'మోడీ... నా కూతురిని బాగా చూసుకో'
ఉత్తరప్రదేశ్ లోని గాజియాబాద్ లో ఆర్దిక సమస్యలతో ఒక 35 ఏళ్ల వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి తన చివరి లేఖలో 'నరేంద్ర మోడీ ... మీరు ప్రధానమంత్రి కాబోతున్నారు. కానీ ఆర్ధిక సమస్యల వల్ల నేను వెళ్లిపోతున్నాను. నా కూతురు బాధ్యత మీదే. దయచేసి ఆమె బాగోగులు చూసుకొండి' అని రాశాడు.
ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి పేరు ఓం ప్రకాశ్ తివారీ. తివారీ తన ఒక పేజీ లేఖలో తన ఆర్ధిక సమస్యలను గురించి వివరించాడు. తాను ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడో కూడా వివరించాడు. చివరికి మోడీని తన కూతురును కాపాడమని కోరాడు.
పోలీసులు మృతుడి భౌతికకాయాన్ని పోస్ట్ మార్టమ్ కోసం పంపించారు.