తల్లీ కొడుకులిద్దరూ కలిసి దేశాన్ని సర్వనాశనం చేశారంటూ సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ నరేంద్రమోడీ మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే దేశంలో అవినీతిపరులైన నాయకులను కటకటాల వెనక్కి తోస్తానని చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్లో ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అవినీతి, నేరచరిత్ర ఉన్న ఏ ఒక్క నాయకుడినీ తాను వదిలేది లేదని మోడీ చెప్పారు. అవినీతిపరులైన ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణను వేగవంతం చేయాల్సిందిగా కూడా తాను సుప్రీంకోర్టును అడుగుతానని తెలిపారు. ప్రజలంతా స్వచ్ఛమైన రాజకీయాలకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.
సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్, ఆయన కొడుకు అఖిలేష్ యాదవ్ కలిసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. యూపీ వాసులు ఎంతమందిని వీలైతే అంతమంది బీజేపీ అభ్యర్థులను లోక్సభకు పంపాలని కోరారు. ''ఢిల్లీలో తల్లీకొడుకులు, ఇక్కడ తండ్రీ కొడుకులు ఇద్దరూ సర్వనాశనం చేస్తున్నారు'' అని మోడీ అన్నారు. ఇక్కడ పోలీసుల వద్ద ఉన్న ఆయుధాల కంటే, ప్రజల వద్ద ఉన్న ఆయుధాల సంఖ్యే ఎక్కువని ఎద్దేవా చేశారు.
తల్లీ కొడుకులు దేశాన్ని నాశనం చేశారు
Published Mon, Apr 21 2014 2:56 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement