ఘజియాబాద్: బయటివాళ్లను అపార్ట్‌మెంట్ లోపలికి అనుమతిస్తే జరిమానాతో పాటు కరెంటు, నీళ్లను కట్ చేస్తామంటూ ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ అపార్ట్‌మెంట్ అసోసియేషన్ ప్రకటించింది. కరోనా కట్టడిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు నోటీసులు జారీ చేసింది. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కరాళనృత్యం చేస్తున్న నేపథ్యంలో ఈ కఠిన నిబంధనలు తెచ్చినట్లు పేర్కొంది. అపార్ట్‌మెంట్ వాసులు కొత్తవారిని లోపలికి అనుమతిస్తే 11 వేల రూపాయల జరిమానాతో పాటు నీళ్లు, కరెంట్ కూడా కట్ చేస్తామని అసోసియేషన్ వెల్లడించింది. అంతేకాకుండా జరిమానా డబ్బులు చెల్లించేంత వరకు కరెంట్, నీళ్ల సేవలు పునరిద్దరించమంటూ తీవ్రంగా హెచ్చరించింది. (సరుకులు తీసుకురమ్మంటే అమ్మాయిని తెచ్చాడు)
ఇప్పటికే రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌లోని మూడు సొసైటీలు కంటైన్‌మెంట్ జోన్లలోకి వెళ్లడంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నిబంధనలు అతిక్రమిస్తే లీగల్ నోటీసులను ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా హెచ్చరించింది. తాజా నిబంధనలపై అపార్ట్‌మెంట్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమతో సంప్రదించకుండా ఎంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్పందించిన అపార్ట్‌మెంట్ అసోసిషేయన్ సభ్యులు నిబంధనలు అతిక్రమించిన రోడ్లపైకి వచ్చేవారిపై పోలీసులు ఎలా చర్యలు తీసుకుంటున్నారో మేము కూడా అపార్ట్‌మెంట్ వాసుల సంక్షేమం దృష్ట్యా కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ మొత్తం డబ్బును పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళంగా ఇస్తామని అసోసియేషన్ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment