలనే ఆహ్వానించడం గమనార్హం. అసిన్, రాహుల్ శర్మల ప్రేమకు వారధి బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్‌కుమార్ అన్న విషయాన్ని ఇంతకు ముందు అసినే స్వయంగా వెల్లడించిన విషయం విదితమే. అందువల్ల వివాహ ఆహ్వాన పత్రికను అసిన్ ముందుగా నటుడు అక్షయ్‌కుమార్‌కే అందించారట. ఆయన అసిన్ వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని శుభాశీస్సులు అందించారట.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement