లండన్: ఆసియూలో ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలోని మొదటి ఐదుగురిలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియూగాంధీ, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీలకు చోటు దక్కింది. చైనా అధ్యక్షుడు, అధికార కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా అధినేత అరుున గ్జి జిపింగ్ 2014 సంవత్సరానికి గాను రూపొందించిన ఈ జాబితాలో తొలి స్థానంలో నిలిచారు.
ఏషియన్ అవార్డ్స్ లిమిటెడ్ ప్రచురించిన ఈ జాబితాలో సోనియూ రెండు, చైనా ప్రధాని లి కెకియూంగ్ (3), మోడీ (4), రాహుల్ (5) వరుసగా ఆయూ స్థానాల్లో ఉన్నారు. ఇక ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ (6), హాంగ్‌కాంగ్‌కు చెందిన వ్యాపార దిగ్గజం లి కా షింగ్ (7), ఐక్యరాజ్యసమితి అధ్యక్షుడు బాన్ కీ మూన్ (8), జపాన్ ప్రధాని షింజో అబె (9), దక్షిణ కొరియూ అధ్యక్షుడు పార్క్ గెన్ హై (10)లు టాప్ 10లో ఉన్నారు. ఆర్థికమంత్రి పి.చిదంబరం 11వ స్థానంలో ఉంటే.. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ మాత్రం 19వ స్థానంలో నిలిచారు. ప్రముఖ వ్యాపారవేత్త పాల్ సాగూ ఈ అవార్డులను నెలకొల్పారు.
ప్రభావశీలురైన తొలి ఐదుగురిలో సోనియూ, మోడీ, రాహుల్
Published Mon, Apr 7 2014 2:17 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement
Advertisement