అత్యంత సంపన్న మేకప్‌ ఆర్టిస్ట్‌..ఎంత చార్జ్‌ చేస్తాడంటే..? | India's Richest Make Up Artist Mickey Contractor, His Fee Is? | Sakshi
Sakshi News home page

అత్యంత సంపన్న మేకప్‌ ఆర్టిస్ట్‌..ఎంత చార్జ్‌ చేస్తాడంటే..?

Published Wed, Sep 18 2024 1:32 PM | Last Updated on Wed, Sep 18 2024 2:35 PM

India's Richest Make Up Artist Mickey Contractor, His Fee Is?

బాలీవుడ్‌ ప్రముఖులకు, సెలబ్రిటీలకు మేకప్‌ వేసే ఆర్టిస్టులుంటారు. వారిలో కొందరూ చాలా ఫేమస్‌ అవ్వడమే గాక. వాళ్ల ఆర్ట్‌తో తమ కంటూ సుస్థిరమైన స్థానాన్ని దక్కించుకుంటారు. ఎంతలా అంటే ప్రముఖులకు మేకప్‌ వేసే ఆర్టిస్ట్‌లుగా పేరు తెచ్చుకుంటారు. పైగా వాళ్ల ఫీజు కూడా కళ్లు చెదిరే రేంజ్‌లో ఉంటుంది. చెప్పాలంటే వాళ్లు ఈ స్థాయికి వచ్చేందుకు ఎన్ని కష్టాలు ఫేస్‌ చేసి ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. అలా కష్టాలు పడి సెలబ్రిటీలు ఇష్టపడే మేకప్‌ ఆర్టిస్ట్‌గా క్రేజ్‌గా తెచ్చకున్నాడో వ్యక్తి.  అతడెవరంటే..

అతడి పేరే మిక్కీ కాంట్రాక్టర్‌. అతడి ప్రస్థానం ముంబైలోని టోక్యో బ్యూటీ పార్లర్‌లో హెయిర్‌ డ్రెస్సర్‌గా మొదలయ్యింది. బాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీని ఏలుతున్న రాణి హెలెన్‌  మిక్కీ ముందుఖ/ వచ్చి నిలబడింది. ఆ రోజుల్లో ఆమె పెద్ద స్టార్‌ అందువల్ల ఏ ఇతర ఉద్యోగికి ఆమె విగ్గు తీసే అధికారం లేదు. అందువల్ల మిక్కీ ఆ సాహసం చేయలేక ఆమె అనుమతికై వేచి చూస్తున్నాడు. 

అప్పుడు ఆమెతో మాట్లాడుతూ..తన సినిమాలకు హెయిర్‌ డ్రెస్సర్‌గా ఉంటానని మిక్కీ అడిగాడు. అందుకు హెలెన్‌ సినీ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటే మేకప్‌ ఆర్టిస్ట్‌గా రమ్మని సలహ ఇచ్చింది. అదే బెస్ట్‌ అని మిక్కీకి హెలెన్‌ సూచించింది. అలా హెయిర్‌ డ్రెస్సర్‌ కాస్తా మేకప్‌ మ్యాన్‌గా బ్రెష్‌ పట్టుకుని ముఖానికి మెరుగులు దిద్దడం ప్రారంభించాడు. తన కలను నెరవేర్చుకునేందుకు, సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కోసం ఎంతో ‍ప్రయాసపడ్డాడు. చేయని ఉద్యోగం లేదు. అయితే కష్టపడి ఏదోరకంగా సినీ ఇండస్ట్రీలో మేకప్‌ మ్యాన్‌గా అవకాశం వచ్చినా..అది కేవలం సినిమాలో మిగతా తారాగణానికే వేయాల్సి వచ్చేది. 

సినిమాలో నటించే మెయిన్‌ హీరోయిన్‌కి వేసే అవకాశం దక్కేదే కాదు. ఆ అవకాశం ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎంతో ఎదురుచూపులు చూడాల్సి వచ్చేది. చివరికి 1992లో కాజోల్‌తో ‘బేఖుడి’ సినిమాతో మిక్కీకి మంచి బ్రేక్‌ వచ్చింది. అలా వెనుదిరిగి చూసుకోకుండా..హమ్ అప్కే హై కౌన్, దిల్ తో పాగల్ హై, కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషీ కభీ ఘమ్, కల్ హో నా హో, మొహబత్తెయిన్, మై నేమ్ ఈజ్ ఖాన్, కార్తీక్ కాలింగ్ కార్తీక్, డాన్, వీరే ది వెడ్డింగ్, వంటి చిత్రాలకు మేకప్‌ మ్యాన్‌గా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. 

నీతా అంబానీ, ఇషా అంబానీ, టాలీవుడ్‌ హీరోయిన్‌  శ్రీదేవి, కరీనా కపూర్‌, అలియా భట్‌, అనన్యపాండే వంటి ప్రముఖులకు మేకప్‌ వేసేది మిక్కీనే. చెప్పాలంటే సెలబ్రిటీల మేకప్‌ ఆర్టిస్ట్‌గా పేరుతెచ్చుకున్నాడు. అతను మేకప్‌ వేయడానికి ఒకరోజుకి 75,000 నుండి రూ. లక్ష వరకు ఫీజు ఛార్జ్‌ చేస్తాడు. అంతేగాదు మిక్కీ భారతదేశంలోని అత్యంత సంపన్నమైన మేకప్‌ ఆర్టిస్ట్‌లో ఒకరు కూడా.

(చదవండి: వెయిట్‌ లాస్‌ స్టోరీ: ఐస్‌క్రీం తింటూ 16 కిలోలు..!)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement