లక్నో: పుదుచ్చేరిలో కోవిడ్‌తో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని గుంతలో విసిరేసిన ఘటన మరువకముందే మరో ఉదంతం వెలుగు చూసింది. కరోనా మృతదేహాన్ని సగం కాలిన స్థితిలో వదిలేసిన దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. ఇందిరాపురానికి చెందిన వ్యాపారవేత్త కరోనాతో పోరాడి సోమవారం తనువు చాలించాడు. ప్రోటోకాల్ ప్రకారం అతని శవాన్ని వైద్యసిబ్బంది ఘజియాబాద్‌లోని విద్యుత్ శ్మశానవాటికకు తరలించారు. అక్కడ విద్యుత్ మిషన్‌లో మృతదేహాన్ని పెట్టి వెళ్లిపోయారు.. కనీసం పూర్తిగా ఖననం అయ్యేవరకు కూడా ఉండలేదు. (ఆస్పత్రి నుంచి తప్పించుకుని సొంతూరుకు)
అయితే సదరు యంత్రం మధ్యలో ఆగిపోవడంతో అతని మృతదేహం సగం కాలిన స్థితిలో పడి ఉంది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం అతడిని దహనం చేస్తే ఇప్పటికీ అక్కడ శవం సగం కాలిన స్థితిలోనే ఉందని మండిపడ్డారు. దీంతో చర్యలు చేపట్టిన అధికారులు సుమారు 29గంటల తరువాత అంటే బుధవారం మధ్యాహ్నం నాటికి తిరిగి అతని శవాన్ని పూర్తిగా ఖననం చేశారు. అతని అంత్యక్రియలు పూర్తి కాకపోవడంతో కుటుంబం సహా బంధువులు అంతా ఒకరోజు పస్తులు ఉండాల్సి వచ్చింది. (వాళ్లను రానిస్తే మీ ఇంట్లో కరెంట్, నీళ్లు కట్)
Comments
Please login to add a commentAdd a comment