
Allu Arjun Reveals Interesting Facts About Makeup of Pushpa Raj Getup: అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'పుష్ప' మూవీ ఫస్ట్ పార్ట్ డిసెంబర్17న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వరుస ప్రమోషన్లతో మూవీ టీం ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అల్లు అర్జున్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. పుష్ప కోసం చాలా కష్టపడ్డామని, అటవీ ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పారు.
ఇక పుష్పరాజ్ పాత్ర కోసం కేవలం మేకప్‌కే రెండున్నర గంటల సమయం పట్టిందని, అది తీసేయడానికి మరో 30 నిమిషాల సమయం పట్టిందని తెలిపాడు. ఇప్పటివరకు తన కెరీర్‌లో ఇంతటి మేకప్ అవసరం రాలేదని, చాలా మినిమల్ మేకపే వాడామని చెప్పుకొచ్చాడు. కాగా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటించింది.