make up man
-
అత్యంత సంపన్న మేకప్ ఆర్టిస్ట్..ఎంత చార్జ్ చేస్తాడంటే..?
బాలీవుడ్ ప్రముఖులకు, సెలబ్రిటీలకు మేకప్ వేసే ఆర్టిస్టులుంటారు. వారిలో కొందరూ చాలా ఫేమస్ అవ్వడమే గాక. వాళ్ల ఆర్ట్‌తో తమ కంటూ సుస్థిరమైన స్థానాన్ని దక్కించుకుంటారు. ఎంతలా అంటే ప్రముఖులకు మేకప్ వేసే ఆర్టిస్ట్‌లుగా పేరు తెచ్చుకుంటారు. పైగా వాళ్ల ఫీజు కూడా కళ్లు చెదిరే రేంజ్లో ఉంటుంది. చెప్పాలంటే వాళ్లు ఈ స్థాయికి వచ్చేందుకు ఎన్ని కష్టాలు ఫేస్ చేసి ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. అలా కష్టాలు పడి సెలబ్రిటీలు ఇష్టపడే మేకప్ ఆర్టిస్ట్‌గా క్రేజ్‌గా తెచ్చకున్నాడో వ్యక్తి. అతడెవరంటే..అతడి పేరే మిక్కీ కాంట్రాక్టర్. అతడి ప్రస్థానం ముంబైలోని టోక్యో బ్యూటీ పార్లర్లో హెయిర్ డ్రెస్సర్‌గా మొదలయ్యింది. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీని ఏలుతున్న రాణి హెలెన్ మిక్కీ ముందుఖ/ వచ్చి నిలబడింది. ఆ రోజుల్లో ఆమె పెద్ద స్టార్ అందువల్ల ఏ ఇతర ఉద్యోగికి ఆమె విగ్గు తీసే అధికారం లేదు. అందువల్ల మిక్కీ ఆ సాహసం చేయలేక ఆమె అనుమతికై వేచి చూస్తున్నాడు. అప్పుడు ఆమెతో మాట్లాడుతూ..తన సినిమాలకు హెయిర్ డ్రెస్సర్‌గా ఉంటానని మిక్కీ అడిగాడు. అందుకు హెలెన్ సినీ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటే మేకప్ ఆర్టిస్ట్‌గా రమ్మని సలహ ఇచ్చింది. అదే బెస్ట్ అని మిక్కీకి హెలెన్ సూచించింది. అలా హెయిర్ డ్రెస్సర్ కాస్తా మేకప్ మ్యాన్‌గా బ్రెష్ పట్టుకుని ముఖానికి మెరుగులు దిద్దడం ప్రారంభించాడు. తన కలను నెరవేర్చుకునేందుకు, సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కోసం ఎంతో ప్రయాసపడ్డాడు. చేయని ఉద్యోగం లేదు. అయితే కష్టపడి ఏదోరకంగా సినీ ఇండస్ట్రీలో మేకప్ మ్యాన్‌గా అవకాశం వచ్చినా..అది కేవలం సినిమాలో మిగతా తారాగణానికే వేయాల్సి వచ్చేది. సినిమాలో నటించే మెయిన్ హీరోయిన్‌కి వేసే అవకాశం దక్కేదే కాదు. ఆ అవకాశం ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎంతో ఎదురుచూపులు చూడాల్సి వచ్చేది. చివరికి 1992లో కాజోల్‌తో ‘బేఖుడి’ సినిమాతో మిక్కీకి మంచి బ్రేక్ వచ్చింది. అలా వెనుదిరిగి చూసుకోకుండా..హమ్ అప్కే హై కౌన్, దిల్ తో పాగల్ హై, కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషీ కభీ ఘమ్, కల్ హో నా హో, మొహబత్తెయిన్, మై నేమ్ ఈజ్ ఖాన్, కార్తీక్ కాలింగ్ కార్తీక్, డాన్, వీరే ది వెడ్డింగ్, వంటి చిత్రాలకు మేకప్ మ్యాన్‌గా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. నీతా అంబానీ, ఇషా అంబానీ, టాలీవుడ్ హీరోయిన్ శ్రీదేవి, కరీనా కపూర్, అలియా భట్, అనన్యపాండే వంటి ప్రముఖులకు మేకప్ వేసేది మిక్కీనే. చెప్పాలంటే సెలబ్రిటీల మేకప్ ఆర్టిస్ట్‌గా పేరుతెచ్చుకున్నాడు. అతను మేకప్ వేయడానికి ఒకరోజుకి 75,000 నుండి రూ. లక్ష వరకు ఫీజు ఛార్జ్ చేస్తాడు. అంతేగాదు మిక్కీ భారతదేశంలోని అత్యంత సంపన్నమైన మేకప్ ఆర్టిస్ట్‌లో ఒకరు కూడా.(చదవండి: వెయిట్ లాస్ స్టోరీ: ఐస్‌క్రీం తింటూ 16 కిలోలు..!) -
నాకు తెలిసిన బెస్ట్ మేకప్ మ్యాన్ ఇతనే: మహేశ్ బాబు
పట్టాభి ది బెస్ట్ మేకప్ మ్యాన్ అంటున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ రోజు మహేశ్ బాబు మేకప్ మ్యాన్ పట్టాభి బర్త్‌డే. ఈ సందర్భంగా మహేశ్‌బాబు సోషల్ మీడియా వేదికగా అతనికి బర్త్‌డే విషెస్ తేలియజేశాడు. ‘నాకు తెలిసిన వారిలో బెస్ట్ మేకప్ మ్యాన్ ఇతను. పుట్టిన రోజు శుభాకాంక్షలు పట్టాభి. ఈ ఏడాది మీకు మరింత అద్భుతంగా ఉండాలి. మీ మీద ఎప్పటికి ప్రేమ, గౌరవం అలాగే ఉంటుంది’అని మహేశ్ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ చేసిన వెంటనే మహేశ్ అభిమానులు పెద్ద ఎత్తున పట్టాభికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, మహేశ్ ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ చేస్తున్నాడు. ఈ సినిమా అనంతరం మాటల మాంత్రికుడు తివిక్రమ్‌తో ఓ మూవీ చేయబోతున్నాడు. Happy birthday to the best makeup man I've ever known! Wishing you a great year ahead Pattabhi.. Love and respect always 🤗 pic.twitter.com/qElpia8fC6 — Mahesh Babu (@urstrulyMahesh) July 8, 2021 -
సూపర్‌స్టార్ మేకప్‌మ్యాన్ కన్నుమూత
సాక్షి, చెన్నై : తమిళ చిత్ర పరిశ్రమలో గొప్ప మేకప్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న ముత్తప్ప(75) కన్నుమూశారు. వయోభారంతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. తలైవా రజనీకాంత్ సహా పలువురు ప్రముఖులు ముత్తప్ప నివాసానికి వెళ్లి ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. కాగా ఏవీఎం ముత్తప్పగా ప్రాచుర్యం పొందిన ముత్తప్ప 15 ఏళ్ల వయస్సులోనే చిత్ర పరిశ్రమలో ప్రవేశించారు. తమిళ స్టార్లు దివంగత శివాజీ గణేషన్, సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలకు మేకప్ ఆర్టిస్టుగా పనిచేశారు. దాదాపు 60 సంవత్సరాలుగా సినీరంగానికి సేవలు అందించిన ముత్తప్ప చాలా ఏళ్లుగా రజనీకాంత్ వ్యక్తిగత మేకప్ ఆర్టిస్టుగా ఉన్నారు. -
మేకప్ మ్యాన్ భార్యకు అమితాబ్ భారీ బహుమతి
అమితాబ్ బచ్చన్.. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ బాలీవుడ్ మెగాస్టార్‌కు ఎవరైనా కష్టపడుతున్నట్లు తెలిస్తే చాలు, ఆయన గుండె ఇట్టే కరిగిపోతుంది. దాదాపు 40 ఏళ్లుగా తన మేకప్ మ్యాన్‌గా ఉన్న దీపక్ సావంత్ భార్యకు ఆయన ఏకంగా రేంజిరోవర్ కారు బహూకరించారు. దీపక్ సావంత్ భార్య సరోద్ చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తాను కూడా లగ్జరీ కారులో తిరగాలని, ఆ కారు తన సొంతం కావాలని ఆమెకు కోరిక ఉండేది. ఆ విషయం ఎలాగో అమితాబ్ చెవిన పడింది. దాంతో వెంటనే ఆయన తనవద్ద ఉన్న రేంజి రోవర్ కారును ఆమెకు బహుమతిగా ఇచ్చేశారు. సాధారణంగా అమితాబ్ ఏదైనా కారు కొన్నారంటే దాన్ని మూడు నాలుగేళ్లు వాడిన తర్వాత అమ్మేసి, మరో కొత్త కారు కొంటారు. కానీ ఈ కారు మాత్రం 2002 నుంచి.. అంటే దాదాపు 12 ఏళ్లుగా అమితాబ్ దగ్గరే ఉంది. అదంటే ఆయనకు చాలా ఇష్టం. అయినా చాలా తక్కువసార్లు మాత్రమే ఆ కారును ఉపయోగించారు. సరోద్ కోరిక గురించి తెలియగానే ఆమెకు దాన్ని బహుమతిగా ఇచ్చేశారని అమితాబ్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీనిపై దీపక్ సావంత్‌ను అడిగితే, 'నా భార్యకు బచ్చన్‌జీ ఓ కారు బహుమతిగా ఇచ్చారు' అని చెప్పాడు.