‘పుష్ప’ కోసం బన్ని డెడికేషన్‌, మేకప్‌కు అంత సమయమా..! | Allu Arjun Spends More Than 3 Hours For Makeup In Pushpa Movie | Sakshi
Sakshi News home page

Allu Arjun: ‘పుష్ప’ కోసం బన్ని డెడికేషన్‌, మేకప్‌కు అంత సమయమా..!

Published Tue, Aug 24 2021 3:41 PM | Last Updated on Mon, Sep 20 2021 12:26 PM

Allu Arjun Spends More Than 3 Hours For Makeup In Pushpa Movie - Sakshi

Allu Arjun Pushpa Movie: పాత్ర‌ల‌తో ప్ర‌యోగాలు చేసే నటులలో క‌మ‌ల్ హాస‌న్, విక్ర‌మ్ చియాన్‌లు ముందుంటారు. వారి పాత్రలతో ప్రేక్షకులను అలరించేందుకు ఎంత క‌ష్టమైన ఇష్టంగా చేస్తారు. అందుకే ఎప్పుడూ వారు వైవిధ్యమైన కథలతో డిఫరెంట్‌లుక్‌తో ఆశ్చర్యపరుస్తుంటారు. అంతగా సినీ పరిశ్రమలో కమల్‌, విక్రమ్‌లు విలక్షణ నటులుగా పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఈ జాబితాలోకి ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా చేరాడు. ప్రస్తుతం అల్లు అర్జున్‌ పాన్‌ ఇండియా చిత్ర ‘పుష్ప’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగనుంది.

చదవండి: హీరోయిన్‌ మీరా జాస్మిన్‌ ఇప్పుడెలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా?

ఇందులో స్టైలిష్‌ స్టార్‌ మునుపెన్నడు చూడని విధంగా మాస్‌ లుక్‌తో అలరించబోతున్నాడని ఇప్పటికే విడుదలైన ఆయన ఫస్ట్‌లుక్‌ చూస్తే తెలుస్తోంది. ఊరమాస్‌గా భయంకరమైన స్మగ్లర్‌ పుష్పరాజుగా నటించబోతున్నాడు. అయితే ఇందులో తన లుక్‌ కోసం బన్ని బాగానే కష్టపడుతున్నాడట. స్టైలిష్‌గా లవర్‌ బాయ్‌లా ఉండే బన్ని ఈ మూవీలో పుష్ప రాజులా కనిపించడానికి తనని తాను మేకోవర్‌ చేసుకుంటున్నాడు. రోజు సెట్‌లో మేకప్‌కు వేసుకోవడానికి, తీయడానికి 3 గంటల పైనే సమయం కేటాయిస్తున్నాడట. రింగులజుట్టు, గడ్డంతో వీరమాస్‌ లుక్‌లో టాన్ టచ్ అప్‌లు చేయించుకుంటున్నాడు. ఈ మూవీలో అల్లు అర్జున్ మేకప్ వేయడానికి రెండు గంటలు, ఆ మేకప్‌ను తొలగించడానికి గంటకు పైనే సమయం పడుతుందా.

ఆయ‌న డెడికేష‌న్‌ను చూసి డైరెక్టర్‌తో పాటు సెట్‌లోని మిగతా బృందం ఫిదా అవుతున్నారట. అంతేగాక ప్రతిరోజు మేకప్‌ విషయంలో ఆయన ఓపిక చూసి వారంత ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారట. ఇది తెలిసి ఐకాన్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ సర్‌ప్రైజ్‌ అవుతున్నారు. కాగా ‘పుష్ప’ పార్ట్ వ‌న్ క్రిస్మస్ రోజు విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే కమల్‌ హాసన్‌ హాస‌న్ .. భార‌తీయుడు సినిమాలో సేనాప‌తి లుక్ కోసం 4 గంట‌లు మేక‌ప్ వేసుకునే వాళ్లు. ఇక ద‌శావ‌తారం సినిమా కోసం ఎంత‌గా క‌ష్ట‌ప‌డ్డారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. విశ్వరూపం వేషధారణకి సంబంధించిన మేకప్‌కు ఎక్కువ శ్రమించాడు. ఇక ఐ సినిమాలో విక్రమ్‌ తన లుక్‌కు బాగానే శ్రమించాడు. దీనికి ఆ సినిమాలో ఆయన లుక్‌యే ఉదాహరణ. 

చదవండి: చిరంజీవి బర్త్‌డే వేడుకలో కనిపించని అల్లు అర్జున్‌, ఏమైంది..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement